పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర – Pawan kalyan biography in Telugu

పవన్ కళ్యాణ్ భారత్ దేశానికి చెందిన నటుడు మరియు రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండే అగ్ర హీరోలలో ఒకరు. 

బాల్యం : పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2 వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోని  బాపట్లలో జన్మించారు. పవన్ కళ్యాణ్ యొక్క తల్లి తండ్రులు  కొణిదెల వెకేట్ రావు మరియు అంజనా దేవి. పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు కొణిదెల కళ్యాణ్ బాబు అని పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ కరాటే లో బ్లాక్ బెల్ట్ ను సంపాదించారు. 

కెరీర్ :

1990 – 2000:

1996 సంవత్సరంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేశారు 

1997 సంవత్సరంలో గోకులంలో సీత అనే సినిమా లో నటించారు. 

1999 సంవత్సరంలో తొలి ప్రేమ సినిమా లో నటించారు. ఈ సినిమా కి ఒక నేషనల్ అవార్డు మరియు 6 నంది అవార్డు లు సంపాదించింది. ఇదే సంవత్సరం తమ్ముడు సినిమాను చేసారు.  

2000 వ సంవత్సరంలో రొమాంటిక్ డ్రామా సినిమా  అయిన బద్రి సినిమాను చేసారు.

2001-2010:

2001 సంవత్సరంలో బ్లాక్ బాస్టర్ మూవీ అయిన  ఖుషి సినిమా లో నటించారు. 

2003 వ సంవత్సరంలో మార్షల్ ఆర్ట్స్ పై ఆధారం చేసుకొని తీసిన జానీ సినిమా లో నటించారు. 

2004 వ సంవత్సరంలో యాక్షన్ మరియు కామెడీ సినిమా గుడుంబా శంకర్ నటించారు. 

2005 వ సంవత్సరంలో క్రైమ్ మరియు యాక్షన్ సినిమా బాలు లో నటించారు. 

2006 వ సంవత్సరాలో యాక్షన్  సినిమా బంగారం మరియు డ్రామా సినిమా అయిన అన్నవరం లో నటించారు. 

2008 వ సంవత్సరం యాక్షన్ కామెడీ సినిమా లో నటించారు. ఆ సమయంలో సౌత్ ఇండస్ట్రీ లో ఈ సినిమా ఏక్కువ కలెక్షన్లు సంపాదించిన సినిమా గా మిగిలింది. 

2010 వ సంవత్సరసంలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా అయిన కొమరం పులి సినిమా లో నటించారు. 

2011 – 2021: 

2011 వ సంవత్సరంలో హిందీ సినిమా లవ్ ఆజ్ కాల్ సినిమా రీమేక్ టీన్ మార్ సినిమా లో నటించారు. ఇదే సంవత్సరం యాక్షన్ సినిమా అయిన పంజా సినిమా లో నటించారు. 

2012 వ సంవత్సరాలో హిందీ సినిమా దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ లో నటించారు. ఈ సినిమా హిట్ అయ్యి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇదే సంవత్సరం పొలిటికల్ యాక్షన్ సినిమా కెమరామెన్ గంగాతో రాంబాబు అనే సినిమాలో నటించారు. 

2013 వ సంవత్సరంలో అత్తారింటికి దారేది అనే యాక్షన్ కామెడీ సినిమా ను చేసారు. సినిమా పైరసీ బారిన పడ్డా 100 రోజులు నడిచి హిట్ అయ్యింది. 

2015 వ సంవత్సరంలో  ఓహ్ మై గాడ్ అనే హిందీ సినిమా రీమేక్ గోపాల గోపాల లో నటించారు. 

2016 వ సంవత్సరంలో గబ్బర్ సింగ్ సీక్వెల్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా లో నటించారు.   

2017 వ సంవత్సరంలో తమిళ్ సినిమా వీరం రీమేక్ అయిన కాటంరాయుడు లో నటించారు. 

2018 వ సంవత్సరంలో యాక్షన్ డ్రామా అయిన  అజ్ఞాతవాసి అనే సినిమాలో నటించారు.      

2021 వ సంవ్సతరం లీగల్ డ్రామా సినిమా అయిన వకీల్ సాబ్ ను చేసారు.   

2022 వ సంవత్సరంలో భీమ్లా నాయక్ అనే సినిమా లో నటించారు. 

2023 వ సంవత్సరం హరి హర వీర మల్లు అనే అడ్వెంచర్ సినిమా పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయనున్నారు. 

రాజకీయ జీవితం : 

పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని 2008 సంవత్సరంలో ప్రారంభించారు. తన అన్న స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ లో యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 

2011 వ సంవత్సరంలో అన్నయ్య చిరంజీవి పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరవాత పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ అయిన జనసేనా పార్టీ ని   2014 వ సంవత్సరంలో  ప్రారంభించారు. 

వ్యక్తిగత జీవితం : 

మొదటి పెళ్లి: 1997 సంవత్సరంలో నందినిను పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు కోర్ట్ లో కేసు నడిచిన తరవాత  2008 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నందినికి విడాకులు ఇచ్చారు. నందిని కి పవన్ కళ్యాణ్ 5 కోట్ల అలీమొనీ ఇచ్చారు. 

రెండవ పెళ్లి: 2009 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటి అయిన రేణు దేసాయి ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు పుట్టారు. 2012 వ సంవత్సరంలో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.  

మూడవ పెళ్లి: 2013 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ రష్యా కు చెందిన అన్నా లెజ్నెవా ను పెళ్లి చేసుకున్నారు.  ఈ దంపతులకు 2 పిల్లలు. కూతురు పేరు పోలిన అంజనా మరియు కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. 

పవన్ కళ్యాణ్ కి తెలంగాణ మరియు ఆంధ్ర లో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఫాన్స్ పవన్ కళ్యాణ్ ను చీఫ్ మినిస్టర్ గా చూడాలని అనుకుంటున్నారు.      

Source: Pawan Kalyan – Wikipedia

Leave a Comment