నోయిడా ట్విన్ టవర్స్ గురించి ప్రస్తుతం న్యూస్ చానెల్స్ అన్ని చర్చిస్తున్నాయి.
కోర్ట్ ఆదేశాల మేరకు నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ ను ఆగస్టు 29 న మధ్యాహ్నం 2:30 గంటలకు కూల్చటం జరుగుతుంది.
నోయిడా ట్విన్ టవర్స్ ఎక్కడ ఉన్నాయి ?
ఉత్తరప్రదేశ్ లోని నోయిడా మరియు గ్రేటర్ నోయిడా కి దగ్గరలో ఉన్న నోయిడా సెక్టర్ 93A లో సూపర్ టెక్ కంపెనీ రెండు ట్విన్ టవర్స్ ను కట్టడం జరిగింది.
మొదటి టవర్ అపెక్స్ లో 32 అంతస్తులు మరియు రెండవ టవర్ సెయనే లో 29 అంతస్తులు ఉన్నాయి. ఒక్కో టవర్ లో 900 కు పైగా ఫలట్లు ఉన్నాయి.
టవర్ యొక్క నిర్మాణం:
2009 వ సంవత్సరంలో ఈ టవర్స్ యొక్క నిర్మాణం మొదలయ్యింది. ఈ టవర్ యొక్క బిల్డర్ చాలా ఫేమస్ అవ్వటం వల్ల మరియు ప్రైమ్ లొకేషన్ లో ఈ టవర్ ఉండటం వల్ల అక్కడ ఫ్లాట్స్ కొనేవాళ్ళ డిమాండ్ పెరిగింది.
633 మంది ఈ టవర్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. టవర్ యొక్క నిర్మాణం సమయంలో అనుకున్న దాన్ని కన్నా ఎక్కువ అంతస్తులు కట్టడం మరియు కన్స్ట్రక్షన్ ప్లాన్ లో కూడా చాలా మార్పులు చేసారు.
ఈ టవర్ పక్కనే ఉండే కొన్ని సొసైటీలకు ఈ టవర్ అడ్డు ఉండటం వల్ల వెలుతురూ మరియు గాలి రాకుండా అయ్యింది.
ఈ రెండు టవర్ లకు మధ్య ఎక్కువ గ్యాప్ ఉండక పోవటం మరియు ప్లాన్ కన్నా ఎక్కువ అంతస్తులను కట్టడం లాంటివి గమనించిన ప్రజలు టవర్ గురించి కంప్లైంట్ ఇవ్వటం మొదలుపెట్టారు.
నోయిడా ట్విన్ టవర్స్ పై కేసు :
Residents’ Welfare Association టవర్ పై కేసు నమోదు అయిన తరవాత కేసు అలహాబాద్ కోర్టు కి వెళ్ళింది. టవర్స్ కేసు కోర్టు కి వెళ్లిన తరవాత అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న కొన్ని వందల మంది అడ్వాన్స్ డబ్బులను వెనక్కి తీసుకున్నారు. మరికొంత మంది అదే కంపెనీ యొక్క ఇతర ప్రాజెక్టులలో ఫ్లాట్ లను కొనుగోలు చేసారు.
దాదాపు 250 మంది డబ్బులు వెనక్కి తీసుకోలేదు. టవర్స్ పై ఉన్న కేసు తొలిగిపోతుందనే నమ్మకం తోనే ఏమో అలాగే ఎదురు చూసారు.
2014 వ సంవత్సరంలో కోర్ట్ సంచలనమైన తీర్పు ఇచ్చింది. తన తీర్పులో నోయిడా యొక్క అథారిటీస్ యొక్క జాప్యం వల్ల ఇలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసారని, వెంటనే ఈ రెండు కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేయటం జరిగింది.
నోయిడా ట్విన్ టవర్స్ యజమానులు మరియు నోయిడా అథారిటీస్ కలిసి తమకు న్యాయం చేయాలనీ సుప్రీమ్ కోర్ట్ వద్దకు వెళ్లారు. తమ వద్ద చాలా మంది అడ్వాన్స్ బుకింగ్ చేసారని టవర్స్ కూల్చేస్తే చాలా నష్టం జరుగుతుందని న్యాయం చేయాలని కోరారు.
తుది తీర్పు :
7 సంవత్సరాల సుదీర్ఘ సమయం తరవాత సుప్రీమ్ కోర్ట్ నుంచి తీర్పు వచ్చింది. 2021 31 వ ఆగస్ట్ న ఈ టవర్స్ ఇల్లీగల్ గా కట్టారని హై కోర్ట్ ఇచ్చిన తీర్పు సరైనది అని సుప్రీమ్ కోర్ట్ తీర్పు చెప్పటం జరిగింది.
అంటే కాకుండా కేవలం మూడు నెలలో ఈ టవర్లను కూల్చేయాలని చెప్పటం జరిగింది. ఇంత తక్కువ సమయంలో టవర్ లను కూల్చటం సాధ్యం కాదని నోయిడా అథారిటీస్ చెప్పగా సుప్రీమ్ కోర్ట్ 2022 మే వరకు సమయాన్ని పొడిగించింది.
కానీ మే నెలలో కూడా టవర్ ను కూల్చక పోవటాన్ని చూసి సుప్రీమ్ కోర్ట్ ఆఖరి సారి 28 ఆగష్టు న కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
టవర్ ను కూల్చడానికి అయ్యే ఖర్చు :
ఈ టవర్ ను కూల్చడానికి దాదాపు 17 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చంతా సూపర్ టెక్ కంపెనీ భరించాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ టవర్స్ యొక్క కూల్చివేతకు చాలా పేలుడు పదార్థాలు కావాల్సి ఉంటుంది మరియు చాలా మంది లేబర్స్ కావాల్సి ఉంటుంది.
టవర్స్ కూల్చివేత ఎలా జరగనుంది ?
ఈ టవర్స్ ను కూల్చడానికి 3,700 కేజీల పేలుడు పదార్థాల అవసరం ఉంటుంది. ఈ టవర్స్ ను ముందు నుంచే బలహీనం చేయటం జరిగింది. ప్రతి అంతస్తులో రంద్రాలు చేసి పేలుడు పదార్థాలను అమర్చటం జరిగింది. ఇలా అమర్చడానికి 15 రోజుల సమయం పట్టింది.
ట్విన్ టవర్స్ ను కూలుస్తున్నది ఎవరు ?
ఈ భవనాన్ని కూల్చడానికి ముంబై కి చెందిన మరియు సౌత్ ఆఫ్రికా కు చెందిన కంపెనీలు కలిసి కూల్చబోతున్నాయి. కేవలం 9 సెకండ్లలో ఈ భవనం మట్టి పాలు కాబోతుంది.
భవనం కూలిన తరవాత కొన్ని టన్నుల కొద్దీ శిధిలాలు మిగులుతాయి. ఈ శిథిలాలలను తొలగించడానికి చాలా సమయం పట్టనుంది.
టవర్స్ కూల్చివేతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది?
టవర్స్ చుట్టు పక్కల ఉండే భవనాలలో నివసించే వారిని వేరే ప్రదేశాలకు తరలించటం జరిగింది. ఈ ప్రదేశంలో నీటి మరియు విధ్యుత్ సరఫరాను నిలిపివేస్తారు.
బ్లాస్ట్ జరిగే సమయంలో ఆ ప్రదేశం ను నో ఫ్లై జోన్ గా ప్రకటించనున్నారు. బ్లాస్ట్ జరిగే సమయంలో పక్కన ఉన్న భవనాలకు నష్టం కలగకుండా కప్పి ఉంచటం జరిగింది.