జగదీష్ వాసుదేవ్ ను సద్గురు అని కూడా పిలుస్తారు. సద్గురు భారత దేశానికి చెందిన యోగ మరియు ఆధ్యాత్మిక గురువు.
Table of Contents
బాల్యం :
జగదీష్ వసుదేవ్ 1957 వ సంవత్సరం సెప్టెంబర్ 3 వ తారీఖున కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో జన్మించారు.
వసుదేవ్ యొక్క తల్లి సుశీల వసుదేవ్ మరియు తండ్రి B.V వసుదేవ్. వసుదేవ్ యొక్క తండ్రి రైల్వే హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేసేవారు.
వసుదేవ్ తనకు 13 సంవత్సరాల వయస్సు నుంచే ఆసనాలు మరియు ప్రాణాయామాలు చేసేవారు.
కెరీర్ :
వసుదేవ్ ను వారి తల్లి తండ్రులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలని చెప్పారు. కానీ బిసినెస్ లో ఆసక్తి ఉండటంతో పై చదువులపై ఆసక్తి చూపించలేదు.
వసుదేవ్ కొన్ని డబ్బులు అప్పులు తీసుకొని మొదటి బిసినెస్ గా మైసూర్ నుంచి దూరంగా ఒక పౌల్ట్రీ ఫార్మ్ ను మొదలుపెట్టారు.
ఆ రోజుల్లో పౌల్ట్రీ ఫార్మ్ బిసినెస్ డిమాండ్ ఎక్కువగా ఉండటం తో ఈ బిసినెస్ మొదలుపెట్టారు.
పౌల్ట్రీ ఫార్మ్ బిసినెస్ సమయంలోనే బిల్డాయిడ్స్ అనే రియల్ ఎస్టేట్ బిసిసినెస్ ను కూడా ప్రారంభించారు.
ఈ బిజినెస్ మొదలుపెట్టిన సమయంలో వారి తల్లి తండ్రులకు నచ్చలేదు. చదువు వదిలేసి బిజినెస్ చేయటాన్ని చూసి సమయం వృధా చేస్తున్నాడు అని అనుకున్నారు.
కొద్దీ కాలంలోనే బిజినెస్ మంచిగా నడవసాగింది, లాభాల బాటలో పడింది.
ఒక రోజులో కొన్ని గంటలే ఫార్మ్ బాగోగుల కోసం గడిపేవారు, మిగతా సమయం అంతా కవితలు రాయటం, చదవటం, విశ్రాంతి తీసుకోవటం మరియు ఈత కొట్టడం చేసేవారు.
తనకు ముందునుంచే వీటిపై ఆసక్తి ఉన్నా సమయం దొరకక చేసేవారు కాదు. ఈ పౌల్ట్రీ బిజినెస్ చేస్తున్న సమయంలో ప్రతి రోజు ధ్యానం చేయటం కూడా ప్రారంభించారు.
1982 సెప్టెంబర్ 23 వ తారీఖున తనకిష్టమైన ప్రదేశం చాముండి హిల్ వద్దకి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికత యొక్క అనుభవం కలిగింది.
అక్కడి నుంచి వచ్చిన కొన్ని వారాల తరవాత తన వ్యాపారాన్ని తన స్నేహితుడికి అప్ప చెప్పారు. తనలో ఆధ్యాత్మికత ను పెంచడానికి వేరు వేరు ప్రదేశాలలో యాత్రను చేయటం మొదలుపెట్టారు.
ఒక సంవత్సరం ప్రయాణాలు చేసిన తరవాత ఇతరులకు కూడా యోగ మరియు ఆధ్యాత్మికతను నేర్పించటం ప్రారంభించారు.
ఇషా ఫౌండేషన్ :
ఇంతవరకు దేశమంతటా ప్రయాణాలు చేసి ఆధ్యాత్మికత ను మరియు యోగా ను బోధించిన వసుదేవ్ కి ఒక ఫౌండేషన్ స్థాపించాలనే ఆలోచన వచ్చింది.1992 సంవత్సరంలో వసుదేవ్ కోయంబత్తూర్ లో ఇషా ఫౌండేషన్ ను స్థాపించారు.
ఈ సంస్థ ప్రజలకు ఇషా యోగ పేరుతో యోగా కి సంబంచిన కార్యక్రమాలను నిర్వహించేది. ఈ సంస్థలో పనిచేసేవారు స్వచ్చందంగా సేవచేస్తారు.
ఈ సంస్థ లక్ష్యాలు మారు మూల ప్రాంతాలలోఉండే వారి చదువులను మెరుగుపరచటం, చెట్లను కాపాడుకోవటం, నదులను కాపాడుకోవటం, భూములను కాపాడుకోవటం లాంటి లక్ష్యాలతో ముందుకు సాగుతుంది.
గుర్తింపు :
వసుదేవ్ సంస్థ లక్ష్యాలను చూసి చాలా మంది సెలెబ్రిటీలు ప్రభావితులు అయ్యారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు (World environment day) సాయిల్ హెల్త్ (Soil health) పై నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హాజరు అయ్యారు.
కొంత మంది విమర్శకుల ప్రకారం వసుదేవ్ బీజేపీ పార్టీ ను సపోర్ట్ చేస్తారు. గో హత్య ను నిర్ములించాలని, భారతదేశంలో ముస్లింల పాలన బ్రిటిష్ పాలన కన్నా క్రూరంగా ఉండేదని కూడా చెప్పారు. వసుదేవ్ 2019 బాలాకోట్ స్ట్రైక్ ను, GST, CAA ( Citizenship Amendment Act, 2019) ను సమర్ధించారు.
వసుదేవ్ సైన్స్ కి వ్యతిరేకంగా మాట్లాడుతారని కూడా ఆరోపణలు ఉన్నాయి. చంద్రగ్రహణం సమయంలో వండిన అన్నం తినవద్దని వసుదేవ్ చెప్పగా అది సైన్స్ ద్వారా రుజువు అవ్వ లేదని కొందరు అంటారు. ఇదే కాకుండా టాక్సిక్ కెమికల్ అయిన మెర్క్యూరీ ను సాంప్రదాయ భారతీయ వైద్యం లో ఉపయోగించాలని చెప్పారు.
వ్యకిగత జీవితం:
వసుదేవ్ గారు విజయ కుమారి ను 1984 సంవ్సతరంలో పెళ్లి చేసుకున్నారు. విజయ కుమారి 1997 సంవత్సరంలో చనిపోయారు. ఈ దంపతులకు 1 కూతురు పుట్టింది. 2014 సంవత్సరంలో వాసుదేవ్ కూతురు వివాహం సందీప్ నారాయణ్ తో జరిగింది.
Source: Sadhguru – Wikipedia