హోలీ పండుగ అంటే ఏమిటి – What is Holi festival in Telugu?

హోలీ పండుగ హిందూ సంప్రదాయానికి చెందిన ప్రాచీన మరియు ప్రముఖ పండుగ. ఈ రోజు చెడు పై మంచి విజయాన్ని సాధించిందని కూడా సూచిస్తుంది. 

హోలీ పండుగ శీతాకాలం యొక్క ముగింపును మరియు వసంత ఋతువు ఆగమనాన్నిజరుపుకుంటుంది. 

హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగ ఫాల్గుణ నెలలో పూర్ణిమ రోజు సాయంత్రం రోజు జరుపుకోవటం ప్రారంభిస్తారు. ఈ పండగ ఒక రాత్రి మరియు ఆ మరుసటి రోజు మొత్తం జరుపుకుంటారు. 

హోలీ పండుగ ముందు రోజును చోటి హోలీ (చిన్న హోలీ) అని కూడా   పిలుస్తారు. 

పండుగ ముందు రోజు సాయంత్రాన్ని బోగి మంట మరియు పూజలతో జరుపుకోవటం ప్రారంభిస్తారు. 

రాజు హిరణ్యకశిపుని సోదరి హోళికా ఎలాగైతే అగ్ని లో చంపబడిందో అలాగే తమ లోపల ఉన్న చెడును నాశనం కావాలని కోరుకుంటారు. 

మరుసటి రోజు స్నేహితులు మరియు బంధువులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఈ రోజును జరుపుకుంటారు. 

ఈ పండగ ను ఇండియా లోనే కాకుండా ఆసియ మొత్తంలో మరియు వెస్ట్రన్ దేశాలలో జరుపుకుంటారు. 

హోలీ పండుగ చరిత్ర:

హోలీ పండుగ జరుపుకోవటం వెనక వివిధ కథనాలు ఉన్నాయి. 

హోలిక: 

మొదటి కథనం ప్రకారం అసురుల యొక్క రాజు అయిన హిరణ్యకశిపుడు   చాలా కాలం తప్పస్సు చేసి బ్రహ్మ దేవుడితో ఒక వరాన్ని కోరాడు. 

తనను “పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల మరియు బయట, భూమి పైన లేదా ఆకాశంలో, మనుషులు లేదా జంతువులతో, అస్త్రములు లేదా శస్త్రములతో చావు లేకుండా”  వరాన్ని ప్రసాదించమని కోరతాడు.

ఈ వరానికి దేవుడు తథాస్తు చెప్పగా హిరణ్యకశిపుడు తనను ఇక ఎవ్వరు చంపలేరని అహంకారం పెంచుకున్నాడు. 

తనకు చావు లేదు కాబట్టి  తానే దేవుడని అందరు తననే పూజించాలని అందరిని ఆదేశించాడు.   

తన కుమారుడు ప్రహ్లదుడు హిరణ్యకశిపుడు ను దేవుడిగా స్వీకరించటానికి నిరాకరించాడు. ప్రహ్లదుడు విష్ణువు దేవుడి భక్తుడు. 

తన కుమారుడు విష్ణువు దేవుడి భక్తుడు అని తెలిసి కోపం తో హిరణ్యకశిపుడు ప్రహ్లదుడుని చంపడానికి పలు రకాల శిక్షలు విధించాడు. 

ఒకసారి ప్రహ్లాదుడి నోట్లో విషం పోసాడు కానీ విషం యొక్క ప్రభావం కలగలేదు. ఏనుగులతో తొక్కించి చంపాలనుకున్నాడు ఆ ప్రయత్నం కూడా విఫలం అయ్యింది. విష సర్పాల గదిలోకి పంపించిన ప్రహ్లాదుడు బతికాడు. 

చివరికి తన సోదరి హోలికా తో  కలిసి చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. హోలికా చితిలో కాలకుండా ఒక వస్త్రం ధరించింది. చితి యొక్క మంటలకు హోలికా శరీరం నుంచి ఆ వస్త్రం జరిగి ప్రహ్లదుడి ను చుట్టుకుంది. ఫలితంగా హోలికా చనిపోతుంది ప్రహ్లదుడు కాపాడబడుతాడు. 

ఈ కారణంగానే హోలీకి ముందు రోజు బోగి మంటలు వెలిగించటం జరుగుతుంది.                   

మరోవైపు విష్ణువు దేవుడు హిరణ్యకశిపుడిని చంపటానికి నరసింహ అవతారాన్ని ఎత్తుతాడు. 

హిరణ్యకశిపుడి వరానికి వ్యతిరేకంగా సగం మనిషి మరియు సగం సింహ రూపంలో,  ఉదయం మరియు రాత్రి కాని సాయత్రం పూట, ఇంటి లోపల మరియు బయట కాకుండా ఇంటి గుమ్మం పై కూర్చొని, అస్త్రాలు మరియు శస్త్రాలు కాకుండా సింహపు గోర్లతో, భూమిపై మరియు ఆకాశంలో కాకుండా తన వడిలో కూర్చుబెట్టుకొని చంపబడుతాడు. 

ఇలా చెడు పై మంచి విజయం సాధించినందుకు హోలీ పండుగను జరుపుకుంటారు. 

రాధా కృష్ణ :

ఇంకొక కథనం ప్రకారం యవ్వనంలో కృష్ణుడి రంగును రాధా ఇష్టపడుతుందో లేదో అని అనుకున్నాడు. 

ఇది గమనించిన యశోద కృష్ణుడి ని రాధా దగ్గరికి వెళ్లి తనకు నచ్చిన రంగును తన ముఖం పై పూయమని అడగాలని చెప్పింది. అలా హోలీ పండుగా మొదలయ్యిందని భావిస్తారు. 

హోలీ మన తెలుగు రాష్ట్రాలలో కాకుండా బీహార్, బెంగాల్, ఒరిస్సా, గుజరాత్ మరియు మహారాష్ట్ర లో కూడా జరుపుకుంటారు. భారతదేశం అంతటా ఈ పండగను జరుపుకుంటారు. 

ఈ పండగ రోజున కృత్రిమ రంగులను కాకుండా సహజ రంగులను వాడాలని కూడా పెద్దలు సూచిస్తూ ఉంటారు.                  

Sources: Holi – Wikipedia

Leave a Comment