మహాత్మా గాంధీ జీవిత చరిత్ర – Mahatma Gandhi biography in Telugu

మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ ఒక అహింస వాది, భారత దేశానికి స్వాతంత్రం ఇప్పించటంలో ముఖ్యపాత్రను పోషించారు . గుజరాత్ లోని ఒక హిందూ ఫ్యామిలీ లో జన్మించి మంచి చదువు చదివి ఒక లాయర్ అయ్యారు. 

న్యాయవాది గా కెరీర్ ను ముందుగా కొనసాగించటానికి సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ 21 సంవత్సరాలు గడిపి ఇండియా కి 1915 వ సంవత్సరంలో తిరిగి వచ్చారు. 

భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వల్ల చాలా మంది పడుతున్న భాధలు మరియు అన్యాయనాలను చూసి ఒక అహింస ఉద్యమాన్ని ప్రారంభించారు.

గాంధీ గారు భారతదేశం వచ్చాక  ఒక సాధారణమైన జీవితాన్ని గడపటం ప్రారంభించారు, వేసుకునే బట్టలలో మరియు తినే ఆహారం లో కూడా ఒక పేదవారి మాదిరిగా మార్చుకున్నారు.

బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మరియు నిరాహార దీక్షలు చేసి అహింస మార్గంలో నడిచి భారతదేశానికి స్వాతంత్య్రాన్ని రావటంలో చాలా కృషి చేశారు. 

గాంధీజీ మతపర విద్వేషాలకు కూడా వ్యతిరేకంగా ఉండేవారు. కానీ కొంత మంది ఈ విషయాన్ని ఇంకోవిదంగా తీసుకున్నారు, గాంధీజీ పాకిస్తాన్ కు సహాయం చేస్తున్నారని హిందూ జాతీయ వాది అయిన నాథురాం గాడ్ సే 30 జనవరి 1948 వ సంవత్సరంలో కాల్చి చంపేశారు.  

 బాల్యం : 

గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, గాంధీజీ 2 అక్టోబర్ 1869 వ సంవత్సరంలో గుజరాత్ లోని పోరు బందర్ పట్టణంలో కరంచంద్ గాంధీ మరియు పుత్లి బాయ్ గాంధీ అనే దంపతులకు జన్మించారు. గాంధీజీ నాన్న గారు పోరు బందర్ రాష్ట్రానికి దివాన్ గా ఉండేవారు.

గాంధీజి గారి అమ్మ నాన్న లు చాలా సాంప్రదాయ కుటుంబం,  గాంధీజీ గారు తమ తల్లి యొక్క దైవ్యరాధనను మరియు పవిత్రతను చూసి చాలా ప్రభావితులు అయ్యారు.  

గాంధీజీ చిన్నపాటి నుంచే పెద్దగా ఎవరితో మాట్లాడేవారు కాదు, మాట్లాడటానికి కూడా సిగ్గుపడేవారు. తన సమయాన్ని ఎక్కువగా బుక్కు ల తోనే గడిపేవారు.    

చదువు : 

గాంధీజీ లా చదువు కోసం లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గాంధీజీ తల్లి మరియు భార్య ఇంటి నుంచి ఇంత దూరం లండన్ వెళ్లొద్దు అని కోరారు. 

లండన్ వెళ్లి భారత దేశం యొక్క సభ్యత ను మరిచి పాశ్చాత్య సభ్యతకు అలవాటు పడతారని భయపడేవారు. గాంధీజీ శాఖాహారి కావటం వల్ల అక్కడికి వెళ్లి మాంసాన్ని తింటారేమో అని భయపడేవారు.       

గాంధీజీ మాత్రం తాను పై చదువుల కోసం వెళుతున్నానని మద్యం, మాంసం, అమ్మాయిల జోలికి వెళ్ళను అని హామీ ఇచ్చారు.   

సౌత్ ఆఫ్రికా :

1888 సంవత్సరంలో పోరు బందర్ నుంచి ముంబై కి వెళ్లి అక్కడి నుంచి లండన్ కి వెళ్ళటం జరిగింది.  లండన్ లోని యూనివర్సిటీ కాలేజీ లండన్ లో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడికి వెళ్లిన తరవాత తన సిగ్గు పడే స్వభావాన్ని మెల్లి మెల్లిగా విడిచారు మరియు జనాల ముందు మాట్లాడటం ప్రారంభించారు.       

ఇండియా వచ్చిన తరవాత న్యాయవాదిగా కొన్ని కేసులు వాధించారు కానీ అంతగా ఆశించిన ఫలితాలు లభించలేదు. 

1893 వ సంవత్సరంలో ఒక ముస్లిం వ్యాపారి తన ఒక సౌత్ ఆఫ్రికా లో ఉండే  బంధువు యొక్క వ్యాపారం కోసం గాంధీజీ ను న్యాయవాది గా ఉండాలని కోరారు. ఆ వ్యాపారి గాంధీజీ కి మంచి మొత్తంలో డబ్బు కూడా ఇవ్వటానికి సిద్ధం అయ్యారు.  

1893 సంవత్సరంలో గాంధీజీ సౌత్ ఆఫ్రికా కు వెళ్లారు, అక్కడ 21 సంవత్సరాలు గడిపారు. సౌత్ ఆఫ్రికా లో గాంధీజి ని చాలా జాత్యహంకారానికి గురి అయ్యారు.  

గాంధీజీ ఇండియా వారు కావటం తో చాలా వివక్షతను ఎదుర్కొన్నారు. అక్కడి జాతీయులతో కూర్చోవటం మరియు ట్రైన్ లో ప్రయాణించటాన్ని అనుమతించే వారు కాదు.

గాంధీజీ అక్కడ ఉన్నప్ప్పుడు తమ హక్కుల కోసం పోరాడారు మరియు తమ రాజకీయ అభిప్రాయాలను మెరుగుపరుచుకున్నారు.    

స్వాతంత్ర పోరాటం:

సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తరవాత గాంధీజీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పలు ఉద్యమాలలో పాల్గొన్నారు.    

గాంధీజీ గారి అహింస మార్గం వల్ల చివరకి భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది. 

మరణం : 

30 జనవరి 1948 సంవత్సరంలో బిర్లాహౌస్ గార్డెన్ నుంచి ఒక మీటింగ్ కి వెళుతుండగా ఒక హిందూ జాతీయ వాది అయిన నాథురాం గాడ్ సే గన్ ద్వారా 3 రౌండ్లు కాల్పులు జరిపి చంపేశారు. 

Leave a Comment