ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య మంత్రి మరియు YSR పార్టీ స్థాపకుడు YS జగన్ మోహన్ రెడ్డి. రాజకీయాలలో ప్రవేశించిన తరవాత ఇండియన్ కాంగ్రెస్ తో జగన్ పనిచేసారు.
తండ్రి YSR చనిపోయిన తరవాత కాంగ్రెస్ హై కమాండ్ తో విభేదాలు రావటం తో కొత్త పార్టీ YSRCP ను ప్రారంభించారు.
Table of Contents
బాల్యం :
జగన్ మోహన్ రెడ్డి 21 డిసెంబర్ 1972 సంవత్సరంలో కడప జిల్లా లోని జమ్మలమడుగు లో రాజశేఖర రెడ్డి మరియు విజయమ్మ అనే దంపతులకు జన్మించారు. జగన్ యొక్క తండ్రి పూర్వం రెండు సార్లు ఆంధ్రప్రేదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నారు.
జగన్ తన చదువును హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో మరియు గ్రాడ్యుయేషన్ ను బ్యాచలర్ అఫ్ కామర్స్ లో పూర్తి చేసారు.
రాజకీయ జీవితం :
జగన్ 2004 సంవత్సరం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రచార కార్యక్రమాలలో పాల్గొనే వారు. 2009 వ సంవత్సరంలో కడప నియోజక వర్గం నుంచి మెంబెర్ అఫ్ పార్లమెంట్ గా ఎన్నుకోబడ్డారు.
2009 YSR ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తరవాత జగన్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను చేపట్టాలి అనుకున్నారు. పార్టీ లోని సభ్యులు కూడా ఇందుకు ఒప్పుకున్నారు కానీ పార్టీ లీడర్లు అయిన సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ దీనికి ఒప్పుకోలేదు.
కేంద్ర ప్రభుత్వం తనకు ముఖ్య మంత్రి పదవి ఇవ్వదని తెలుసుకున్నాక తన తండ్రి అయిన YSR మరణ వార్త విని చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించాలి అని ఓదార్పు యాత్ర ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఓదార్పు యాత్ర ఆపమని కోరగా ఇది నా వ్యక్తిగత విషయం అని జగన్ యాత్రను కొనసాగించారు.
YSR కాంగ్రెస్ పార్టీ (YSRCP) :
జగన్ కి కేంద్ర ప్రభుత్వ హై కమాండ్ తో విభేదాలు రావటం తో 2010 సంవత్సరంలో కడప నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి పార్టీ లో నుంచి కూడా వైదొలిగారు. అదేవిధంగా తల్లి విజయమ్మ కూడా పులివెందుల నియోజక వర్గం నుంచి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వచ్చేసారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసిన తరవాత డిసెంబర్ 7,2010 వ సంవత్సరంలో 45 రోజులలో తానూ ఒక కొత్త పార్టీ ని స్థాపిస్తున్నానని పులివెందుల నుంచి ప్రకటించారు.
2011 వ సంవత్సరంలో ఈస్ట్ గోదావరి లోని జగ్గంపేట లో YSR కాంగ్రెస్ పార్టీ అనే కొత్త పార్టీ ని స్థాపిస్తున్నానని జగన్ ప్రకటించారు.
జగన్ మరియు విజయమ్మ రాజీనామా చేసిన తరవాత జరిగిన బైపోల్ ఎలక్షన్ లలో ఇద్దరు భారీ మెజారిటీ తో గెలిచారు.
2012 వ సంవత్సరంలో జగన్ యొక్క ఆస్తుల విషయంలో మరియు 58 కంపెనీలు జగన్ వ్యాపారం లో పెట్టుబడులు పెట్టాయని ఫలితంగా వారికి మైనింగ్ కోసం లీజ్ ఇవ్వటం జరిగిందని సిబిఐ ఆరోపించి అరెస్ట్ చేసింది.
జైలు లో ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా 125 గంటల పాటు నిరాహార దీక్ష చేసారు. ఈ దీక్షలో ఆరోగ్యం క్షిణించటం వల్ల ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స చేయటం జరిగింది.
జైలు నుంచి బయటికి వచ్చిన తరవాత తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా బందు ను కూడా నిర్వహించారు.
పార్టీ పెట్టిన తరవాత జరిగిన 2014 ఎన్నికలలో 175 సీట్లకు కేవలం 67 సీట్లను మాత్రమే గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలలో గెలిచింది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఎన్నికలు ఓడిపోయిన తరవాత 2017 లో 3000 కిలో మీటర్ల ప్రజా సంకల్ప యాత్ర పేరు తో పాదయాత్ర ను కూడా చేయారు.
ముఖ్యమంత్రిగా జగన్ :
2019 లో జరిగిన ఎన్నికలలో 175 స్థానాలలో 151 అసెంబ్లీ సీట్లు మరియు 25 లోక్ సభ సీట్లలో 22 సీట్లతో గెలిచి భారీ ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.
30 మే 2019 లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ముఖ్యమంత్రి అయ్యాక చాలా సంక్షేమ పథకాలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రతిపాదించిన TDP పార్టీ నిర్ణయాన్ని కొట్టి వేసి మూడు రాజధానులుగా కర్నూల్, అమరావతి, విశాఖపట్టణం గా ఉంచాలని ప్రతిపాదించారు.
వ్యక్తిగత జీవితం :
1996 సంవత్సరంలో జగన్ భారతి రెడ్డి ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జగన్ యొక్క చెల్లెలు YS షర్మిల కూడా ఒక రాజకీయ నాయకురాలు.
2020 సంవత్సరంలో ” Humanity is my religion ” అంటే మానవత్వమే నా మతం అని పేర్కొన్నారు.