సోనాలి ఫోగాట్ జీవిత చరిత్ర – Sonali phogat biography in Telugu

 సోనాలి ఫోగాట్ ఇండియా కు చెందిన ఒక నటి, హర్యానా బీజేపీ లీడర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్. 22 ఆగస్ట్ 2022 సంవత్సరం గోవా లో గుండె పోటు  తో మరణించారు.  

ఫోగాట్  21 సెప్టెంబర్ 1979 సంవత్సరం లో హర్యానా లోని భూటాన్ గ్రామంలో జన్మించారు.  

సోనాలి ఫోగాట్ టిక్ టాక్ వీడియోస్ ద్వారా చాలా పాపులర్ అయ్యారు. టిక్ టాక్ అనే కాకుండా ఇతర సోషల్ మీడియా  ప్లాట్ ఫార్మ్ లలో కూడా ఆక్టివ్ గా ఉండేవారు. 

2006 వ సంవత్సరంలో  ఒక టీవీ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించారు. నటిగా కెరీర్ ను 2016 వ సంవత్సరం లో ప్రారంభించారు. 2019 సంవత్సరంలో ద స్టోరీ అఫ్ బద్మాష్‌ఘర్ అనే వెబ్ సిరీస్ లో నటించారు.

బీజేపీ పార్టీ లో చేరి తన పొలిటికల్ కెరీర్ ను ప్రారంభించారు. హర్యానా లోని మహిళా మోర్చా సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా నాయకత్వం వహించారు.   

2019 సంవత్సరం బీజేపీ నుంచి టికెట్ లభించగా హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆదంపుర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

ఎన్నికల సమయంలో ప్రసంగిస్తున్న సమయంలో భారత్ మాత కి జై అని చెప్పని వారు పాకిస్తాన్ కి చెందిన వారు అని చెప్పటం తో కాంట్రవర్సీ అయ్యింది. తరవాత తానూ చెప్పిన మాటలకూ క్షమాపణలు కూడా కోరారు. 

  2020 వ సంవత్సరంలో ఎన్నికలలో ఓడిపోయిన తరవాత హర్యానాలోని హిసార్ కు చెందిన  మార్కెట్ కమిటీ కార్యదర్శి ను తనకు తిట్టాడని చెప్పు తో కొట్టి మరో కాంట్రవర్సీ చేసారు. 

2020 వ సంవత్సరంలోనే బిగ్ బాస్ లో కూడా పోటీ చేసారు.  

సోనాలి ఫోగాట్  సంజయ్ ఫోగాట్ అనే రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్నారు. సంజయ్ ఫోగాట్ 2016 వ సంవత్సరంలో తన ఫార్మ్ హౌస్ లో అనుమాన స్పద స్థితిలో మరణించారు. ఈ దంపతులకి ఒక 15 సంవత్సరాల కూతురు యశోద ఫోగాట్ ఉంది.    

గోవా లో షూట్ చేయడానికి వెళ్లిన ఫోగాట్ అనుమానాస్పదంగా మరణించారు. చనిపోయిన రోజు సాయంత్రం తన ఇంస్టాగ్రామ్ నుంచి ఫోటోలు మరియు వీడియోలో కూడా అప్లోడ్ చేసారు.   

అకస్మాత్తుగా గుండెపోటు వల్ల చనిపోవటాన్ని కుటుంబ సభ్యులు నమ్మటం లేదు. సిబిఐ ఎంక్వయిరీ చేసి అసలు ఎం జరిగిందో కనుక్కోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. 

చనిపోయిన రోజు సోనాలి ఫోగాట్ తన చెల్లి అయిన రమన్ కి ఫోన్ చేసి ” వంట్లో అదోలా ఉంది, నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని ” చెప్పారు. 

తరవాత మళ్ళీ కాల్ చేయగా సోనాలి ఫోగాట్ లిఫ్ట్ చెయ్యలేదు. ఆ మరుసటి రోజు చనిపోయిన వార్త విన్నామని చెల్లి రమన వాపోయారు.          

Leave a Comment