మన్మోహన్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త మరియు రాజనీతిజ్ఞుడు. మన్మోహన్ సింగ్ 2004 సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు భారతదేశం యొక్క 13 వ ముఖ్యమంత్రి గా ఉన్నారు.
మన్మోహన్ సింగ్ భారతదేశంలో మొట్ట మొదటి సిక్కు ప్రధాన మంత్రి. జవహర్‌లాల్ నెహ్రూ మరియు ఇందిరా గాంధీ తరవాత ఎక్కువ కాలం ప్రధాన మంత్రిగా ఉన్నారు.
బాల్యం :
మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932 వ సంవత్సరంలో పాకిస్తాన్ దేశానికి చెందిన పంజాబ్ లో, గురుముఖ్ సింగ్ మరియు అమృత్ కౌర్ అనే దంపతులకు జన్మించారు.
చిన్న తనంలో తన తల్లి చనిపోయిన తరవాత తన నానమ్మ వద్ద పెరిగారు. మన్మోహన్ సింగ్ తన ప్రాతమిక విద్య ను ఉర్దూ లో పూర్తి చేసారు.
స్వాతంత్రం తరవాత మన్మోహన్ సింగ్ కుటుంబం భారతదేశంలోని అమృత్‌సర్ లో స్థిరపడ్డారు.
పంజాబ్ యూనివర్సిటీ నుంచి 1952 సంవత్సరంలో ఎకనామిక్స్ లో బాచిలర్ డిగ్రీ సంపాదించారు. 1954 వ సంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ ను సంపాదించారు.
1957 వ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ ట్రిపోస్ (Economics Tripos) ను పూర్తిచేసారు.
కెరీర్ :
కేంబ్రిడ్జ్ లో చదువు పూర్తి చేసుకున్న తరవాత ఇండియా కు తిరిగి వచ్చి పంజాబ్ యూనివర్సిటీ లో లెక్చరర్ గా చేరారు.
1960 వ సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ను చదివారు.
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ను పూర్తి చేసుకొని ఇండియా కు వచ్చిన తరవాత 1965 వ సంవత్సరం వరకు ఎకనామిక్స్ ప్రొఫెసర్ గానే పనిచేసారు.
1966 నుంచి 1969 వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ లో పనిచేసారు.
1969 నుంచి 1971 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా పనిచేసారు.
మంత్రి లలిత్ నారాయణ్ మిశ్ర ఎకనామిక్స్ లో మన్మోహన్ సింగ్ ప్రతిభ ను చూసి విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ యొక్క సలహాదారుడిగా నియమించబడ్డాడు.
1972 వ సంవత్సరంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన సలహాదారుడిగా ఉన్నారు.
1976 వ సంవత్సరంలో ఫైనాన్స్ మినిస్టరీ లో సెక్రటరీ గా ఉన్నారు. 1980 నుంచి 1982 వరకు ప్రణాళికా సంఘం (Planning Commission) లో ఉన్నారు.
1982 వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా నియమించబడ్డారు.
1985 నంచి 1987 వరకు ప్రణాళికా సంఘం యొక్క డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు.
1990 వ సంవత్సరంలో ప్రధాన మంత్రి చంద్ర శేఖర్ సింగ్ సోలంకి పదవీకాలం లో ఆర్థిక వ్యవహారాల సలహాదారుడిగా ఉన్నారు.
రాజకీయ జీవితం :
1991 వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రి గా ఎంచుకున్నారు.
2004 నుంచి 2014 వ సంవత్సరం దాకా ప్రధాన మంత్రిగా ఉన్నారు.
Source: Manmohan Singh – Wikipedia