గుజరాత్ లో జన్మించి ఒక వ్యాపార వేత్త గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ను స్థాపించిన వ్యక్తి ధీరుభాయి అంబానీ. ప్రస్తుతం ధీరుభాయి యొక్క కంపెనీ ఫార్చ్యూన్ 500 లిస్ట్ లో మొదటి 100 కంపెనీ లలో ఉంది.
ప్రస్తుతం ధీరుభాయి కంపెనీ ను వీరి ఇద్దరి కుమారులు చూసుకుంటున్నారు.
బాల్యం :
ధీరుభాయి అంబానీ 28 డిసెంబర్ 1932 సంవత్సరంలో హిరాచంద్ అంబానీ మరియు జమున బెన్ అంబానీ దంపతులకు జునాగఢ్ జిల్లా, గుజరాత్ లో జన్మించారు. ధీరుభాయి అంబానీ యొక్క తండ్రి ఒక స్కూల్ టీచర్.
ధీరుభాయి అంబానీ తన చదువును బహదూర్ ఖాన్ జీ స్కూల్ నుంచి పూర్తి చేసారు. స్వాతంత్రం వచ్చిన తరవాత జునాగఢ్ రాజు తన రాజ్యాన్ని పాకిస్తాన్ లో కలపాలి అన్నప్పుడు జరిగిన నిరసనలలో చిన్న తనంలోనే ధీరుభాయి అంబానీ ఆ రాజు కి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
1948 సంవత్సరంలో భారత దేశం నుంచి తన తమ్ముడి తో కలిసి యమన్ కి వెళ్లి అక్కడ ఒక కంపెనీ లో క్లర్క్ గా ఉద్యోగం చేయటం మొదలుపెట్టారు.
అక్కడ పనిచేస్తున్నప్పుడు ట్రేడింగ్, అకౌంటింగ్, మరియు వ్యాపారానికి సంబంధించిన మెళుకువులను నేర్చుకున్నాడు. 1958 సంవత్సరంలో ఇండియా లోనే వ్యాపారం చేయాలని నిశ్చయించుకొని ఇండియా తిరిగి వచ్చారు.
ఇండియా లో వ్యాపారం :
ధీరుభాయి అంబానీ ఇండియా కి తిరిగి వచ్చిన తరవాత తన కజిన్ తో కలిసి పాలిస్టర్ ఇంపోర్ట్ చేయటం మరియు స్పైసెస్ (సుగంధ ద్రవ్యాలు) ను యమన్ కి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారం చేసేవారు.
ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ పేరుతో మస్జీద్ బందర్, నార్సినాథ వీధి లో మొట్ట మొదటి ఆఫీస్ ను ప్రారంభించారు.
అంబానీ ఇతర వ్యాపారాలను కూడా ప్రారంభించారు, తాను తక్కువ లాభం తీసుకొని మంచి క్వాలిటీ ఇవ్వటం వల్ల వ్యాపారం చాలా త్వరగా అభివృద్ధి చెందింది.
ఇన్నిరోజులు తన తో పాటు పాట్నర్ లుగా ఉన్న చంపక్ లాల్ ధమని మరియు అంబానీ విడిపోయారు. చంపక్ లాల్ వ్యాపారాన్ని ఆచి తూచి చేసేవారు, రిస్క్ ఎక్కువగా ఉన్న వ్యాపారాన్ని చేసేవారు కాదు. ధీరుభాయి మాత్రం రిస్క్ తీసుకోవటం, లాభాలను ఎలా పెంచటం లాంటి వాటి పై ఎక్కువగా ఆలోచించేవారు.
నిత్యవసర సరుకుల వ్యాపారం నుంచి బట్టల వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. విమల్ అనే బ్రాండ్ ను కూడా మొదలుపెట్టారు, ఈ బ్రాండ్ శారీస్, షాల్, డ్రెస్సులకు అవసరమయ్యే పాలిస్టర్ మెటీరియల్ ను సప్లై చేసేవారు.
1973 వ సంవత్సరంలో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గా మార్చటం జరిగింది. 1977 వ సంవత్సరంలో రిలయన్స్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించింది.
స్టాక్ మార్కెట్ లో ప్రవేశించిన తరవాత కొంత మంది ఇన్వెస్టర్లు రిలయన్స్ యొక్క షేర్లను కిందికి దించాలని ప్రయత్నించారు.రిలయన్స్ మాత్రం మార్కెట్ లో నిలదొక్కుకొని ముందు కన్నా ఎక్కువ షేర్ల ధరతో దూసుకువెళ్లింది.
మరణం :
1986 లో ధీరుభాయి కి మొదటిసారి గుండె పోటు వచ్చింది, ఆ సమయంలో ధీరుభాయి యొక్క కుడి చేతి పక్షవాతానికి గురి అయ్యింది. 2002 లో ధీరుభాయి కి రెండవ సారి గొండెపోటు వచ్చింది, ఒక వారం కోమా లో ఉన్న తర్వాత 6 జులై 2002 వ సంవత్సరంలో చనిపోయారు.
మొదటి సారి గుండె పోటు వచ్చిన తరవాత ధీరుభాయి తన వ్యాపారాన్ని తన ఇద్దరి కొడుకుల పేరున చేశారు. ముకేశ్ అంబానీ మరియు అనిల్ అంబానీ ఇద్దరు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ గ్రూప్ అనే రెండు కంపనీలు ప్రారంభించారు.
2007 సంవత్సరం లో ధీరుభాయి యొక్క జీవితం ఆధారం చేసుకొని గురు అనే మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా లో హీరో గా అభిషేక్ బచ్చన్ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో సక్సెస్ అయ్యింది.