అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర – Akkineni Nageswara Rao biography in Telugu

అక్కినేని నాగేశ్వరరావు ఇండియా లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటుడు మతియు నిర్మాత. ఈయనను అందరు షార్ట్ గా ANR అని అంటారు.

నాగేశ్వరరావు తన కెరీర్ లో జీవిత చరిత్రలపై మరియు దేవుడి పాత్రలపై చేసిన సినిమాలు మంచి గుర్తింపు ను తీసుకువచ్చాయి.

1970’s లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకురావటంలో కీలక పాత్రను వహించారు.

1976 వ సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియో ను నిర్మించి తెలుగు సినిమాకు మంచి ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను అందించారు.

బాల్యం :

అక్కినేని నాగేశ్వరరావు 20 సెప్టెంబర్ 1923 వ సంవత్సరం, అక్కినేని వెంకటరత్నం మరియు అక్కినేని పున్నమ్మ అనే దంపతులకు కృష్ణ జిల్లాలోని రామాపురం లో జన్మించారు.

తన తల్లి తండ్రులు ఒక రైతు కుటుంబానికి చెందిన వారు కావటం మరియు ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండకపోవటం వల్ల ప్రాథమిక పాఠశాల విద్య ను మాత్రమే పూర్తి చేసుకున్నారు.

కేవలం 10 సంవత్సరాల వయస్సులో థియేటర్ లో నటించటం ప్రారంభించారు. ఆ రోజుల్లో మహిళలకు నటించడంలో నిషేధం ఉండటం వల్ల నాగేశ్వరరావు అమ్మాయిల పాత్రలు చేసేవారు.

1941 వ సంవత్సరంలో 18 సంవత్సరాల వయస్సులో ధర్మపత్ని అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ గా నటించారు.

ఒకసారి నాగేశ్వరరావు గారు విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు ప్రముఖ సినీ నిర్మాత ఘంటసాల బలరామయ్య చూసి సినిమా కోసం తీసుకోవాలనుకున్నారు. ఆ రోజు తరవాత నాగేశ్వరరావు జీవితం మారిపోయింది.

1944 వ సంవత్సరంలో ఘంటసాల బలరామయ్య నాగేశ్వర్ రావు ను శ్రీ సీతా రామ జననం అనే సినిమాలో లీడ్ రోల్ ను ఇచ్చారు.

కెరీర్ :  

అక్కినేని నాగేశ్వరరావు మాయాబజార్, సంసారం, బ్రతుకు వీధి, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగల్య బలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్య భర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజీ బుల్లోడు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించారు. 

1970’s లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకురావటంలో కీలక పాత్రను వహించారు.   

1976 వ సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియో ను నిర్మించి తెలుగు సినిమాకు మంచి ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను అందించారు. 

వ్యక్తిగత జీవితం : 

18 ఫిబ్రవరి, 1949 వ సంవత్సరంలో నాగేశ్వరరావు అన్నపూర్ణ తో పెళ్లి చేసుకున్నారు. తన భార్య పేరు మీదనే అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించారు. 

ఈ దంపతులకు 5 మంది పిల్లలు నాగార్జున, వెంకట్ రత్నం, సరోజ, సత్యవతి, నాగ సుశీల.  

 నాగేశ్వరరావు అభిమానులు నటసామ్రాట్ అని బిరుదు కూడా ఇచ్చారు.   

మరణం : 

19 అక్టోబర్ 2013 వ సంవత్సరంలో నాగేశ్వరరావు కాన్సర్ బారిన పడ్డారు. తన ఆఖరి సినిమా మనం సినిమా కూడా అలాగే పూర్తి చేసారు. 

2014 వ సంవత్సరం జనవరి 22 వ తారీఖున క్యాన్సర్ వ్యాధి కారణంగా అనారోగ్యం పాలయ్యి తన తుది శ్వాసను విడిచారు. 

అవార్డులు : 

పద్మవిభూషణ్ (2011)

పద్మ భూషణ్ (1988)

పద్మశ్రీ  (1968)

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1991)

ఇవే కాకుండా నాగేశ్వరరావు 7 నంది అవార్డులు మరియు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డు లను అందుకున్నారు.  

Source: Akkineni Nageswara Rao – Wikipedia

Leave a Comment