రణబీర్ కపూర్ ఇండియా కు చెందిన హిందీ సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ కి చెందిన అగ్ర నటుడు. రన్బీర్ కపూర్ నటుడు మరియు దర్శకుడు అయిన రాజ్ కపూర్ యొక్క మనవడు.
బాల్యం :
రణబీర్ రాజ్ కపూర్ సెప్టెంబర్ 28 1982 వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని ముంబై లో జన్మించాడు. రణబీర్ యొక్క తల్లి నీతూ సింగ్ మరియు తండ్రి రిషి కపూర్ కూడా హిందీ సినిమా ప్రపంచానికి చెందిన వారు. రన్బీర్ యొక్క తల్లి సిఖ్ మతానికి మరియు తండ్రి హిందూ మతానికి చెందిన వారు.
రణబీర్ కపూర్ యొక్క చెల్లెలి పేరు రిద్ధిమా కపూర్, ఈమె ఒక ఇంటీరియర్ మరియు ఒక ఫ్యాషన్ డిసైనర్.
బాలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోయిన్లు అయిన కరీనాకపూర్ మరియు కరిష్మాకపూర్ రన్బీర్ యొక్క పెదనాన్న కూతుళ్లు, వరుసకు అక్కలు అవుతారు.
రణబీర్ కపూర్ తన స్కూల్ చదువును బాంబే స్కాటిష్ స్కూల్ నుంచి పూర్తి చేసారు. చిన్న తనం నుంచే రన్బీర్ కపూర్ కి చదువులో పెద్ద ఆసక్తి ఉండకపోయేది.
కపూర్ కుటుంబలో పుట్టిన పిల్లలు తప్పకుండా హీరో లేదా హీరోయిన్ అవుతారు అని కొందరు అంటారు. అందుకే బహుశా రన్బీర్ కి చదువు పై పెద్దగా ఆసక్తి ఉండకపోయేది. స్పోర్ట్స్ లో మాత్రం రన్బీర్ కి చాలా ఆసక్తి ఉండేది.
రణబీర్ కపూర్ తన కాలేజి చదువులను H.R. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి పూర్తి చేసారు. తన యాక్టింగ్ కెరీర్ పై ఫోకస్ చేయటానికి న్యూయార్క్ లోని ఫిల్మ్ స్కూల్ లో చేరారు.
ఫిల్మ్ స్కూల్ లో చదువును పూర్తి చేసుకొని మెథడ్ యాక్టింగ్ ను నేర్చుకోవటానికి లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు.
తన చదువును పూర్తి చేసుకొని ముంబై తిరిగి వచ్చిన రణబీర్ కపూర్ సంజయ్ లీల బన్సాలి డైరెక్టర్ గా ఉన్న బ్లాక్ సినిమా లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా రణబీర్ కపూర్ చాలా ఇబ్బందులను ఎదుర్కున్నాడు, ఫ్లోర్ క్లీన్ చేయటం, లైట్లను అమర్చటం లాంటి పనులు చేసేవాడు. కానీ చివరికి ఒక సినిమా లో నటించే అవకాశం లభిస్తుందని కష్టాలను ఎదురుకున్నాడు.
కెరీర్ :
2008 వ సంవత్సరంలో రణబీర్ కపూర్ నటించిన బచ్నా అయె హసీనో బాక్స్ ఆఫీస్ లో మంచి విజయం సాధించింది.
2009 వ సంవత్సరంలో రణబీర్ కపూర్ వేక్ అప్ సిద్, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని మరియు రాకెట్ సింగ్ అనే 3 చిత్రాలను విడుదల చేసారు.
మొదటి రెండు సినిమాలు మంచి బాక్స్ ఆఫీస్ ఫలితాలను ఇచ్చినా రాకెట్ సింగ్ మాత్రం బాక్స్ ఆఫీస్ లో మంచి ఫలితాలను ఇవ్వలేక పోయింది.
2010 వ సంవత్సరంలో రణబీర్ పొలిటికల్ థ్రిల్లర్ రాజ్ నీతీ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ లో మంచి విజయం సాధించింది. ఇదే సంవత్సరం రన్బీర్ నటించిన అంజాన అంజాని అనే కామెడీ డ్రామా సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
2011 వ సంవత్సరంలో రాక్ స్టార్ (Rockstar), 2012 వ సంవత్సరంలో బర్ఫి (Barfi) 2013 వ సంవత్సరంలో యే జవానీ హై దీవానీ (Yeh Jawaani Hai Deewani) అనే మూడు సినిమాలు రన్బీర్ కపూర్ ఒక మంచి నటుడిగా పేరునయూ సంపాదించాయి. బాక్స్ ఆఫీస్ లో కూడా ఈ సినిమాలు మంచిగా ఆడాయి.
2015 వ సంవత్సరంలో రాయ్ (Roy), బొంబే వెల్వెట్ మరియు తమాషా (Tamasha) అనే సినిమాలలో నటించారు. ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ లో ఫెయిల్ అయ్యాయి.
2016 లో రన్బీర్ నటించిన సినిమా అయె దిల్ హై ముష్కిల్ (Ae Dil Hai Mushkil) మంచి ఫలితాలను ఇచ్చింది.
2017 వ సంవత్సరంలో రణబీర్ నటించిన జగ్గా జాసూస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ధ ఫెయిల్ అయ్యింది.
2018 వ సంవత్సరంలో కపూర్ నటించిన సంజు ఒక పెద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.
నాలుగు సంవత్సరాల సుదీర్ఘ సమయం తరవాత 2022 వ సంవత్సరంలో శంషేరా అనే సినిమా ను చేసారు. బైకాట్ బాలీవుడ్ ట్రెండ్ మరియు సినిమా లో స్టోరీ సరిగా లేనందువల్ల బాక్స్ ఆఫీస్ లో సినిమా ప్లాప్ గా నిలిచింది.
ఇదే సంవత్సరం సెప్టెంబర్ 9 వ తారీఖున పెద్ద బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర విడుదల అవ్వనుంది.
వ్యక్తిగత జీవితం :
రన్బీర్ కపూర్ దీపికా పదుకోన్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లను డేట్ చేసారు.
2022 వ సంవత్సరంలో తన తో పాటు బ్రహ్మాస్త్ర లో నటించిన ఆలియా భట్ ను పెళ్లి చేసుకున్నారు.
రన్బీర్ కపూర్ ఎలాంటి సోషల్ మీడియా ను ఉపయోగించరు.
Source: Ranbir Kapoor – Wikipedia