గౌతమ్ అదానీ భారతదేశానికి చెందిన బిలియనీర్ మరియు వ్యాపారవేత్త. అదానీ గ్రూప్ యొక్క చైర్మైన్ మరియు సంస్థాపకుడు. అదానీ ఫౌండేషన్ యొక్క ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు, కానీ ఈ కంపెనీ ను తన భార్య ప్రీతి అదానీ ఆధ్వర్యంలో నడుస్తుంది.
16 సెప్టెంబర్, 2022 సంవత్సరానికి గౌతమ్ అదానీ నికర విలువ (Net worth) US$154.9 బిలియన్ డాలర్లు.
బాల్యం :
అదానీ జూన్ 24 1962 వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ పట్టణం, గుజరాతీ జైన్ ఫ్యామిలీ కి చెందిన శాంతీలాల్ మరియు శాంతబెన్ అదానీ దంపతులకు జన్మించారు.
అదానీ కి మొత్తం 7 మంది తోబుట్టువులు, అదానీ తండ్రి బట్టల వ్యాపారం చేసే చిరు వ్యాపారి. ఆహ్మదాబాద్ లోని శేత్ చిమన్‌లాల్ నాగిందాస్ విద్యాలయం నుంచి స్కూల్ చదువును పూర్తి చేసారు.
కాలేజీ చదువు కోసం గుజరాత్ యూనివర్సిటీ లో చేరారు కానీ రెండో సంవత్సరంలోనే మానేసారు. చదువు మానేసిన తరవాత ఏదైనా బిసినెస్ చేయాలనీ ఆలోచన వచ్చింది.
కెరీర్ :
1978 సంవత్సరంలో ముంబై లో మహేంద్ర బ్రదర్స్ వద్ద వజ్రాల యొక్క క్వాలిటీ చెక్ చేసే పని చేసేవారు.
1981 సంవత్సరంలో తన తమ్ముడు మొదలుపెట్టిన ప్లాస్టిక్ యూనిట్ ను చూసుకోవటానికి పిలవగా అక్కడ వెళ్లి చూసుకోవటం మొదలుపెట్టారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో PVC లను ఇంపోర్ట్ చేయటం మొదలుపెట్టారు.
1985 వ సంవత్సరంలో చిన్న తరహా పరిశ్రమల కోసం పొలిమేర్లను ఇంపోర్ట్ చేయటం మొదలుపెట్టాడు.
1988 సంవత్సరంలో అదానీ ఎక్సపోర్ట్స్ (ప్రస్తుతం Adani enterprises) ను ప్రారంభించాడు.
1991 లో జరిగిన ఆర్థిక సరళీకరణ లో లోహాలు, బట్టలు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేసారు.
1995 వ సంవత్సరంలో ముంద్రా ప్రైవేట్ పోర్ట్ కాంట్రాక్టు అదానీ కి దొరికింది. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న ప్రైవేట్ పోర్ట్ లలో ముంద్రా పోర్ట్ అతి పెద్దది. దాదాపు 210 మిలియన్ల కార్గో ఈ పోర్ట్ హ్యాండిల్ చేస్తుంది.
1996 వ సంవత్సరంలో అదానీ పవర్ ను స్థాపించాడు. అదానీ పవర్ ప్రస్తుతం అదానీ గ్రూప్ కి చెందుతుంది.
2006 వ సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి వ్యాపారం మొదలుపెట్టాడు.
2020 వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పెద్ద 6 బిలియన్ల సోలార్ ఎనర్జీ కాంట్రాక్టు గెలిచాడు.
2020 సంవత్సరంలోనే ముంబై విమానాశ్రయం లో 74% వాటా కైవసం చేసుకున్నారు.
2022 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ముకేశ్ అంబానీ ని అధిగమించి ప్రపంచంలో మూడవ అత్యంత ధనికుడు అయ్యాడు.
వ్యక్తిగత జీవితం :
గౌతమ్ అదానీ ప్రీతీ ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు దంపతులకు కరణ్ అదానీ మరియు జీత్ అదానీ అనే ఇద్దరు కుమారులు పుట్టారు. అదానీ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క సభ్యుడు.
1998 లో అదానీ ను కిడ్నాప్ చేసి డబ్బులు అడిగారు కానీ తరవాత డబ్బులు తీసుకోకుండానే విడుదల చేసారు.
2008 వ సంవత్సరంలో ముంబై లోని తాజ్ లో దాడులు జరిగినప్పుడు అదానీ అప్పుడు తాజ్ హోటల్ లోనే ఉన్నాడు.
ఆరోపణలు:
2023 జనవరిలో అదానీ, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ అనగా తన సొంత కుటుంబ సభ్యుల డబ్బునే విదేశాలకు పంపి షేర్స్ రేటు పెంచాడని మరియు అకౌంటింగ్ మాల్‌ప్రాక్టీసెస్ (ఖాతాలలో మోసం చేయటం) లో పాల్గొన్నాడని అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ పరిశోధన సంస్థ ఆరోపణలు చేసింది.
అదానీ స్టాక్ మార్కెట్ లో అవకతవకలకు పాల్పడ్డాడని వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ ఈ ఆరోపణలు నిజం కాదు అని వివరణ ఇచ్చారు.
Source: Gautam Adani – Wikipedia
Nise this story gautham adhani this life grath improve ilfe refrences most .