సిద్ధార్థ్ శుక్లా జీవిత చరిత్ర – Sidharth Shukla biography in Telugu

బాల్యం :

సిద్ధార్థ్ శుక్లా 12 డిసెంబర్ 1980 వ సంవత్సరంలో ముంబై లో అశోక్ శుక్లా మరియు రీటా శుక్లా దంపతులకు జన్మించారు. సిద్ధార్థ్ యొక్క తండ్రి అశోక్ శుక్లా ఒక సివిల్ ఇంజనీర్,వీరు రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా లో ఉద్యోగం చేసేవారు.   

సిద్దార్థ్ శుక్లా తన స్కూల్ చదువును ముంబై లోని సెయింట్ జెవియర్ లో మరియు డిగ్రీ ను ఇంటీరియర్ డిజైన్ లో  రచనా సంసద్ కాలేజీ నుంచి పూర్తి చేసారు.  చదువును పూర్తి చేసుకున్న తరవాత కొన్ని సంవత్సరాలు ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేసేవారు.  

సీరియల్స్ లో సిద్దార్థ్ : 

సీరియల్స్ కి ముందు 2004 వ సంవత్సరంలో  గ్లాడ్ రాగ్స్ మ్యాన్ హంట్ అండ్ మెగా మోడల్ కాంటెస్ట్ లో రన్నర్ అప్ గా నిలిచారు. 2005 వ సంవత్సరంలో టర్కీ లో జరిగిన వరల్డ్స్ బెస్ట్ మోడల్ కాంటెస్ట్ లో పోటీ చేసారు. ఈ కాంటెస్ట్ లో ఆసియ, లాటిన్ అమెరికా మరియు యూరోప్ నుంచి వచ్చిన 40 పోటీదారులతో గెలిచారు.   

2008 వ సంవత్సరంలో సోనీ టీవీ లో వచ్చిన బాబుల్ కా ఆంగన్ నా ఛూటే సీరియల్ లో మొట్ట మొదటి సారిగా నటించారు. 2012 వ సంవత్సరంలో కలర్స్ టీవీ లో బాలిక వధూ సీరియల్ లో నటించారు. ఈ సీరియల్ కి చాలా బాగా పాపులారిటీ వచ్చింది. ఈ సీరియల్ ఉన్న పాపులారిటీ కారణంగా చాలా రోజులు నడిచింది.    

2014 వ సంవత్సరంలో మొదటి సారిగా బాలీవుడ్ సినిమా అయిన హంప్టీ శర్మా కి దుల్హనియా (Humpty Sharma Ki Dulhania) లో సపోర్టింగ్ రోల్ లో నటించారు. 

2014 వ సంవత్సరంలో సావదాన్ ఇండియా లో హోస్ట్ గా మరియు 2015 సంవత్సరంలో ఇండియాస్ గాట్ ట్యాలెంట్ 6 ( India’s Got Talent 6) లో కూడా హోస్ట్ గా కూడా చేసారు. 2016 వ సంవత్సరంలో India’s Got Talent 7 ను హోస్ట్ చేసారు. 2016 వ సంవత్సరంలో ఫియర్ ఫ్యాక్టర్ : ఖత్రోన్ కి ఖిలాడీ 7 లో గెలిచారు.    

బిగ్ బాస్ : 

2019 సంవత్సరంలో హిందీ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 13 లో పాల్గొన్నారు. 2020 వ సంవత్సరంలో ఫిబ్రవరి లో ఈ షో లో విజేతగా గెలిచారు. 

2020 వ సంవత్సరంలో బిగ్ బాస్ లో గెలిచిన తరవాత రెండు మ్యూజిక్ వీడియోస్ కూడా చేసారు. ఒకటి “Bhula Dunga” , “Dil Ko Karaar Aaya”, ఈ రెండు పాటలు కూడా పెద్ద హిట్లు.   

వ్యక్తిగత జీవితం : 

వీరి తండ్రి ప్రకారం సిద్దార్థ్ చిన్నప్పుడు ఆటలు బాగా ఆడేవారు, టెన్నిస్ మరియు ఫుట్ బాల్ ను ఎక్కువగా ఆడేవారు. సిద్ధార్థ్ శుక్లా మోడలింగ్ చేసే సమయంలోనే వీరి తండ్రి ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి వల్ల చనిపోయారు. సిద్దార్థ్ శుక్లా కి ఇద్దరు చెల్లెల్లు కూడా ఉన్నారు, సిద్దార్థ్ కి పెళ్లి అవ్వలేదు కానీ కొన్ని షెహనాజ్ గిల్ గర్ల్ ఫ్రెండ్ అని పుకార్లు వినిపిస్తూ ఉంటాయి.  

సిద్దార్థ్ శుక్లా 2014 నుంచి 2021 వరకు వివిధ రకాల అవార్డు లను గెలుచుకున్నారు. 

మరణం: 

సిద్ధార్థ్ శుక్లా 40 సంవత్సరాల వయస్సులో సిద్దార్థ్ శుక్లా 2 సెప్టెంబర్ 2021 లో గుండెపోటు కారణంగా మరణించారు.  

Leave a Comment