వ్లాదిమిర్ పుతిన్ జీవిత చరిత్ర – Vladimir Putin biography in Telugu

వ్లాదిమిర్ పుతిన్ రష్యా కి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి. 2012 వ సంవత్సరం నుంచి పుతిన్ ప్రెసిడెంట్ అఫ్ రష్యా గా ఉన్నారు. 

1999వ సంవత్సరం నుంచి పుతిన్ ప్రెసిడెంట్ గా లేదా ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. 

బాల్యం: 

పుతిన్ 7 అక్టోబర్ 1952వ సంవత్సరంలో లెనిన్‌గ్రాడ్, సోవియట్ యూనియన్‌లో (ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా) వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్ మరియు మరియా ఇవనోవ్నా పుతినా అనే దంపతులకు జన్మించారు. 

ఈ దంపతులకు పుట్టిన ముగ్గురు సంతానంలో పుతిన్ అందరిలో చిన్నవాడు. పుతిన్ కన్నా ముందు పుట్టిన ఇద్దరు సంతానంలో 1930 లో పుట్టిన మొదటి సంతానం ఆల్బర్ట్ బాల్యంలోనే మరణించాడు. 

రెండవ సంతానం విక్టర్ 1940లో పుట్టి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1942లో నాజీ జర్మనీ దళాలచే లెనిన్‌గ్రాడ్ నగరం ముట్టడి సమయంలో డిఫ్తీరియా మరియు ఆకలితో మరణించాడు. 

అతని తాత, స్పిరిడాన్ పుతిన్ (1879-1965), వ్లాదిమిర్ లెనిన్ మరియు జోసెఫ్ స్టాలిన్‌లకు వంటవాడి గా ఉన్నారు. 

పుతిన్ తల్లి ఫ్యాక్టరీ వర్కర్ మరియు అతని తండ్రి 1930ల ప్రారంభంలో సోవియట్ నేవీలో జలాంతర్గామి నౌకాదళంలో పనిచేసేవారు. 

చదువు: 

1960 వ సంవత్సరంలో పుతిన్ ఇంటి దగ్గరే ఉండే స్కూల్ లో చదవటం ప్రారంభించారు. 

12 సంవత్సరాల వయస్సులో పుతిన్ సాంబో మరియు జూడో అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం ప్రారంభించారు. 

ఖాళీ సమయాలలో పుతిన్ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ మరియు లెనిన్  రచనలను చదివేవారు. పుతిన్ జర్మన్ భాషను కూడా నేర్చుకున్నాడు, ఇది పుతిన్ యొక్క సెకండ్ లాంగ్వేజ్. 

పుతిన్ లెనిన్గ్రాడ్ స్టేట్ యూనివర్శిటీ లో 1975 సంవత్సరంలో లా చదువును చదవటం పూర్తి చేసారు. 

1997లో పి.హెచ్.డి. సెయింట్ పీటర్స్‌బర్గ్ మైనింగ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో (అభ్యర్థి ఆఫ్ ఎకనామిక్ సైన్సెస్) ఖనిజ ఆర్థిక వ్యవస్థ యొక్క వ్యూహాత్మక ప్రణాళికపై థీసిస్ కోసం.

1997లో సెయింట్ పీటర్స్‌బర్గ్ మైనింగ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో ఖనిజ ఆర్థిక వ్యవస్థ యొక్క వ్యూహాత్మక ప్రణాళిక (strategic planning of the mineral economy)పై థీసిస్ కోసం పి.హెచ్.డి పట్టాను పొందారు. 

కేజీబీ కెరీర్ : 

1975 వ సంవత్సరంలో పుతిన్  intelligence service (గూఢచార సేవ) అయిన KGB లో చేరారు, లెనిన్గ్రాడ్ లోనే తన ట్రైనింగ్ ను తీసుకున్నారు. 

1975 నుంచి 1990 వరకు వివిధ ప్రాంతాలలో పుతిన్ KGB లో పనిచేసారు. 

సోవియట్ ప్రెసిడెంట్ మిఖాయిల్ గోర్బచేవ్‌కి వ్యతిరేకంగా 1991 సోవియట్ తిరుగుబాటు ప్రయత్నం యొక్క రెండవ రోజున, 20 ఆగస్టు 1991న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో రాజీనామా చేసినట్లు పుతిన్ పేర్కొన్నారు.

 “తిరుగుబాటు ప్రారంభమైన వెంటనే, నేను ఏ వైపు ఉన్నానో నేను వెంటనే నిర్ణయించుకున్నాను”  అని పుతిన్ తెలిపారు. 

పొలిటికల్ కెరీర్: 

మే 1990లో, పుతిన్ లెనిన్‌గ్రాడ్ మేయర్ అనటోలీ సోబ్‌చాక్‌కు అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారుడిగా నియమితులయ్యారు.

28 జూన్ 1991న  External Relations of the Mayor’s Office కమిటీ యొక్క హెడ్ గా నియమించబడ్డారు. 

మార్చి 1994లో, పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రభుత్వానికి మొదటి డిప్యూటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

1996 వ సంవత్సరంలో పుతిన్ మాస్కో వెళ్లారు, అక్కడ ప్రెసిడెన్షియల్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ చీఫ్ గా నియమించబడ్డారు. 

26 మార్చి 1997న, ప్రెసిడెంట్ బోరిస్ యెల్ట్సిన్ ప్రెసిడెన్షియల్ స్టాఫ్‌కు పుతిన్ డిప్యూటీ చీఫ్‌గా నియమితులయ్యారు. 

25 మే 1998న, పుతిన్ ప్రాంతాలకు అధ్యక్ష సిబ్బందికి మొదటి డిప్యూటీ చీఫ్‌గా నియమితులయ్యారు.

పుతిన్ 1999 నుంచి 2000 సంవత్సరం వరకు  ప్రధాన మంత్రిగా పనిచేసారు. 

2000 సంవత్సరం నుంచి  2008 వ సంవత్సరం వరకు ప్రెసిడెంట్ గా పనిచేసారు.  

2008 నుంచి 2012 వరకు ప్రధాన మంత్రి గా పనిచేసారు. 2012 నుంచి ప్రస్తుతం వరకు ప్రెసిడెంట్ గా ఉన్నారు.  

Source: Vladimir Putin – Wikipedia

Leave a Comment