అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర – Alluri seetaramaraju biography in Telugu

అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు. బ్రిటీష్ ప్రభుత్వానికి తాను చూపిన సాహస ధైర్యలకు గాను అతనిని మన్యం వీరుడు అని అంటారు.

ఆయుధాలను బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఒక ఉత్తరం రాసి వెళ్ళేవాడు. ఆ ఉత్తరం లో తానూ దాడి చేసిన వివరాలు ఇచ్చి, దమ్ముంటే తనను పట్టుకోమని సవాలు విసిరేవాడు.

రెండు సుదీర్ఘ సంవత్సరాలు అల్లూరి సీతారామరాజు ఆచూకీ కోసం బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి 40 లక్షల రూపాయలు ఖర్చు చేసారు.

1924 వ సంవత్సరంలో చింతపల్లె అడవులలో ఉన్న కొయ్యూరు గ్రామంలో సీతారామరాజును పట్టుకొని నిర్బంధించి ఏ విచారణ చేయకుండానే కాల్చి చంపేసారు.

బాల్యం :

అల్లూరి సీతారామరాజు జులై 4, 1897 వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా, పాలకుడు మండలం లోని మొగల్లు అనే గ్రామంలో వెంకట రామ రాజు మరియు సూర్య నారాయణమ్మ అనే దంపతులకు జన్మించారు.

సీతారామరాజు యొక్క తల్లి సంప్రదాయాలను ఆచరించే గృహిణి. తండ్రి వృత్తిపరంగా ఒక ఫోటోగ్రాఫర్, 1902 సంవత్సరంలో వృత్తి కారణం తో రాజమండ్రి లో స్థిరపడ్డారు.

రాజమండ్రి లో ఒక మంచి ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. 1908 సంవత్సరంలో గోదావరి పుష్కరాల సమయంలో వ్యాపించిన కలరా వ్యాధి బారిన పడి చనిపోయారు.

సీతారామరాజు యొక్క తండ్రికి స్వాతంత్రం అంటే ఎంతో ఇష్టం. ఒకసారి తన కుమారుడు బ్రిటిష్ వారికి సెల్యూట్ చేసే పద్దతిని ప్రాక్టీస్ చేస్తున్నపుడు చూసి ఆలా చేయవద్దని అరిచాడు.

చిన్న తనంలోనే తండ్రి చనిపోవటం తో సీతారామరాజు కుటుంబం పేదరికం బారిన పడి చాలా కష్టాలను ఎదుర్కొంది.

చిన్నాన్న రామకృష్ణంరాజు ఆర్థికంగా ఆదుకునేవాడు. కానీ తండ్రి లేని కారణంగా సీతారామరాజు చదువు చాలా దెబ్బతింది.

స్కూల్ కి వెళ్లకుండా చుట్టుపక్కల ప్రదేశాలు తిరుగుతూ కాలక్షేపం చేసేవారు. ఒకసారి సీతారామరాజును ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు, ఆ తరవాత నుంచి శాశ్వతంగా చదువును మానేసారు.

చదువు మానేసిన తరవాత తెలుగు, సంస్కృతం, హిందీ మరియు ఆంగ్ల భాషల సాహిత్యంపై మంచి పట్టును సంపాదించారు.

సీతారామరాజుకు 14 సంవత్సరాలప్పుడు ఉపనయనం జరిగింది. తన కుటుంబం తుని లో ఉన్నప్పుడు అడవులు, కొండలు మరియు పరిసర ప్రాంతాలలో తిరుగుతూ గిరిజన ప్రజల జీవించే విధానాన్ని గమనించేవారు.

చిన్నతనం నుంచే దైవ భక్తి ఎక్కువగా ఉండేది మరియు నాయకత్వ లక్షణాలు కూడ ఉండేవి. 18 సంవత్సరాల వయస్సులో సన్యాసి అవ్వకముందు జ్యోతిష్యం, మూలికాశాస్త్రం, హస్తసాముద్రికం మరియు గుర్రపుస్వారీ ను నేర్చుకున్నారు.

స్కూల్ లో ఉన్న కాలంలో తన చిన్నాన్న వద్ద ఉన్న గూరలపై సవారి చేస్తూ అడవులలో మరియు కొండలలో నివసిస్తున్న వారి వద్దకి వెళ్లేవారు. బ్రిటిష్ ప్రభుత్వం వల్ల వారు పడే కష్టాల గురించి అడిగి తెలుసునేవారు.

యాత్రలు :

1916 వ సంవత్సరంలో సీతారామరాజు ఉత్తర భారతదేశంలో పలు తీర్థ యాత్రలను చేసారు. బెంగాలు, లక్నో, కాశీ, బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం ప్రాంతాలలో ప్రయాణం చెసారు.

కాశీ లో ఉన్న సమయంలో సంస్కృతం భాషను అధ్యయనం చేసారు. బ్రహ్మకపాలంలో ఉన్నపుడు సన్యాసదీక్ష ను చేసి యోగి గా మారారు. ఈ యాత్రలో పలు భాషలు మరియు విద్యలు కూడా నేర్చుకున్నారు.

కృష్ణదేవుపేట కి దగ్గరలో ఉన్న ధారకొండపై కొన్ని రోజులు తపస్సు కూడా చేసారు.

1918 సంవత్సరంలో రెండవ సారి ముంబై, నాసిక్, మైసూరు, బస్తర్ లాంటి ప్రదేశాలను తిరిగి కృష్ణదేవిపేట వద్దకి చేరుకున్నారు.

తన ప్రయాణాలు చేస్తున్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం వల్ల తన ప్రజలు పడుతున్న కష్టాలను చూసి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నారు.

కృష్ణదేవిపేట వద్దే గ్రామస్తులు కట్టిచ్చిన రెండు ఇండ్లలో సీతారామరాజు కుటుంబం ఉండేది. అక్కడ ఉన్న సమయంలో చాలా తక్కువగా తిని జీవనం కొనసాగించేవారు. పండ్లు మరియు తేనె నే ఎక్కువగా తినడానికి ఇష్టపడేవారు.

తనకు ఆహారాన్ని ఇచ్చిన గిరిజనులకు తన దీవెనలతో ఆశీర్వదించేవారు. అక్కడి ప్రజలు తనను పవిత్ర శక్తులు కలవాడు మరియు మహాపురుషుడు అని నమ్మేవారు.

అదే సమయంలో క్రిస్తవ మిషనరీలు బలవంతంగా మత మార్పిడీలు చేయటం కూడా సీతారామ రాజు కు నచ్చకపోయేది.

గిరిజన ప్రజలకు తమ హక్కుల గురించి చెప్పి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యాన్ని వాళ్లలో నింపారు.

గిరిజనులతో ఉన్న సమయంలో అడవులను మరియు కొండా ప్రాంతాలను బాగా అధ్యయనం చేసేవారు. తరవాత బ్రిటిష్ వారితో చేసిన గొరిల్లా యుద్ధాలలో బాగా ఉపయోగపడింది.

సీతారామరాజు ఒక నాయకుడిగా గిరిజన ప్రజలకు మద్దతు మరియు సహాయం చేసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం సీతారామరాజును తమ వైపు తిప్పుకోవడానికి 60 ఎకరాల సాగు భూమిని సీతారామరాజు యొక్క ఆశ్రమం కోసం ఇస్తాం అని అనగా దానిని తిరస్కరించారు.

బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబాటు:

1882 మద్రాసు అటవీ చట్టం ఆమోదించిన తర్వాత అడవులలో మరియు కొండ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులను పోడు వ్యవసాయం చేయకుండా నిషేధం విధించబడింది.

వ్యవసాయం పై నిషేధం విధించిన తరవాత మన్యం ప్రజలు ఆకలి తో అలమటించారు. ఇవే కాకుండా మన్యం ప్రజలు శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ మరియు అన్యాయాలకు గురయ్యేవారు.

చేసేదేమి లేక మన్యం ప్రజలు రోజువారీ కూలి పనులకు వెళ్లేవారు. కూలీ పనులలో కూడా కాంట్రాక్టర్లు నిశ్చయించిన డబ్బుల కంటే తక్కువ ఇచ్చేవారు. ఆరు అణాలు కూలీ ఉంటె కేవలం ఒక్కటే అణా ఇచ్చేవారు.

అదే సమయంలో అప్పటివరకు వంశ పారంపర్యంగా పన్ను వసూలు చేసే ముత్తెదారులను కూడా పదవి నుంచి తొలగించి ప్రజా సేవకులుగా చేసేసారు.

ముత్తెదారులను పదవి నుంచి తొలగించిన తరవాత వారు కూడా మన్యం ప్రజలతో కలిసి పోరాడుదామని నిర్ణయించుకున్నారు.

సీతారామరాజు ముత్తేదారులను మరియు మన్యం ప్రజలను కలిపి ఒక ఉద్యమం తయారు చేసారు.

మొదట విల్లు, బాణం మరియు ఈటెలు లాంటి ఆయుధాలతో బ్రిటిష్ వారితో పోరాటం చేసేవారు. బ్రిటిష్ వారి వద్ద ఉన్న తుపాకుల ముందు వారు నిలబడలేకపోయారు.

అందుకే బ్రిటిష్ వారి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళటం ప్రారంభించారు.

1922 ఆగస్టు 22 – చింతపల్లి

1922 ఆగస్టు 23 – కృష్ణదేవు పేట

1922 ఆగస్టు 24 – రాజవొమ్మంగి

1922 అక్టోబర్ 15 – అడ్డతీగల

1922 అక్టోబర్ 19 – రంపచోడవరం పోలీస్ స్టేషనలపై దాడి చేసారు.

అడ్డతీగల మరియు రంపచోడవరం పోలీస్ స్టేషనల్లో ముందే సమాచారం అందుకున్న పోలీసులు ఆయుధాలు దాచిపెట్టారు.

మరణం :

సీతారామరాజుకు మరియు బ్రిటీష్ సైన్యానికి జరిగిన పోరాటాలలో దళం సభ్యులు గాయ పడి మరణించ సాగారు.

1924 వ సంవత్సరంలో మాన్యానికి కొత్త కలెక్టర్ రూథర్‌ ఫర్డ్ నియమించబడ్డాడు. రూథర్‌ ఫర్డ్ రాగానే ఉద్యమకారులపై మరియు వారికి సహాయం చేసేవారిపై విరుచుకుపడ్డాడు.

కృష్ణదేవు పేట లో రూథర్‌ ఫర్డ్ నిర్వహించిన సభలో మాట్లాడుతూ విప్లవకారుల ఆచూకీ చెప్పకపోతే కాల్చి చంపేస్తానని చెప్పాడు.

తన కారణంగా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న సీతారామరాజు లొంగిపోవాలని నిశయించుకున్నారు. తాను లొంగిపోతే బ్రిటిష్ వారి ద్వారా జరిగే విచారణలో పాల్గొనవచ్చని అనుకున్నారు.

మే 7 1924 వ సంవత్సరంలో సీతారామరాజు లొంగిపోయిన తరవాత ఎలాంటి విచారణ చేయకుండా అల్లూరి సీతారామరాజును కాల్చి చంపారు.

ఇలా 27 ఏళ్ళ చిన్న వయసులో దేశం కోసం, ప్రజల కోసం బ్రిటిష్ వారితో పోరాడి అమవీరుడు అయ్యాడు.

Source: Alluri Sitarama Raju – Wikipedia

Leave a Comment