కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర – Konda Laxman Bapuji biography in Telugu

నిజాం పాలనకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా 1947 సంవత్సరం  నుంచి 1948 సంవత్సరం వరకు తెలంగాణ  విమోచనోద్యమంలో పాల్గొన్న నాయకులలో ప్రముఖుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. 

బాల్యం : 

కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 27, కొమరం భీం జిల్లాలోని వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల చిన్న వయస్సులో తల్లిని కోల్పోయారు. 

ఆసిఫాబాద్ లో ప్రాతమిక విద్యాభ్యాసం ను పూర్తి చేసారు. 

హైదరాబాద్ లో న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేసారు మరియు 1940 వ  సంవత్సరంలో లాయర్ గా పనిచేయటం మొదలుపెట్టారు. 

స్వాతంత్ర సమరంలో :

1940 లో లాయర్ అయిన తరవాత నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారిపై ఉన్న కేసులను వాదించి గెలిచేవారు.    

1942 వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 

స్వాతంత్రం వచ్చిన తరవాత దేశం మొత్తం సంబరాలు చేసుకుంటూ ఉంటె తెలంగాణ ప్రజలు మాత్రం ఇంకా నిజాం పాలనలోనే ఉన్నారు. నిజాం పాలన కి వ్యతిరేకంగా జరుగుతున్న విమోచనోద్యమంలో పోరాడారు. 

డిసెంబర్ 4, 1947 వ సంవత్సరంలో నిజాం రాజు పై బాంబులు విసిరిన సమూహం లో లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్నారు. 

రాజకీయ జీవితం : 

1952 వ సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి MLA గా గెలిచారు. 

1957 వ సంవత్సరంలో నల్గొండ జిల్లా చిన్నకొండూరు నియోజక వర్గం నుంచి లోని  నుంచి పోటీ చేసి MLA గా గెలిచారు. అదే సంవత్సరంలో డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోబడ్డారు.

 డిప్యూటీ స్పీకర్ గా 1957 నుంచి 1960 వరకు  పనిచేసారు.1960 నుంచి 1962 వరకు మంత్రిగా కూడా పనిచేసారు. 

భోంగీర్ నియోజక వర్గం నుంచి 1967 మరియు 1972 సంవత్సరంలో MLA గా ఎన్నుకోబడ్డారు. 

వ్యక్తిగత జీవితం :

లక్ష్మణ్ బాపూజీ గారి భార్య శకుంతల ఒక వైద్యురాలు. ఈ దంపతులకు 2  కుమారులు మరియు ఒక కూతురు. ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు   ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తూ మరణించారు. 

హైదరాబాదు లోని Horticultural University ( ఉద్యానవన విశ్వవిద్యాలయం) కి  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం గా పేరు పెట్టడం జరిగింది. 

మరణం : 

21 సెప్టెంబర్ 2012 వ సంవత్సరంలో హైదరాబాద్ లోని  తన ఇల్లు జల దృశ్యం లో తుది శ్వాస  విడిచారు. 


Source: Konda Laxman Bapuji – Wikipedia

Leave a Comment