సునీతా విలియమ్స్ అమెరికాకు చెందిన వ్యోమగామి మరియు యునైటెడ్ స్టేట్స్ నేవీ ఆఫీసర్. విలియమ్స్ కి ఎక్కువ స్పేస్ వాక్ చేసిన మరియు ఎక్కువ స్పేస్ వాక్ టైం ఉన్న మహిళ గా రికార్డు ను కలిగి ఉన్నారు.
Table of Contents
బాల్యం :
సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 16, 1965 వ సంవత్సరంలో ఒహాయో స్టేట్ లోని యూక్లిడ్ నగరంలో పుట్టారు.
సునీతా విలియమ్స్ యొక్క తండ్రి ముంబై కి చెందిన దీపక్ పాండ్య, భారతీయ అమెరికన్ న్యూరోఅనాటమిస్ట్ మరియు తల్లి ఉర్సులిన్ బోనీ పాండ్య, స్లోవేనే అమెరికన్.
విలియమ్స్ తండ్రి కుటుంబం గుజరాత్ కి చెందినది మరియు తల్లి యొక్క కుటుంబం స్లోవేనియా కి చెందినది. విలియమ్స్ తల్లి 11 సంవత్సరాల వయస్సులో అమెరికాకు వలస వచ్చారు.
1983 వ సంవత్సరంలో మసాచుసెట్స్ లోని నీధమ్ హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు.
1987 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుంచి భౌతిక శాస్త్రం లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ను పూర్తి చేసుకున్నారు.
1995 సంవత్సరంలో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మానేజ్మెంట్ లో మాస్టర్ అఫ్ సైన్స్ ను పూర్తి చేసుకున్నారు.
కెరీర్ :
1987 వ సంవత్సరంలో విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నేవీలో చేరారు.
1989 వ సంవత్సరంలో నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండ్ లో నావల్ ఏవియేటర్ గా పనిచేసారు.
విలియమ్స్ హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 3 లో H-46 సీ నైట్ యొక్క శిక్షణ పొందింది. అక్కడి నుంచి వర్జీనియాలోని నార్ఫోక్‌లోని హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 8 (HC-8) గా నియమించబడింది.
అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆపరేషన్ డెసర్ట్ షీల్డ్, ఆపరేషన్ ప్రైవైడ్ కంఫర్ట్ లో మెడిటేరియన్, రెడ్ సీ మరియు పెర్షియన్ గల్ఫ్ వద్ద నియమించబడ్డారు.
సెప్టెంబర్ 1992 వ సంవత్సరంలో హరికేన్ ఆండ్రూ సహాయక చర్యల కోసం ఇంచార్జ్ ఆఫీసర్ గా నియమించబడ్డారు.
1993 వ సంవత్సరంలో U.S. నావల్ టెస్ట్ పైలట్ స్కూల్ లో ట్రైనింగ్ ను మొదలుపెట్టారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరవాత స్క్వాడ్రన్ సేఫ్టీ ఆఫీసర్ గా పలు ఫ్లైట్లను నడిపారు.
1995 వ సంవత్సరంలో నావల్ టెస్ట్ పైలట్ స్కూల్ తిరిగి వెళ్లి రోటరీ వింగ్ డిపార్ట్మెంట్ లో ఇన్స్ట్రక్టర్ మరియు స్కూల్ సేఫ్టీ ఆఫీసర్ గా పనిచేసారు.
అక్కడినుంచి USS Saipan షిప్ లో ఎయిర్ క్రాఫ్ట్ హాండ్లర్ మరియు అసిస్టెంట్ ఎయిర్ బాస్ గా నియమించబడ్డారు.
1998 లో నాసా ఆస్ట్రోనాట్ ప్రోగ్రాం కోసం సెలెక్ట్ అయినప్పుడు 30 ఎయిర్ క్రాఫ్ట్ రకాల మరియు 3000 గంటల ఫ్లైట్ నడిపిన అనుభవం కలిగి ఉన్నారు.
నాసా :
1998 వ సంవత్సరంలో జాన్సన్ స్పేస్ సెంటర్ లో వ్యోమగామి ట్రైనింగ్ ను మొదలుపెట్టారు.
2006 వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి స్పేస్ షటిల్ డిస్కవరీ లో Expedition 14 (అన్వేషణ యాత్ర) ను చేసారు. 2007 వ సంవత్సరంలో Expedition 14 ను చేసారు.
2007 వ సంవత్సరంలో జనవరి 31, ఫిబ్రవరి 4 మరియు ఫిబ్రవరి 9 న మూడు స్పేస్ వాక్ లను చేసారు.
2007 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో నాసా విలియమ్స్ ను భూమి మీదకు తీసుకువచ్చింది.
భూమి మీదకు వచ్చిన తరవాత విలియమ్స్ STS-117 స్పేస్ షటిల్ అట్లాంటిస్ లో ISS కి వెళ్లి జూన్ 22, 2007 వ సంవత్సరం తిరిగి వచ్చారు.
ఇలా 2007 వ సంవత్సరంలో దాదాపు 6 నెలలు స్పేస్ లో గడిపిన తరవాత ఇంటికి వెళ్లారు.
2007 వ సంవత్సరంలో నే స్పేస్ నుంచే బోస్టన్ మారథాన్ లో పాల్గొన్నారు. నాలుగు గంటల 24 నిమిషాలలో మారథాన్ ను పూర్తి చేసారు.
2012 సెప్టెంబర్ నెలలో ట్రేడ్ మిల్, స్టేషనరీ బైక్, స్విమ్మింగ్ కోసం మరియు వెయిట్ లిఫ్టింగ్ కోసం Advanced Resistive Exercise Device ను ఉపయోగించారు. ఇలా స్పేస్ లో ట్రయాథ్లాన్ చేసిన మొట్ట మొదటి వ్యక్తిగా నిలిచారు.
2012 వ సంవత్సరంలో జులై 15 వ తారీఖున Expedition 32 మరియు 33 ను పూర్తి చేసారు.
వ్యక్తిగత జీవితం :
సునీతా విలియమ్స్ టెక్సాస్ కు చెందిన ఫెడరల్ పోలీస్ ఆఫీసర్ మైఖేల్ J. విలియమ్స్ ను పెళ్లి చేసుకున్నారు.
2007 వ సంవత్సరంలో సబర్మతి ఆశ్రమం మరియు గుజరాత్ లోని తన పూర్వీకుల గ్రామము ఝులసన్ ను సందర్శించారు.
అవార్డులు :
నేవీ కమెండేషన్ మెడల్
నేవీ మరియు మెరైన్ కార్ప్స్ అచీవ్‌మెంట్ మెడల్
మానవతా సేవా పతకం
NASA స్పేస్ ఫ్లైట్ మెడల్
మెడల్ “ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్”, రష్యా దేశం
పద్మ భూషణ్, భారత దేశం
గౌరవ డాక్టరేట్, Gujarat Technological University
గోల్డెన్ ఆర్డర్ ఫర్ మెరిట్స్, స్లోవేనియా ప్రభుత్వం