కమల్ రణదివే జీవిత చరిత్ర – Kamal Ranadive biography in Telugu

కమల్ రణదివే గారు భారతదేశానికి చెందిన ఒక మహిళా శాస్త్రవేత్త. క్యాన్సర్ అనే భయంకర వ్యాధి గురించి పరిశోధనలు చేసారు. వీరు చేసిన పరిశోధనల వల్ల నే క్యాన్సర్ కి మరియు వారసత్వానికి సంభందం ఉండవచ్చని తెలిసింది.

వీరు గ్రామాలలో నివసించే పేద ప్రజలకు వైద్య సదుపాయాలను అందించడం జరిగింది. కమల్ రణదివే యొక్క కుటుంబం వీరి లక్ష్యాలను సాధించటంలో ఎల్లపుడు అండగా నిలిచింది.

వీరు ప్రస్తుతం భారతదేశం లోని చాలా మహిళలకు నిదర్శనం.

బాల్యం మరియు చదువు :

కమల్ రణదివే 8 నవంబర్ 1917 వ సంవత్సరంలో దినేష్ దత్తాత్రేయ సమరత్ మరియు శాంతాబాయి దినకర్ సమర్థ్ అనే దంపతులకు మహారాష్ట్ర లోని పూణే పట్టణంలో జన్మించారు.  

కమల్ రణదివే గారి తండ్రి కాలేజీ లో జీవశాస్త్రవేత్త యొక్క టీచర్ గా పనిచేసేవారు. కమల్ రణదివే తన చదువును హుజుర్ పాగా (Huzurpaga) స్కూల్  లో చదువులను పూర్తి చేసారు. 

రణదివే గారి తండ్రి తన కూతురిని డాక్టర్ అవ్వమని చెప్పారు, పెళ్లి కూడా ఒక డాక్టర్ తోనే చేయాలని అనుకునేవారు.  రణదివే మాత్రం తన చదువు ఫెర్గూసన్ కాలేజీ లో 1934 వ సంవత్సరంలో బ్యాచిలర్అ ఫ్ సైన్స్ ను పూర్తి చేసారు. ఈ డిగ్రీ చేసే సమయంలో బోటనీ మరియు జువాలజీ  ముఖ్య సబ్జెక్టు లుగా ఎంచుకున్నారు. 

బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న తరవాత 1943 వ సంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ ను పూర్తి చేయటానికి పూణే పట్టణం లోని ఒక అగ్రికల్చర్ కాలేజీ లో చేరారు.

ఈ కాలేజీ లో అన్నోనేసి అనే పువ్వులు మరియు పండ్లను ఇచ్చే కుటుంబం యొక్క సైటోజెనిటిక్స్ (cytogenetics) ను చదివారు.  మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసున్న తరవాత సైటోలజీ (Cytology) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. 1949 సంవత్సరంలో యూనివర్సిటీ అఫ్ బాంబే నుంచి Ph.D ను పూర్తి చేసారు.

భారత దేశంలో చదువు పూర్తి చేసుకున్న తరవాత తన గురువు అయిన డాక్టర్ ఖానోల్కర్ సలహా మేరకు అమెరికా లోని బాల్టిమోర్ పట్టణంలో జాన్ హాప్ కిన్స్ అనే యూనివర్సిటీ లో జార్జ్ గ్రే అనే శాస్త్రవేత్త తో కలిసి మొక్కల యొక్క టిష్యూ లకు సంబంధించిన రీసెర్చ్ ను చేసారు.  

కాన్సర్ వ్యాధి పై పరిశోధన : 

 కమల్ ఇండియా కి తిరిగి వచ్చిన తరవాత ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ లో ఒక లాబొరేటరీ ను స్థాపించారు. ఇక్కడ పరిశోధన చేసే సమయంలో సెల్ బయాలజీ, ఇమ్మ్యూనోలోజి, మరియు శరీరంలోని క్యాన్సర్ కణాలుగా ఎందుకు మారతాయి అనే విషయాలపై పరిశోధనలు చేసారు. 

తమ పరిశోధనలో భాగంగా క్యాన్సర్ రకాలైన లుకేమియా, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు అన్నవాహిక క్యాన్సర్ రావటానికి కారణాలను వివరించటం జరిగింది.     

కమల్ గారు చేసిన ఇంకో పరిశోధనలో హార్మోన్స్ మరియు వైరస్ లకు క్యాన్సర్ తో సంభందం ఉండవచ్చని తెలిపారు.  

కమల్ గారు లెప్రసి అనే వ్యాధికి సంబంధించిన బాక్టీరియా పై చేసిన మందస్తు పరిశోధన వల్ల వాక్సిన్ ను కూడా తయారు చేయటం జరిగింది.  

1945 సంవత్సరంలో జంతువుల పై చేసిన పరిశోధనల ఫలితంగా బ్రెస్ట్ క్యాన్సర్ వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు.  

వ్యక్తిగత జీవితం : 

కమల్ రణదివే జయసింగ్ త్రియంబక్ రణదివే ను పెళ్లి చేసుకున్నారు, వీరి భర్త తాను అనుకున్న లక్ష్యాలను సాధించటంలో చాలా సహాయపడ్డారు.   

ఈ దంపతులకు అనిల్ జయ్ సింగ్ అనే కుమారుడు పుట్టడం జరిగింది. వీరు చేసిన కృషికి గాను 1982 సంవత్సరంలో పద్మ భూషణ్ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది.  వీరు చాలా మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు, వీరి కారణంగా మహిళలు వైద్య రంగంలో చేరారు.  

కమల్ రణదివే 11 ఏప్రిల్ 2001 లో 83 సంవత్సరాల వయసులో మరణించారు. 

Leave a Comment