Table of Contents
బాల్యం :
చంద్రశేఖర్ రావు 17 ఫిబ్రవరి 1954 వ సంవత్సరంలో చింతమడక గ్రామంలో రాఘవ రావు మరియు వెంకటమ్మ అనే దంపతులకు జన్మించారు.
కాలేజీ లో చదివే రోజులలో యూత్ కాంగ్రెస్ లో చేరారు, విద్యార్థి సంఘం అధ్యక్షకుడిగా పోటీ చేసి ఓడిపోయారు. కాలేజీ పూర్తి చేసిన తరవాత కూడా రాజకీయాల వైపే తన దృష్టిని పెట్టారు.
రాజకీయ జీవితం :
ఆ సమయంలోకాంగ్రెస్ MLA గా ఉన్న మదన్ మోహన్ వద్ద చేరారు, మదన్ మోహన్ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కెసిఆర్ గెలిపించడానికి చాలా కృషి చేసారు. ఫలితంగా మదన్ మోహన్ ఎన్నికలను గెలిచారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి MLA టికెట్ దొరకక పోవటం తో అప్పుడే NT రామ రావు తో స్థాపించబడ్డ తెలుగు దేశం పార్టీ లో చేరారు. టీడీపీ లో చేరిన తరవాత రామ రావు గారు సిద్ది పేట నియోజక వర్గం నుంచి MLA టికెట్ ను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తానూ ముందుగా చేరిన కాంగ్రెస్ MLA మదన్ మోహన్ కి వ్యతిరేకంగా పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో స్వల్ప తేడా తో ఓడిపోయారు.
1985 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కెసిఆర్ గెలిచి మొదటి రాజకీయ విజయాన్ని చేజిక్కించుకున్నారు. KCR యొక్క పనితీరుని చూసి కరువు నివారణ మరియు రవాణా మంత్రి ను చేసారు.
రామ రావు తరవాత చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కెసిఆర్ కు రవాణా శాఖ మంత్రి పదవి ను ఇవ్వటం జరిగింది.
TRS పార్టీ :
2000 నుంచి 2001 వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. చంద్ర బాబు నాయుడు కి మరియు KCR కి మధ్య విభేదాలు రావటం వల్ల డిప్యూటీ స్పీకర్ పదవి కి రాజీనామా చేసి కొత్త పార్టీ ని పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఏప్రిల్ 2001 వ సంవత్సరంలో తెలంగాణ ప్రజలు వివక్షతకు గురి అవుతున్నారని తెలంగాణ ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ని స్థాపించారు.
2001 సంవత్సరంలో బై ఎలెక్షనల్ లో పోటీ చేసిన KCR తెలుగు దేశం అభ్యర్థి ని భారీ మెజారిటీ తో ఓడించారు. 2004 వ సంవత్సరంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పిస్తానని చెప్పగా కాంగ్రెస్ పార్టీ కు మద్దతు చేసారు.
అంచనా వేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కెసిఆర్ కు మంత్రి పదవులను కూడా ఇవ్వటం జరిగింది. తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రం గా మారుస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ విషయం పై చర్చ చేయటం మానివేసారు.
ఈ విషయం గ్రహించిన కెసిఆర్ ఎంపీ పదవిని రాజీనామా చేసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడారు. మరోపక్క కాంగ్రెస్ మరియు తెలుగు దేశం పార్టీ లు TRS పార్టీ కి వ్యతిరేకంగా ప్రచారాలు చేయటం మొదలుపెట్టారు.
2009 లో జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకొని పోటీ చేసారు. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావటం తో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ గా మిలిగిలిపోయింది.
2009 సంవత్సరంలోనే ఒక హెలికాప్టర్ ఆక్సిడెంట్ లో YS రాజశేఖర్ రెడ్డి ( YSR ) మరణించటంతో రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు.
ఇదే మంచి అవకాశంగా భావించిన కెసిఆర్ మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 2009 సంవత్సరం నవంబర్ నెలలో ఆమరణ నిరాహార దీక్ష ను ప్రారంభించారు.
కెసిఆర్ ఆరోగ్యం క్షీణించటం తో ఆసుపత్రి పాలు అయ్యారు. రోజులు గడిచిన కాంగ్రెస్ తరఫునుంచి ఎలాంటి సమాధానం రాకపోవటం తో దీక్ష విరమించుకోవాలి అని అడగగా “నేను బతికి చరిత్ర హీనుడు అయ్యే కంటే చనిపోవటం మేలు ” అని చెప్పారు.
11 రోజుల దీక్ష తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ను ఒక ప్రత్యేక రాష్ట్రం గా గుర్తిస్తానని హామీ ఇచ్చింది.
ముఖ్యమంత్రి :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికలలో TRS ప్రభుత్వం భారీ మెజారిటీ తో గెలిచింది. కెసిఆర్ మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.
2019 లో జరిగిన ఎన్నికలలో కూడా KCR గెలిచి ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు.
వ్యక్తిగత జీవితం :
కెసిఆర్ గారు శోభా గారి తో పెళ్లి చేసుకున్నారు, వీరికి ఇద్దరు సంతానం. ఒక కుమారుడు కే.టీ రామ రావు మరియు కూతురు కవిత.
Source: K. Chandrashekar Rao – Wikipedia