రజినీష్ (ఓషో) జీవిత చరిత్ర – Rajneesh (Osho) biography in Telugu

ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడూ చనిపోలేదు తాను కేవలం ఈ లోకాన్ని December 11, 1931 మరియు January 19, 1990 మధ్య సందర్శించడానికి వచ్చాడు అని శిలాశాసనం పై రాసి ఉన్న వ్యక్తి  ఓషో (Osho).

పుట్టినప్పుడు తన పేరు చంద్ర మోహన్ జైన్ కానీ తరవాత తన పేరును ఆచార్య రజినీష్ గా మరియు ఓషో గా మార్చుకున్నారు. 

తన ప్రవచనాలతో ఎల్లపుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకొని ఉండే ఓషో కు ప్రపంచమంతటా శిష్యులు ఉన్నారు. మొదట ఇండియా లో పలు చోట్ల ఆశ్రమాలను స్థాపించారు. ఇక్కడి ప్రభుత్వం తో విభేదాలు రావటం తో అమెరికా వెళ్లారు.

అక్కడ కూడా ఓషో చేసే వివాదాస్పద వ్యాఖ్యలు చూసి అక్కడి ప్రభుత్వం కూడా అక్కడి నుంచి పంపించి వేసింది.      

బాల్యం :

 రజినీష్ 11 డిసెంబర్ 1931 వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని రైసెన్ జిల్లాలో బాబూలాల్ జైన్ మరియు సరస్వతి జైన్ అనే దంపతులకు జన్మించారు. వీరికి పుట్టిన 11 మంది సంతానంలో రజినీష్ ఒకరు. రజినీష్ పుట్టిన తరవాత 8 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మమ్మ దగ్గర పెరిగారు. అమ్మమ్మ దగ్గర ఉన్నంత కాలం చాలా గరాభంగా పెరిగారు, స్కూల్ కి తప్పనిసరిగా వెళ్లాలని కూడా ఒత్తిడి ఉండకపోయేది కాదు.  

రజనీష్ కి 7 సంవత్సరాలు ఉన్నపుడు తాతయ్య చనిపోయాడు, 15 సంవత్సరాల వయస్సు లో శశి అనే చిన్న నాటి గర్ల్ ఫ్రెండ్ టైఫాయిడ్ తో చనిపోవటం వల్ల చాలా సంవత్సరాలు బాధ పడేవాడు. స్కూలు కాలం నుంచి ఆధ్యాత్మికత కు చాలా దగ్గర ఉండేవారు, వాదనలు చేయటం లో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు.  

యోగ, శ్వాస నియంత్రణ, మెడిటేషన్, ఉపవాసం చేయటం, క్షుద్రవాదం వంటి వాటిపై మంచి అవగాహనా ఏర్పరచుకునేవారు.   

19 సంవత్సరాల వయస్సు లోనే తనలో ఉండే వాదించే గుణం ఉండటం వల్ల రెండు కాలేజీల వారు ఇంటివద్దనే ఉండమని కేవలం పరీక్షల సమయంలోనే కాలేజీ కి రావాలని ఆదేశించారు. 

కాలేజీ లేనందుకు ఖాళీ సమయంలో ఒక లోకల్ న్యూస్ పేపర్ లో పనిచేయటం ప్రారంభించారు. న్యూస్ పేపర్ లో ఉద్యోగం మానివేసిన తరవాత జబల్ పూర్ లో జరిగే సర్వ ధర్మ సమ్మేళనం లో ప్రసంగించటం మొదలుపెట్టారు. ఈ సమ్మేళనం జైన్ సముదాయం చే నిర్వహించబడేది, ఇందులో అన్ని మతాల వారు వచ్చేవారు.

పెళ్లి వయస్సు వచ్చిన తరవాత తల్లి తండ్రులు పెళ్లి చేసుకోమని అడగగా నిరాకరించారు. రజినీష్ కు 21 సంవత్సరాలు ఉన్నపుడు జబల్ పూర్ లోని ఒక భాన్ వార్తల్ అనే ఒక గార్డెన్ లో కూర్చున్నప్పుడు జ్ఞానోదయం అయ్యిందని చెప్పారు.

 రజినీష్ తన గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్  ను ఫిలాసఫీ లో పూర్తి చేసారు. కాలేజీ చదువును పూర్తి చేసుకున్న తరవాత రాయి పూర్ లోని సంస్కృత కాలేజీ లో ఉద్యోగం సంపాదించారు.

 కానీ ఆ కాలేజీ వైస్ ఛాన్సలర్ రజినీష్ చెప్పే పాఠాలు మరియు విచారాలు చాలా భిన్నంగా ఉన్నాయని మరియు పిల్లల యొక్క నైతికత మరియు మతానికి చాలా ప్రమాదమని గ్రహించి వేరే కాలేజీ కి వెళ్ళమని కోరారు. అక్కడి నుంచి జబల్ పూర్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా పనిచేయటం మొదలుపెట్టారు. 

ఉపన్యాసాలు :

కాలేజీ లో ఒక వైపు చదువు చెబుతూనే భారత దేశం మొత్తం ఆచార్య రజినీష్ పేరున ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఈ ఉపన్యాసాలలో సోషలిజానికి, గాంధీ జి కి మరియు సంస్థాగత మతాల ను విమర్శిస్తూ మాట్లాడేవారు.     

ఈ ఉపన్యాసాలలో భారత దేశ వెనుకబాటుతనం పోవాలంటే జనన నియంత్రణ,మోడరన్ టెక్నాలజీ, సైన్స్ మరియు కాపిటలిజం కావాలని చెప్పేవారు.  ప్రస్తుతం ఉన్న అన్ని మతాలూ నాశనం అయిపోయాయని, ఈ మతాలను అనుసరించే వారిని భయానికిగురి చేస్తున్నారని వివాదాస్పద కామెంట్లు చేసారు. 

ఈ మాటలు నచ్చిన చాలా మంది రజినీష్ ను అనుసరించటం ప్రారంభించారు. సామాన్య ప్రజలనుంచి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా రాజినీష్ ను అనుసరించడం మొదలుపెట్టారు.     

1962 లో ఓషో ప్రసంగాలతో పాటు మెడిటేషన్ క్యాంపులు కూడా ప్రారంభించారు. ఓషో చేసే వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన  తరవాత తాను ప్రొఫెసర్ గా పనిచేసే యూనివర్సిటీ కూడా అక్కడినుంచి రాజీనామా చేసి వెళ్ళమని కోరింది. 

1968 సంవత్సరంలో కూడా హిందూ నాయకులపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మతాలు అర్థం కానీ విధంగా  మరియు ద్వేషాన్ని పెంచుతాయి అని చెప్పారు. ఒక స్వచ్ఛమైన మతం జీవితాన్ని ఆనందించనివ్వాలి అని చెప్పారు. 

1970 సంవత్సరంలో ఓషో డైనమిక్ మెడిటేషన్ ను ప్రారంభించారు, ఈ మెడిటేషన్ లో శ్వాసను త్వర త్వరగా తీసుకోవటం, మ్యూజిక్ మరియు డ్యాన్స్ తో ఎంజాయ్ చేసేవారు. 

ఓషో యొక్క శిష్యులు ఆరంజ్ దుస్తులు, ఒక మాల మరియు ఓషో యొక్క బొమ్మ కలిగిన లాకెట్ ధరించే వారు.  ఒక వ్యాపార వేత్త కూతురు ఓషో యొక్క శిష్యురాలు అవ్వటం వల్ల ఓషో కి డబ్బు సహాయం అందింది. ఫలితంగా 1970 నుంచి దేశమంతటా ప్రయాణించకుండా  ముంబై లోనే స్థిరపడ్డారు. 

1971 నుంచి తన పేరుకు ముందు భగవాన్ శ్రీ రాజినీష్ అని పెట్టడం ప్రారంభించారు.  

ముంబై నుంచి పూణే  :

ముంబై లో ఉన్నంత కాలం  ఆస్థమా, డయాబెటిస్ మరియు పలు రకాల అలెర్జీల తో ఆరోగ్యం బాగుండకపోవటం వలన అక్కడి వాతావరణమే కారణమని అనుకున్న ఓషో పూణే కి తన నివాసాన్ని మార్చారు. పూణే లో ఒక శిష్యురాలి సహాయం తో  దాదాపు 6 ఎకరాలలో కొత్త ఆశ్రమాన్ని స్థాపించారు.

 పూణే కి ఆశ్రమం మారిన తర్వాత చాలా మంది విదేశీయులు ఓషో ఆశ్రమానికి రావటం మొదలుపెట్టారు. కొంత కాలం తరవాత ఆశ్రమం బట్టలు, నగలు, సిరామిక్స్ మరియు కాస్మొటిక్స్ లాంటి వస్తువులను ఉత్పత్తి చేయటం మొదలుపెట్టింది. 1975 లో ఓషో థెరపీ గ్రూపులను ప్రారంభించారు, ఫలితంగా ఆశ్రమము యొక్క ఆదాయం అకస్మాత్తుగా పెరిగింది.          

క్రమ క్రమంగా ఓషో యొక్క శిష్యుల సంఖ్య  ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం మొదలు అయ్యింది.  

పూణే ఆశ్రమం చిన్నది అవ్వటం వల్ల ఆశ్రమాన్ని వేరే స్థానానికి మార్చాలని కూడా నిర్ణయించబడింది. ఓషో శిష్యులుపలు చోట్లు ఆశ్రమ కోసం చూసారు కానీ అప్పటి ప్రభుత్వానికి ఓషో కి విబేధాలు రావటం వల్ల ఆశ్రమం మార్చటం జరగలేదు.  

1980 సంవత్సరంలో హిందూ మతానికి చెందిన విలాస్ తుపే ఓషో ప్రాణాలను తీయటానికి ప్రయత్నించటం జరిగింది.  

1981 సంవత్సరంలో శిష్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు దాదాపు 30,000 సందర్శకులు వచ్చేవారు. కొంత మంది ఆరోపణల ప్రకారం ఓషో క్రమ క్రమంగా ప్రవచనాలకు బదులుగా కుళ్ళు జోకులు వేయటం మొదలుపెట్టారు. 

అమెరికా ప్రయాణం మరియు రజినీష్ పురం  : 

ఓషో ఆలోచన విధానం మరియు వివాదస్పద ప్రవచనాలు మరియు ప్రభత్వ వ్యతిరేకత చూసిన తరవాత అమెరికా లో వెళ్లి ఒక ఆశ్రమాన్ని స్థాపించాలని అనుకున్నారు. ఈ మధ్యకాలంలో రాజినీష్ ఆరోగ్య కారణాల రీత్యా కూడా అమెరికా వెళ్ళవలసి వచ్చింది. 

13 జూన్ 1981 సంవత్సరంలో ఓషో యొక్క సెక్రటరీ అమెరికా లోని ఒరెగన్ లో దాదాపు 64 వేల ఎకరాల స్థలం కొనటం జరుగుతుంది. ఈ స్థలం చాలా పెద్ద మొత్తంలో ఉండటం వల్ల దీనికి “రాంచో రాజినీష్” అని పేరు పెట్టారు. ఒక సంవత్సరం తరవాత ఈ ప్రదేశానికి రాజినీష్ పురం అని పేరు పెట్టారు. 

ఈ రజనీష్ పురం లో ఎలాంటి రకాలైన ఆంక్షలు ఉండేవి కావు. ఎవరికీ నచ్చినట్లు వారు ఉండవచ్చు, ఎవరితో నైనా సంభందాలు పెట్టుకోవచ్చు. చివరకి ఓషో స్వయంగా తన శిష్యుల తో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా చెప్పారు. 

రాజనీష్ పురం స్థాపించిన తరవాత ఒరెగన్ లో ఉంటున్న ఇతర అమెరికా జాతీయులు అభ్యంతరం తెలపటం మొదలుపెట్టారు. అక్కడి ప్రజలు కోర్టు ను మరియు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.        

ఇదంతా ఇలా ఉండగా  ఓషో మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ అయిన Christine Woolf తో ఏకాంతంలో గడిపేవారు. ఆ సమయంలో ఓషో వద్ద పలు Rolls-Royce కార్లు కూడా ఉండేవి.   

1985 సంవత్సరంలో రాజినీష్ అనుచరులు మాస్ ఫుడ్ పాయిజన్ మరియు అక్కడి ప్రభుత్వ అధికారులను చంపడానికి ప్లాన్ చేసారని ఆరోపిస్తూ రాజనీష్ ను అరెస్ట్ చేసారు. తర్వాత కొన్ని డిమాండ్ల మేరకు రాజినీష్ ను వదిలివేసారు.   

అమెరికా నుంచి బయటికి వచ్చిన తరవాత ఇతర దేశాలకు వెళ్లాలని కూడా ప్రయత్నించారు కానీ ఓషో యొక్క ప్రవచనాల ను చూసిన తరవాత దాదాపు 21 దేశాలు ఓషో తమ దేశానికి రావద్దు అని చెప్పాయి.  

చివరికి తిరిగి భారతదేశంలోనే మళ్ళీ తన ప్రవచనాలను ఇవ్వటం మొదలుపెట్టారు.  

మరణం : 

19 జనవరి 1990 సంవత్సరంలో పూణే లోని ఆశ్రమంలో 58 సంవత్సరాల వయస్సులో  గుండె పోటు తో మరణించారు. కొంత మంది శిష్యుల ప్రకారం ఓషో ను ప్లాన్ చేసి చంపేసారని ఆరోపిస్తుంటారు కానీ ఇప్పటి వరకు వీటి పై ఎలాంటి ఆధారాలు లేవు . 

Leave a Comment