నుపుర్ సనన్ భారత దేశానికి చెందిన నటి మరియు సింగర్. ఈమె ఇప్పటివరకు ఒక తెలుగు సినిమాలో నటించారు.
బాల్యం:
నుపుర్ సనన్ 15 డిసెంబర్ 1995 వ సంవత్సరంలో జన్మించారు. ఈమె రాహుల్ సనన్ మరియు గీత సనన్ అనే దంపతులకు జన్మించారు. నుపుర్ హీరోయిన్ కృతి సనన్ యొక్క చెల్లెలు.
నుపుర్ తన స్కూల్ చదువును ఢిల్లీ లోని R.K Puram లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివారు.
కాలేజి చదువును ఢిల్లీ లోని యూనివర్సిటీ అఫ్ ఢిల్లీ నుంచి పూర్తి చేసారు.
కెరీర్:
నుపుర్ సనన్ తన సినిమా కెరీర్ ను Tiger Nageswara Rao అనే తెలుగు సినిమా ద్వారా డెబ్యూ చేసారు.
సినిమా కాకుండా ఫిల్హాల్ (filhaal) అనే మ్యూజిక్ వీడియో ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో కలిసి చేసారు.