కర్ణం మల్లేశ్వరి జీవిత చరిత్ర – Karnam mallishwari biography in Telugu

కర్ణం మల్లేశ్వరి ఇండియా కు చెందిన వెయిట్ లిఫ్టర్. 2000 సంవత్సరం లో జరిగిన ఒలింపిక్స్ లో మెడల్ ను గెలిచి ఒలింపిక్స్ లో మెడల్ ను సాధించిన భారత దేశ మొట్ట మొదటి మహిళ గా నిలిచారు. 

మల్లేశ్వరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఆమడలవలస పట్టణం, వూసవానిపేట అనే గ్రామంలో కర్ణం కుటుంబంలో జన్మించారు. మల్లేశ్వరి గారి తోబుట్టువులో అందరూ అమ్మాయిలే ఉన్నారు. అయిదుగురు అక్కా చెల్లెళ్ళలో మల్లేశరి గారు ఒకరు. 

కేవలం 12 సంవత్సరాల వయస్సులో నీలంశెట్టి అప్పన్న వద్ద ట్రైనింగ్ తీసుకోవటం మొదలుపెట్టారు. తాను ఉంటున్న ఇంటి వద్ద ఎక్కువ సదుపాయాలు లేకపోవటం వల్ల మంచి నగరానికి వెళ్లి తన ట్రైనింగ్ ను మొదలుపెట్టాలి అని నిర్ణయించుకున్నారు. 

మల్లేశ్వరి ఒక అక్క పెళ్లి అయ్యి ఢిల్లీ లో స్థిరపడ్డారు. తాను కూడా అక్కడికి వెళ్లి ట్రైనింగ్ కొనసాగించడానికి ఢిల్లీ వెళ్లారు. 

తనలో ఉన్న ప్రతిభ ను చూసి ఒక క్రీడాకారిణిగా తనను గుర్తించారు. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా కూడా తన ప్రతిభను గుర్తించారు.   

వరల్డ్  ఛాంపియన్‌షిప్‌లు: 

1990 సంవత్సరంలో నేషనల్ కోచింగ్ క్యాంపు లో చేరారు. కోచింగ్ ను పూర్తి చేసుకున్న తరవాత 1993 సంవత్సరంలో మెల్బోర్న్ లో జరిగిన  54 కేజీ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరి లో  బ్రోన్జ్ మెడల్ ను సాధించారు. 

ఒక సంవత్సరం తరవాత  1994 లో ఇస్తాంబుల్ లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 54 కేజీ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరి లో గోల్డ్ మెడల్ ను సాధించి చరిత్ర లో నిలిచారు. 

1995 సంవత్సరంలో చైనా లోని గ్వాంగ్జౌ నగరం లో జరిగిన 54 కేజీ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరి లో కూడా మల్లేశరి గారు గోల్డ్ మెడల్ ను దక్కించుకున్నారు.

1996 సంవత్సరంలో  చైనా లోని గ్వాంగ్జౌ నగరం లో జరిగిన 54 కేజీ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరి లో బ్రోన్జ్ మెడల్ ను దక్కించుకున్నారు. 

1994 మరియు 1998 జరిగిన ఆసియన్ గేమ్స్ లో మల్లేశ్వరి గారు గోల్డ్ మెడల్ ను దక్కించులేక పోయారు. ఈ రెండు సంవత్సరాలలో కూడా సిల్వర్ మెడల్ ను దక్కించుకున్నారు. 

వరుస గెలుపులతో ఒక మంచి ఫార్మ్ లో ఉన్న మల్లేశ్వరి గారి 2000 సంవత్సరంలో సిడ్నీ లో జరిగిన ఒలింపిక్స్ లో బ్రోన్జ్ మెడల్ ను దక్కించుకున్నారు. 

వెయిట్ అనుకున్న దాని కన్నా ఎక్కువగా ఎత్తడం వల్ల గోల్డ్ మెడల్ మిస్ అయిందని మల్లేశరి గారు తెలిపారు. 

2 సంవత్సరాల సుదీర్ఘ సమయం తరవాత 2002 వ సంవత్సరంలో జరుగబోతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో పోటీ చేయాలనుకున్నారు కానీ అకస్మాత్తుగా తండ్రి చనిపోవటం తో పాల్గొనలేకపోయారు. 

2004 వ సంవత్సరంలో గ్రీస్ లో జరగనున్న ఒలింపిక్స్ లో పోటీ చేయాలనుకున్నారు. కానీ తగినన్ని ఫలితాలు రానందుకు పోటీ చేయలేకపోయారు. 

కర్ణం మల్లేశ్వరి గారు చూపించిన ప్రతిభకు గాను భారత దేశ ప్రభుత్వం 1994 సంవత్సరంలో అర్జున అవార్డు ను, 1999 సంవత్సరంలో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ను మరియు  1999 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లను ఇవ్వటం జరిగింది.  

వ్యక్తిగత జీవితం : 

కర్ణం మల్లేశ్వరి గారు తన తోటి వెయిట్ లిఫ్టర్ అయిన రాజేష్ త్యాగి ని 1997 వ సంవత్సరంలో పేలి చేసుకున్నారు. 2001 వ సంవత్సరంలో ఈ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. 

ప్రస్తుతం మల్లేశ్వరి గారు హర్యానా లో నివసిస్తున్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. 

తన లాగా ఇంకా చాలా మందిని మోటివేట్ చేయడానికి మల్లేశ్వరి ఫౌండేషన్ ను ప్రారంభించారు.      

Source: Karnam Malleswari – Wikipedia

Leave a Comment