మిథాలీ రాజ్ జీవిత చరిత్ర – Mithali raj Biography in Telugu

మహిళా క్రికెట్ టీం యొక్క సచిన్ టెండూల్కర్ అని బిరుదును పొందిన క్రీడా కారిణి మిథాలి రాజ్. చిన్న వయసు నుంచే క్రికెట్ పై ప్రేమ తో కోచింగ్ తీసుకోని భారతీయ క్రికెట్ జట్టులో తన స్థానాన్ని సంపాదించుకున్నారు. 

తన నేతృత్వంలో పలు సార్లు భారతీయ మహిళా క్రికెట్ జట్టును గెలిపించిన క్రెడిట్ కూడా ఉంది.    

బాల్యం : 

మిథాలి రాజ్ 3 డిసెంబర్, 1982 వ సంవత్సరంలో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని ఒక తమిళ కుటుంబంలో లీల రాజ్ మరియు దొరై రాజ్ అనే దంపతులకు జన్మించారు.  వీరి తండ్రి దొరై రాజ్,ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ మ్యాన్ గా ఉన్నారు. 

మిథాలి కేవలం 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు. కీస్ గర్ల్స్ స్కూల్ లో తన చదువును పూర్తి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ ను సికింద్రాబాద్ లో ని కస్తూర్బా కాలేజీ నుంచి పూర్తి చేసారు. స్కూల్ లో ఉన్నప్పటి నుంచే తన అన్నయ్య తో పాటు క్రికెట్ కోచింగ్ కి వెళ్లేవారు.       

కెరీర్ : 

మిథాలి రాజ్ టెస్ట్, వన్ డే, టీ 20 ఇలా మూడు ఫార్మాట్ లలో క్రికెట్ ను ఆడారు. 

మిథాలి కి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు 1999 సంవత్సరంలో మొదటి వన్ డే క్రికెట్ మ్యాచ్ ఐర్లాండ్ టీం తో ఆడారు, ఈ మ్యాచ్ లో 114 రన్నులు చేసి సెంచరీ ని తన ఖాతాలో వేసుకున్నారు.    

2001- 2002 సీజన్ లో మొదటి టెస్ట్ మ్యాచ్  సౌత్ ఆఫ్రికా టీం తో ఆడి అరంగేట్రం చేసారు. తన 3 వ టెస్ట్  మ్యాచ్ లో  214 పరుగులు చేసి ఆస్ట్రియా క్రికెటర్ కరెన్ లూయిస్ రోల్టన్ యొక్క 209 పరుగుల రికార్డును బద్దలు చేసారు.   

మిథాలి రాజ్ యొక్క రికార్డు ను 2004 లో  పాకిస్తాన్ కు చెందిన కిరణ్ బలూచ్ 242 పరుగులతో అధిగమించారు.  

  • 2006 సంవత్సరంలో మిథాలి రాజ్ నేతృత్వంలో మహిళా క్రికెట్ టీం ఆసియ కప్ ను గెలిచారు.
  • జులై, 2017 వ సంవత్సరంలో 6,000 పరుగులు చేసిన మొట్ట మొదటి మహిళా క్రీడాకారిణి గా నిలిచారు.
  • మిథాలి రాజ్ యొక్క నేతృత్వం లో 2005, 2017 లో జరిగిన మహిళా వర్డ్ కప్ లో ఫైనల్స్ కి వెళ్లారు.      

మిథాలి రాజ్ భారత మహిళా క్రికెట్ టీం కు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా మరియు ప్లేయర్ కోచ్ గా కూడా ఉన్నారు. మిథాలి రాజ్ ను మహిళా క్రికెట్ జట్టు యొక్క సచిన్ టెండూల్కర్ అని కూడా అంటారు. 

వ్యక్తిగత జీవితం :  

మిథాలి రాజ్ ఇంతవరకు ఎవ్వరిని పెళ్లి చేసుకోలేదు, ఒక ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి అడగగా అలాంటి ఉద్దేశం ఏమి లేదు అని చెప్పారు.   

మిథాలి రాజ్ జీవితం పై ఒక బయో పిక్ కూడా వచ్చే అవకాశం ఉంది. మిథాలి రాజ్ గా నటించటానికి తాప్సి పన్ను ను ఎంచుకున్నారు అని సమాచారం. 

దేశమంతటా లాక్ డౌన్ కారణంగా సినిమా ఆలస్యమయింది.   

కాంట్రవర్సీ :

మిథాలి రాజ్ కు మరియు క్రికెట్ టీమ్ కోచ్ అయిన రమేష్ పొవార్ కు మధ్య విభేదాలు వచ్చాయి. రాహుల్ పొవార్ తనవైపు పక్షపాతం చూపిస్తున్నారని మిథాలి ఆరోపించారు. మిథాలి రాజ్ తనను బ్లాక్ మెయిల్ చేసేదని, తన సొంత రికార్డు ల కోసం క్రికెట్ ఆడేవారు అని రాహుల్ పొవార్ ఆరోపణలు చేసారు.

2021 లో వీరి మధ్య ఉన్న విబేధాలు తొలిగి పోయినట్లు తెలిసింది.       

Leave a Comment