ఎజాజ్ పటేల్ జీవిత చరిత్ర – Ajaz Patel Biography in Telugu

ఎజాజ్ యూనుస్ పటేల్ 21 అక్టోబర్ 1988 సంవత్సరంలో ముంబై పట్టణం లో జన్మించారు. ఎజాజ్ 8 సంవత్సరాల వయస్సు లోనే ముంబై నుంచి న్యూజిలాండ్ కి వెళ్లి స్థిర పడ్డారు. ఎజాజ్ పటేల్ ఒక న్యూజీలాండ్ క్రికెటర్.   

ఎజాజ్ పటేల్ ఇంటర్నేషనల్ న్యూజిలాండ్ క్రికెట్ టీం లో 2018 సంవత్సరంలో అరంగేంట్రం చేసారు. ఇదే సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ లో కూడా అరంగేంట్రం చేసారు.

డొమెస్టిక్ కెరీర్ : 

ఎజాజ్ పటేల్ 2015 వ సంవత్సరంలో లిస్ట్ A క్రికెట్, 2015 – 2016 ఫోర్డ్ ట్రోఫీ లో ఆడటం ప్రారంభించారు. 

2015 – 2016 లో జరిగిన ప్లంకెట్ షీల్డ్ సీజన్ లో 43 వికెట్లను తీసి ఎక్కువ వికెట్ లు తీసుకున్న బౌలర్ గా నిలిచారు.

2018 లో జరిగిన న్యూజిలాండ్ క్రికెట్ అవార్డులలో మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ అఫ్ ద ఇయర్ గా నిలిచారు. 

2017 – 2018 లో జరిగిన ప్లంకెట్ షీల్డ్  సీజన్ లో 9 మ్యాచులలో 48 వికెట్లను తీసి ఎక్కువ వికెట్లను తీసుకున్న ఆటగాడి గా నిలిచారు.        

ఇంటర్నేషనల్ కెరీర్ :

2018 వ సంవత్సరంలో న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ కు మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడి తన ఇంటర్నేషనల్ కెరీర్ ను ఎజాజ్ ప్రారంభించారు. 

2018 సంవత్సరం లోనే న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ కు మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ లో అరంగేట్రం చేసారు. 

డిసెంబర్ 2021 లో న్యూజిలాండ్ మరియు ఇండియా మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో మొత్తం 10  వికెట్లను తీసారు.

ఒకే మ్యాచ్ లో మొత్తం పది వికెట్లను తీసిన ఆటగాళ్లలో 3 వ ఆటగాడిగా నిలిచారు. 

ఎజాజ్ కు ముందు జిమ్ లేకర్ మరియు అనిల్ కుంబ్లే ఒకే మ్యాచ్ లో 10 వికెట్లను తీసారు.         

Leave a Comment