గురు గోబింద్ సింగ్ జీవిత చరిత్ర – Guru Gobind Singh biography in Telugu

గురు గోబింద్ సింగ్ సిక్కు మతం యొక్క 10 వ గురువు. చిన్న తనంలో వీరి తండ్రి గురు తేగ్ బహదూర్ గారు సిక్కు మతం యొక్క 9 వ గురువు గా ఉన్నారు.  సిక్కు మతానికి మరియు ఇస్లాం కి ఉన్న కొన్ని గొడవల కారణంగా గురు తేగ్ బహదూర్  ఔరంగజేబ్ రాజు ద్వారా బహిరంగంగా చంపబడుతారు. 

తండ్రి చనిపోయిన తరవాత గురు గోబింద్ సింగ్ 10 వ గురువు గా ఎన్నుకోబడుతారు. గురువు గా మారిన తర్వాత ఖల్సా అనే సముదాయాన్ని సిక్కు మతాన్ని స్థాపించటానికి ఏర్పాటు చేస్తారు. 

ఔరంగజేబ్ రాజు యొక్క సామ్రాజ్యం తో పలు యుద్దాలు చేసిన తర్వాత ఆనందపూర్ లో జరిగిన రెండవసారి జరిగిన యుద్ధం లో గురువు గారి ఇద్దరు కుమారులు చంపబడుతారు. 

ఔరంగజేబ్ యొక్క ఒక గవర్నర్ ద్వారా పంపబడిన ఇద్దరు వ్యక్తులు గురువు గారి పై దాడి చేసి చంపేస్తారు.     

బాల్యం : 

గురు గోబింద్ సింగ్ 22 డిసెంబర్, 1666 సంవత్సరంలో బీహార్ లోని పట్నా నగరంలో జన్మించారు. వీరి తండ్రి గురు తేహ్ బహదూర్ మరియు తల్లి పేరు మాత గుజ్రి. గురు తేహ్ బహదూర్ గారు సిక్కు మతం యొక్క 9 వ గురువు. గురు గోబింద్ సింగ్ గారు పుట్టిన స్థలాన్ని తఖ్త్ శ్రీ పట్నా హరిమండర్ సాహెబ్ అని పిలుస్తారు, ఇక్కడ వీరి జీవితం యొక్క మొదటి 4 సంవత్సరాలు గడుపుతారు. పుట్టినప్పుడు వీరి పేరు గోబింద్ రాయి,1699 తర్వాత గురు గోబింద్ సింగ్ గా మారారు.  

గురు తేహ్ బహదూర్:

1670 వ సంవత్సరంలో ఈ కుటుంబం పంజాబ్ కి వెళుతుంది. 1672 వ సంవత్సరంలో హిమాలయాలకు దగ్గరలో నివసించేవారు. 1675 వ సంవత్సరంలో తండ్రి గురు తేగ్ బహదూర్ వద్దకి కాశ్మీర్ పండితులు వచ్చి మొఘల్ గవర్నర్ అయిన ఇఫ్తికార్ ఖాన్ యొక్క అరాచకాల నుంచి కాపాడమని కోరుతారు. ఇఫ్తికార్ ఖాన్ మొఘల్ రాజు అయిన ఔరంగజేబ్ సామ్రాజ్యంలో గవర్నర్ గా పనిచేసేవాడు.    

తేగ్ బహదూర్ ఔరంగజేబు ను కలిసి శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని అనుకుంటారు కానీ కొంతమంది అనుచరులు అక్కడికి వెళ్ళటం ప్రాణానికే ప్రమాదం అని తెలిపారు. వీరి కుమారుడు అయిన గురు గోబింద్ సింగ్ అక్కడికి వెళ్లటంలో ప్రాణాలకి ముప్పు ఉందంటే మీ బదులు నేను అక్కడికి వెళుతానని కోరతారు.    

తేగ్ బహదూర్ ఔరంగజేబ్ తో కలిసి మాట్లాడానికి వెళతారు. ఇస్లాం మరియు సిక్కుల మధ్య ఉన్నగొడవల కారణంగా మరియు ఇస్లాం మతం ను స్వీకరించక పోవటం వల్ల  ఔరంగజేబ్ ఆదేశాల మేరకు ఢిల్లీ లో  11 నవంబర్ 1675 బహిరంగంగా తలను నరికేస్తారు.   

చనిపోయే ముందు తేగ్ బహదూర్ గారు తన కుమారుడికి ఒక ఉత్తరం రాస్తారు. తండ్రి ఇచ్చిన బలిదానం తరవాత కుమారుడు గురు గోబింద్ సింగ్ 29 మార్చి 1676 లో వైసాఖి రోజున 10 వ సిక్కు గురువు గా ఎంచుకో బడతారు.      

గురువుగా మారిన తరవాత కూడా చదవటం, రాయటం నేర్చుకున్నారు. చదువు తో పాటు మార్షల్ ఆర్ట్, ధనుర్విద్య మరియు గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు.  

ఖల్సా : 

గురు గోబింద్ సింగ్ సిక్కు మతం పై జరగబోయే దాడులను ముందే గ్రహించి సిక్కులను కాపాడటానికి ఒక గ్రూపు ఉండాలని చెప్పారు. ఫలితంగా ఖల్సా అనే గ్రూపు ను స్థాపించారు, వీరు గురు గోబింద్ సింగ్ మరణం తరవాత సిక్కు సముదాయాన్ని కాపాడటమే వీరి యొక్క లక్ష్యం.     

1699 వ సంవత్సరంలో వైసాకి రోజున గురువు గారు ఆనందపూర్ లోని సిక్కులందరిని సమావేశానికి పిలిచారు. సిక్కుల ఆచారం ప్రకారం అక్కడ జమ అయిన జన సందోహం నుంచి ఒకరిని స్వచ్చందంగా రావాలని కోరుతారు. ముందుకు వచ్చిన ఒక వ్యక్తిని గురువు గారు లోపలి తీసుకువెళతారు. తిరిగి ఒంటరిగా రక్తం తో ఉన్న కత్తి తో బయటికి వస్తారు. రెండవ సారి కూడా అలాగే స్వచ్చందంగా ఎవరైనా రావాలని అంటారు. ఇలా 5 సార్లు ఐదుగురిని తీసుకువెళ్లి మళ్ళీ తిరిగి బయటికి తీసుకువస్తారు.      

ఈ ఐదు మందిని గురువు గారు పంజ్ ప్యారే అని పేరు పెట్టారు, ఈ ఐదు మంది సిక్కు సంప్రదాయంలో మొట్ట మొదటి ఖల్సా సమూహం గా పేర్కొన్నారు. 

గురు గోబింద్ సింగ్ గారు ఖల్సా యొక్క మొదటి సమూహాన్ని ఏర్పాటు చేసిన తరవాత నీరు మరియు చక్కర యొక్క మిశ్రమాన్ని ఒక గిన్నె లో కలుపుతారు,ఈ మిశ్రమాన్ని అమృతం అని పిలిచారు. 

ఖల్సా లో ఉన్న సిక్కులకు సింగ్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ 5 మంది సిక్కులకు గురువు గారు బాప్టిజం ఇవ్వటం జరుగుతుంది. ఈ 5  మంది కలిసి గురువు గారికి బాప్టిజం ఇస్తారు, ఇలా ఖల్సా యొక్క 6 వ సభ్యుడిగా గురువు అవుతారు.   

ఖల్సా లో ఉన్న సభ్యులకు కొన్ని నియమాలను కూడా పెట్టడం జరిగింది. ఖల్సా లో ఉన్న సభ్యులకు 5 K లు తప్పనిసరి, 

కేష్ (వెంట్రుకలను కత్తిరించక పోవటం )

కంగా (చెక్క దువ్వెన)

కార (ఐరన్ లేదా స్టీల్ బ్రేస్ లేట్) 

కేర్పాన్  (ఒక చిన్న కత్తి)

కచ్చెరా (ఒక చిన్న ప్యాంటు)

ఇవే కాకుండా తోబాకో, హలాల్ మాంసం, పెళ్లి కాకుండా ఆడా, మగ సంబంధాలను మరియు వ్యభిచారాన్నినిషేధించబడింది. ఆ సమయంలో మొఘల్ సామ్రాజ్యం ద్వారా పెట్టబడిన జిజ్య టాక్స్ విధానానికి వ్యతిరేకంగా పోరాడారు.  

యుద్ధాలు :

గురు గోబింద్ సింగ్  మొఘల్ సామ్రాజ్యం తో దాదాపు 13 యుద్దాలు చేసారు. దాదాపు అన్ని యుద్ధాలలో గురు గోబింద్ సింగ్ గెలిచారు,కొన్నియుద్ధాలలో ఇరు వైపుల వారు సంధి చేసుకున్నారు.  

ఆనంద్ పూర్ లో జరిగిన రెండవ యుద్ధం లో ఔరంగజేబ్ పంపిన ఆర్మీ ఆనంద్ పూర్ ను ముట్టడి చేస్తారు. అక్కడి నుంచి ఆహార మరియు ఇతర సామాగ్రి బయటికి లోపలికి వెళ్లకుండా ఆపటం జరుగుతుంది.

ఔరంగజేబ్ యొక్క ఆర్మీ ఆనందపూర్ నుంచి సిక్కులందరిని సురక్షితంగా పంపిస్తామని చెప్పగా చివరికి ఆనంద్ పూర్ నుంచి రెండు గ్రూపులుగా విడిపోయి గురు గోబింద్ సింగ్ మరియు వీరి అనుచరులు బయలుదేరుతారు.  ఒక గ్రూపు లో ఉన్న గురువు గారి యొక్క ఇద్దరు కుమారులైన జొరావర్ సింగ్ (8), ఫతేహ్ సింగ్ (5) లను బందీలుగా చేసుకొని ఒక గోడ లో బతికి ఉన్నప్పుడే సమాధి చేస్తారు. 

మరణం :    

ఔరంగజేబ్ 1707 వ సంవత్సరంలో చనిపోయాక కొడుకు బహదూర్ షా రాజు గా ఎన్నుకోబడతాడు. ఒక కథనం ప్రకరాం మొఘల్ సామ్రాజ్యం యొక్క  గవర్నర్ అయిన వజీర్ ఖాన్ గురు గోబింద్ సింగ్ గారిని చంపటానికి ఇద్దరు ఆఫ్ఘన్ కు చెందిన మనుషులను పంపుతాడు.

 గోదావరి వద్ద బస చేస్తున్న గురువు గారి టెంట్ లోకి ప్రవేశించి కత్తి తో పొడుస్తారు. కత్తి తో పొడిచిన వ్యక్తిని గురువు గారు చంపేస్తారు, రెండవ వ్యక్తిని అక్కడ ఉన్న సైనికులు చంపేస్తారు. గురువు గారికి తీవ్ర గాయం కావటం తో  7 అక్టోబర్ 1708 సంవత్సరంలో చనిపోతారు (1).   

Leave a Comment