ది ప్రొఫెసీస్ అనే పుస్తకాన్ని రాసిన జ్యోతిష్యుడు,వైద్యుడు మరియు భవిష్యం చెప్పే గొప్ప వ్యక్తి నోస్ట్రడామస్. భవిష్యత్తులో జరిగే విపత్తులు, మరణాలు, యుద్దాలు, అంటూ రోగాలు లాంటి పలు ముఖ్యమైన ఘటనలను తన పుస్తకంలో రాసి భద్ర పరిచిన వ్యక్తి నోస్ట్రడామస్.
Table of Contents
బాల్యం :
నోస్ట్రడామస్ 14 డిసెంబర్ 1503 వ సంవత్సరంలో ఫ్రాన్స్ లో జన్మించారు. వీరి కుటుంబం యూదుల మతానికి చెందినవారు కానీ 1459 లో క్రైస్తవులుగా మారారు.
నోస్ట్రడామస్ 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు యూనివర్సిటీ అఫ్ అవిగ్నోన్ లో చేరారు కానీ ప్లేగ్ అకస్మాత్తుగా వ్యాపించడటం వల్ల యూనివర్సిటీ ను మూసివేసారు.
యూనివర్సిటీ నుంచి చదువు మానివేసిన తరవాత 1521 నుంచి 1529 వరకు గ్రామీణ ప్రాంతాలలో ప్రయాణం చేస్తూ మూలికల పై పరిశోధనలు చేసేవారు. ఇలా పరిశోధనల ద్వారా తెలుసున్న మందులను తయారు చేసి అమ్మేవారు. కొన్ని సంవత్సరాల తరవాత మోంట్పెల్లియర్ విశ్వవిద్యాలయం (University of Montpellier) లో మెడిసిన్ లో డాక్టరేట్ చేయడానికి చేరారు.
కాలేజీ లో చేరక ముందు మందులను తయారు చేసి అమ్మేవారు అని తెలుసుకున్నాక యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. కాలేజీ నుంచి బయటికి వచ్చిన తరవాత కూడా మందులను తయారు చేసి అమ్మేవారు. ఆ సమయంలో ఉన్నప్లేగ్ వ్యాధి బారి నుంచి కాపాడుకోవడానికి రోజ్ పిల్ (Rose pill) అనే మందును కూడా తయారుచేసారు.
Occultism (క్షుద్రవాదం) :
1534 వ సంవత్సరంలో నోస్ట్రడామస్ పెళ్లి చేసుకున్నారు , వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొద్దీ రోజులకే భార్య పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు. వీరు చనిపోయిన తరవాత ఫ్రాన్స్ నుంచి ఇటలీ కి ప్రయాణం చేసేవారు.
1547 వ సంవత్సరంలో డబ్బు బాగా ఉన్న ఒక వితంతువును పెళ్లి చేసుకున్నారు, వీరిద్దరికి ఆరుగురు సంతానం.
రెండవ సారి ఇటలీ వెళ్లి వచ్చిన తరవాత వైద్య సేవలను వదిలేసి క్షుధ్రవాదం వైపు తన దృష్టిని మళ్లించారు. భవిష్యత్తులో ఉండబోయే వాతావరణం, వానల గురించి మరియు అంతరిక్షంలో ఉండే గ్రహాల గురించి రాయటం మొదలు పెట్టారు. మొదట రాసిన భవిష్య వాని చాలా మందికి నచ్చటం తో ప్రతి ఏటా భవిష్యత్తు లో జరిగే సంఘటనల గురించి రాయటం మొదలుపెట్టాడు.
నోస్ట్రడామస్ చేస్తున్న పనిని చూసి చాలా మంది తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అడిగేవారు. నోస్ట్రడామస్ తన వద్దకి వచ్చిన వారందరిని పుట్టిన తేదీ మరియు సంవత్సరం ఆధారంగా వారి యొక్క భవిష్యత్తు ను తెలిపేవారు.
నోస్ట్రడామస్ భవిష్యత్తు కాలంలో జరిగే సంఘటనల గురించి కూడా ఒక పుస్తకం రాయాలని అనుకున్నారు. కొందరు మతపెద్దల నుంచి వ్యతిరేకత రావటం గమనించి తాను రాయాలన్న పుస్తకాన్ని కవితల రూపంలో 4 భాషల సమ్మేళనం గా రాయాలని అనుకున్నారు.
ప్రస్తుతం ఈ పుస్తకమే అందరి నోటా చర్చలో ఉంటుంది. ఈ పుస్తకం యొక్క పేరు Les Prophéties (The Prophecies) అని పేరు పెట్టారు. కొంత మంది నోస్ట్రడామస్ రాసిన పుస్తకాన్ని వ్యతిరేకించిన మరికొంత మంది మాత్రం పొగిడారు.
అప్పట్లో రాజుగా ఉన్న రెండవ హెన్రీ యొక్క భార్య కాథరిన్ నోస్ట్రడామస్ యొక్క అభిమాని. నోస్ట్రడామస్ ఒకసారి చెప్పిన జ్యోతిష్యం లో రాజు గారికి కుటుంబానికి ఎదో కీడు జరగనుంది అని చెప్పగా మహారాణి కాథరిన్ ఆ కీడు ఎదో చెప్పామన్నారు మరియు తన కుమారుడు అయిన చార్ల్స్ కోసం కౌన్సిలర్ గా నియమించారు.
నోస్ట్రడామస్ అంచనా వేసిన సంఘటనలు :
నోస్ట్రడామస్ ముఖ్యంగా భవిష్యతువులో వచ్చే భూకంపాలు, యుద్దాలు, వరదలు, హత్యలు, కరువులు, అంటురోగాలు ఇలా చాలా వాటిని కవితల రూపంలో తన పుస్తకంలో రాసారు.
నోస్ట్రడామస్ అంచనా వేసిన కొన్ని చారిత్మాతక ఘటనలు :
- గ్రేట్ ఫైర్ అఫ్ లండన్
- ఫ్రెంచ్ రెవల్యూషన్
- హిట్లర్ మరియు నెపోలియన్ యొక్క సామ్రాజ్యం
- మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధం
- హిరోషిమా మరియు నాగసాకి పై జరిగిన అణు విధ్వంసం
- అపోలో మూన్ ల్యాండింగ్
- ప్రిన్సెస్ డయానా మరణం
- వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన సెప్టెంబర్ 11 దాడులు
ఇలా ఒకటి అని కాకుండా చాలా ముఖ్యమైన ఘటనల గురించి అవి జరగక ముందే ఉహించాడు లేదా అంచనా వేసాడు అని చెప్పవచ్చు.
మరణం :
1566 వ సంవత్సరంలో నోస్ట్రడామస్ ఆరోగ్యం బాగా క్షిణించుకుపోవటం వల్ల తన ఆస్తి సంపదలను భార్య, పిల్లలకు రాసిచ్చారు.
జులై 1 వ తారీకు సాయంత్రం తన సెక్రటరీ ను పిలిచి నేను రేపు సూర్యోదయం చూడలేను అని చెప్పారు. ఆ రాత్రే నోస్ట్రడామస్ చనిపోయారు.
ప్రపంచంలో జరిగే ఘటనలే కాకుండా తన మృత్యువు ఎప్పుడు వస్తుంది అని కూడా తెలిసిన గొప్ప వ్యక్తి నోస్ట్రడామస్ అని చాల మంది పొగుడుతారు.