పరాగ్ అగ్రవాల్ జీవిత చరిత్ర – Parag Agrawal biography in Telugu

ట్విట్టర్ యొక్క కో ఫౌండర్ అయిన డోర్సీ (dorsey) 16 సంవత్సరాలు CEO గా ఉన్న తరవాత 29 నవంబర్ 2021 న పదవి నుంచి తనను విరమించుకొని 37 సంవత్సరాలకు చెందిన పరాగ్ అగ్రవాల్ ను కొత్త CEO గా నియమించారు.  

ట్విట్టర్ యొక్క కొత్త CEO అయిన పరాగ్ అగ్రవాల్ IIT ముంబై నుంచి మరియు స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చదువును పూర్తి చేసుకున్నారు. 

CEO గా నియమించిన తరవాత పరాగ్ తన ట్విట్టర్ ద్వారా ” deep gratitude ” అని ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అగర్వాల్ ట్విట్టర్ లో 10 సంవత్సరాల క్రితం కేవలం 1000 మంది ఉద్యోగులు ఉన్నప్పుడు చేరారు.  

CEO అవ్వక ముందు 2017 వ సంవత్సరం నుంచి ట్విట్టర్ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేసేవారు. 

భారత్ దేశ సంతతికి చెందిన CEO ల లిస్ట్ లో పరాగ్ అగ్రవాల్ కూడా చేరారు. పరాగ్ అగ్రవాల్ కి ముంది గూగుల్ CEO గా సుందర్ పిచాయ్ మరియు మైక్రో సాఫ్ట్ CEO గా సత్య నాదెళ్ల నియమించబడ్డారు. 

న్యూయార్క్ కు చెందిన ఒక రిపోర్ట్ ప్రకారం పరాగ్ అగ్రవాల్ సంవత్సరానికి 1 మిలియన్ డాలర్లు జీతం తీసుకుంటారు (1).   

Leave a Comment