Table of Contents
బాల్యం :
చంద్ర బాబు నాయుడు 20 ఏప్రిల్ 1950 వ సంవత్సరంలో నరవారి పల్లె, చిత్తూరు జిల్లాలో నారా ఖర్జున నాయుడు మరియు అమనమ్మా అనే దంపతులకు జన్మించారు. చంద్ర బాబు నాయుడు కి ఒక తమ్ముడు మరియు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు.
చంద్రబాబు తన స్కూల్ చదువు లను శేషపురం మరియు చంద్ర గిరి ప్రభుత్వ పాఠశాల నుంచి పూర్తి చేసారు. 1972 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ కాలేజీ నుంచి BA డిగ్రీ ను పూర్తి చేసారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను ఎకనామిక్స్ లో శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ నుంచి పూర్తి చేసారు. PHD ను చేయటానికి అడ్మిషన్ తీసుకున్నారు కానీ పూర్తి చేయలేదు.
రాజకీయ జీవితం :
శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే సమయంలోనే యూనియన్ లీడర్ గా కార్య కలాపాలు ప్రారంభించారు. 1975 సంవత్సరంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో చేరి పులిచెర్ల ప్రెసిడెంట్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి యువత కు ఇచ్చే కోటా లో చంద్రగిరి నియోజక వర్గం నుంచి కేవలం 28 సంవత్సరాల వయస్సు లో MLA గా ఎక్కుకోబడ్డారు. టంగుటూరి అంజయ్య ముఖ్య మంత్రి హయాం లో సినిమాటోగ్రఫీ మంత్రి గా నియమించి బడ్డారు.
సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత ప్రముఖ సినీ నటుడు N.T. రామ రావు తో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడ్డ తరవాత 1980 లో రామ రావు గారి రెండవ కుమార్తె భువనేశ్వరి తో చంద్రబాబు పెళ్లి చేసుకున్నారు.
రామా రావు గారు 1982 సంవత్సరంలో తెలు దేశం పార్టీ (TDP) స్థాపించారు. 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చంద్ర బాబు తెలుగు దేశం పార్టీ అభ్యర్థి తో ఓడిపోయాడు.
కాంగ్రెస్ తరపు నుంచి ఎన్నికలు ఓడిపోయి చంద్ర బాబు తెలుగు దేశం పార్టీ లో చేరారు. పార్టీ లో చేరిన తరవాత బాబు యొక్క పనులకు మెచ్చి పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ గా నియమించారు.
ముఖ్యమంత్రి గా నాయుడు :
1995 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు మొట్ట మొదటి సారి ముఖ్య మంత్రిగా ఎన్నుకోబడ్డారు. రామ రావు గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చంద్ర బాబు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపించారు.
1999 లో చంద్ర బాబు నాయుడు భారీ మెజారిటీ తో రెండవ సారి ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు. ముఖ్య మంత్రి అయ్యిన తర్వాత దీపం స్కీం ద్వారా ఉచిత సీలిండర్లు, జన్మ భూమి కార్యక్రమం ద్వారా పరిశుభ్రత మరియు చెట్లను నాటడాన్ని ప్రోత్సహించారు.
ఇవేకాకుండా రైతుల కోసం రైతు బజార్, ప్రజలతో ముఖ్య మంత్రి అని సామాన్య ప్రజలతో ఫోన్ లో మాట్లాడటం మరియు E seva సెంటర్లను ప్రారంభించారు. ఈ సెంటర్ల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయదని వెసులుబాటు కలిగింది.
1998 లో సైబర్ టవర్స్ ను ప్రారంభించి హైటెక్ సిటీ నిర్మాణానికి పునాది వేసారు. క్రమ క్రమంగా హైదరాబాద్ ఒక ఐటీ హబ్ గా మారింది. సాఫ్ట్ వారే జోరు అందుకుంది.
1999 లో జీనోమ్ వ్యాలీ (genomevally) పేరు తో ఫార్మాసూటికల్ కంపెనీలతో ఫార్మా సిటీ ను ప్రారంభించారు.
చంద్ర బాబు నాయుడు హయాంలోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించటం జరిగింది. హైదరాబాద్ లో ఉన్న బేగం పేట ఎయిర్ పోర్ట్ ఇరుకుగా అవ్వటం వల్లనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను నిర్మించటం జరిగింది.
2004 మరియు 2009 లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరవాత ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్ట మొదటి ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు.
2019 లో జరిగిన ఎన్నికలలో YSR కాంగ్రెస్ పార్టీ చేతిలో తెలుగు దేశం భారీ మెజారిటీ తో ఓడిపోయింది.
వ్యక్తిగత జీవితం :
చంద్ర బాబు నాయుడు మరియు భువనేశ్వరి దంపతులకు 23 జనవరి 1983 వ సంవత్సరంలో ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పేరు నారా లోకేష్.
చంద్ర బాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మూడు సార్లు నక్సల్ గ్రూపులు చంపడానికి ప్రయాణించారు. ఈ మూడు సార్లు నక్సల్ గ్రూపులు విఫలమయ్యాయి.