కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త మరియు రచయిత. వీరేశలింగం స్త్రీ విద్య కోసం చాలా కృషి చేసారు. కృషి చేయటమే కాకుండా బాలికల కోసం పాఠశాలను కూడా ప్రారంభించాడు.
మగ పిల్లలతో కలిసి ఆడపిల్లలు కూడా చదువుకునే కో ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే కాకుండా ఆ రోజుల్లో కులాల వారీగా మరియు డబ్బుల ఆధారంగా చదువు చెప్పే పక్షపాతాన్ని కూడా అంతమొందించడానికి ప్రయత్నించారు.
అంటరాని కులాలకు చెందిన పిల్లలను మిగతా పిల్లలతో కూర్చోబెట్టి ఉచితంగా చదువు చెప్పేవారు. ఇదే కాకుండా వారికి పుస్తకాలు మరియు పలకా బలపాలు కొనిచ్చేవారు.
ఆ రోజుల్లో ఆడపిల్లలకు అతి చిన్న వయసు లో పెళ్లిళ్లు చేసేవారు. కాపురం చేసే సమయానికి కొంత మంది ఆడపిల్లల భర్తలు చనిపోయేవారు. ఫలితంగా వారు చాలా ఇబ్బందులు మరియు కష్టాలు ఎదుర్కొనే వారు.
ఇలాంటి పరిస్థితుల నుంచి ఆడపిల్లలను కాపాడటానికి వితంతు పునర్వివాహాలు జరపాలని ఉద్యమం చేపట్టారు మరియు అమలు కూడా చేసారు.
బాల్యం :
వీరేశలింగం పంతులు 16 ఏప్రిల్ 1848 సంవత్సరం రాజమండ్రి లో పున్నమ్మ, సుబ్బారాయుడు అనే దంపతులకు జన్మించాడు.
వీరేశలింగం పంతులు యొక్క పూర్వికులు ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి వలస వచ్చి రాజమండ్రి లో స్థిరపడ్డారు.
కానీ కందుకూరు ఇంటిపేరు అలానే ఉండిపోయింది అందుకే కందుకూరి వీరేశలింగం అని పేరు పెట్టుకున్నారు. కేవలం 6 నెలల వయస్సులో వీరేశలింగం స్మాల్ పాక్స్ బారిన పడ్డారు.
1852 వ సంవత్సరంలో వీరేశలింగానికి 4 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయాడు.
తండ్రి చనిపోయిన తరవాత నాయనమ్మ మరియు పెదనాన్న వద్ద ఉండి గారాభంగా పెరిగారు.
ఐదు సంవత్సరాల వయస్సులో తన స్కూలు చదువును ప్రారంభించారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చదువు కోసం చేరారు. చదువులో ఎల్లప్పుడూ వీరేశలింగం ఫస్ట్ క్లాస్ వచ్చేవారు.
పదమూడేళ్ల వయస్సులో బాపమ్మ అనే ఎనిమిదేళ్ల అమ్మాయి తో వివాహం జరిగింది.
చదువు జరుగుతున్న సమయంలో కేశుబ్ చంద్ర సేన్ రాసిన పుస్తకాలను చదివి ప్రభావితుడయ్యి దేవుడి మీద మరియు పూజల మీద నమ్మకం తగ్గించాడు. దయ్యాలు భూతాలు కూడా లేవని నమ్మేవారు. దయ్యాలు లేవని నిరూపించడానికి అర్ధరాత్రి స్మశానానికి వెళ్లేవారు.
కెరీర్ :
1867 వ సంవత్సరంలో తన పెదనాన్న మరణించిన తరవాత ప్రభుత్వ ఉద్యోగం చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కోసం లంచమివ్వాల్సి ఉంటుందని తెలిసి ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
లాయర్ గా తన కెరీర్ ను ప్రారంభించాలని అనుకున్న వీరేశలింగం అబద్దాలు చెప్పకుండా ఈ వృత్తిని చేయలేమని తెలుసుకున్నారు. లాయర్ అవుదామనే ఆలోచనను మానుకొని టీచర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు.
టీచర్ గా ఉన్నప్పుడు పిల్లలకు చదువుతో పాటు మంచి సామజిక మార్పుల గురించి కూడా నేర్పించేవారు.
1874 వ సంవత్సరంలో సమాజంలో జరుగుతున్న దురాగతాలపై తన భావాలను వ్యక్తం చేయటానికి వివేకవర్ధని అనే పత్రికను ప్రారంభించారు.
కందుకూరి వీరేశలింగం బ్రహ్మ సమాజం, యువజన సంఘం మరియు హిత కారిణి లాంటి సంస్థలను ప్రారంభించాడు.
హితకారిని అనే ధర్మ సంస్థ కోసం మొత్తం ఆస్తిని దానం చేసాడు. 1881 సంవత్సరంలో మొట్ట మొదటి విట్ఠన్తు వివాహం చేసారు. ప్రజలు ఎంతో వ్యతిరేకత తెలిపినా కూడా 40 వితంతు వివాహాలు చేసారు.
వీరేశలింగానికి తన స్నేహితులు మరియు భార్య కందుకూరి రాజ్య లక్ష్మమ్మ ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు.
వ్యక్తిగత జీవితం :
రాజమండ్రి కళాశాలలో 25 సంవత్సరాలు తెలుగు పండితునిగా పనిచేసారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లో తెలుగు పండితునిగా 5 సంవత్సరాలు పనిచేసారు.
వీరేశలింగానికి గద్య తిక్కన అనే బిరుదు కూడా ఉంది. కందుకూరి వీరేశలింగం మొదటి వితంతు వివాహం మరియు మొట్టమొదటి కో ఎడ్యుకేషన్ పాఠశాలను ప్రారంభించారు.
అలాగే తెలుగులో మొదటి నవల, మరియు మొదటి సెటైర్ రాసింది కందుకూరి వీరేశలింగం.
తెలుగులో మొట్ట మొదటి ఆటో బయోగ్రఫీ కూడా ఆయనదే. కందుకూరి జన్మ దినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు.