జై భీం సినిమా 1993 సంవత్సరంలో తమిళనాడు లోని కడ్డలోర్ అనే జిల్లా లో జరిగిన ఒక యదార్థ సంఘటన పై చేయబడింది.
ఈ సినిమా యొక్క కథ అప్పటి న్యాయవాది మరియు మాజీ జడ్జి అయిన జస్టిస్ చందు గారి జీవితం లో జరిగిన ఒక ఘటన.
1993 వ సంవత్సరంలో తమిళనాడు లోని కడ్డలోర్ (Cuddalore) జిల్లా లోని ఒక గ్రామంలో కురుంబర్ (Kurumbar) అనే గిరిజన సముదాయానికి చెందిన 4 కుటుంబాలు నివసించేవి.
వీరు బతుకుతెరువు కోసం పొలం పనులు చేసేవారు, పొలం పనుల కోసం పక్క గ్రామాలకు వెళ్లేవారు. ఆ సమయంలో గోపాలపురం గ్రామం లోని ఒక ఇంటి నుంచి బంగారం చోరీ చేయబడుతుంది.
ఎంక్వయిరీ కోసం వచ్చిన పోలీసులు ఏ తప్పు చేయని రాజకన్ను అనే అమాయక వ్యక్తిని బంగారం చోరీలో అరెస్ట్ చేస్తారు.
ఆ రోజుల్లో ఉండే మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడైన గోవిందన్ రాజకన్ను ను వదిలేయని కోరుతారు. పోలీసులు మాత్రం ఎవరి మాట వినకుండా రాజకన్ను యొక్క బట్టలు ఊడదీసి నగ్న అవస్థలో ఉంచి కొడుతూ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళతారు.
రాజకన్ను యొక్క భార్య తన భర్త యొక్క ఈ పరిస్థితిని స్వయంగా పోలీస్ స్టేషన్ లో చూస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి రాజకన్ను పోలీస్ కస్టడీ నుంచి మాయమైపోతాడు.
ఇదంతా చూస్తున్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడైన గోవిందన్ వివిధ రకాలుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి రాజకన్ను ను వెతకమని కోరుతారు, ర్యాలీలు కూడా చేసారు కానీ ఫలితం మాత్రం ఏమి దక్కలేదు.
ఇలా అయితే లాభం లేదు అనుకున్న గోవిందన్ చెన్నై లోని లాయర్ కే.చంద్రు యొక్క సహాయాన్ని కోరతారు. మరోపక్క రాజకన్ను యొక్క శవం అరియలూర్ జిల్లా లోని చేపల వేట కోసం వెళ్లే ఒక నౌక లో దొరికింది అని పోలీసులు రిపోర్ట్ తయారు చేస్తారు.
ఇన్నిరోజులు రాజకన్ను తప్పిపోయాడు అనుకున్న కేసు కాస్తా ఒక మర్డర్ కేసు గా మారింది. ఈ కేసు వాదించడానికి కే.చంద్రు గారు ఒప్పుకున్నారు. ఫలితంగా మద్రాస్ హై కోర్ట్ ఈ కేసు ను తప్పు దోవ పట్టించిన 12 మందిని అరెస్ట్ చేయాలని కోరింది.
మద్రాస్ హై కోర్ట్ లో 3 సంవత్సరాల ట్రయల్ నడిచిన తరవాత 1996 వ సంవత్సరంలో ఇచ్చిన ఇంటెరిమ్ జడ్జిమెంట్ (మధ్యంతర తీర్పు) లో రాజకన్ను యొక్క కుటుంభానికి 2 లక్షల 65 వేల రూపాయలు మరియు 3 సెంట్ల భూమిని ఇవ్వటం జరిగింది.
వీరిలో ఒక డాక్టర్ రామచంద్రన్, రిటైర్డ్ DSP ,ఇన్స్పెక్టర్ మరియు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఈ కేసును ముందు నుంచి సహాయం చేస్తున్న గోవిందన్ కోరిక మేరకు కే వెంకట రామన్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా నియమించటం జరిగింది.
ఈ కేసు కు సహాయం చేస్తున్న గోవిందన్ కు పలుసార్లు కేసు నుంచి తప్పుకోవాలని బెదిరించటం కూడా జరిగింది.
ఈ కేసు ను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కి మార్చటం జరిగింది, 13 సంవత్సరాల సుధీర్ఘ నిరీక్షణ తరవాత ఈ కేసు లో నిందితులైన 5 మంది గార్డ్ లకు 14 సంవత్సరాల జైలు శిక్ష ను మరియు డాక్టర్ కు 3 సంవత్సరాల శిక్ష ను విధించటం జరిగింది.