గుర్రం జాషువా జీవిత చరిత్ర – Gurram Jashuva Biography in Telugu

గుర్రం జాషువా ఒక తెలుగు భాషా రచయిత. తాను ఎదుర్కొన్న కుల వివక్షత పై అందరికి అర్థమయ్యేలా కవిత్వాలు రాసారు. 

బాల్యం :

గుర్రం జాషువా 1895 వ సంవత్సరం సెప్టెంబర్ 28 వ రోజు గుంటూరు లోని చాట్రగడ్డపాడు గ్రామం, గుర్రం వీరయ్య మరియు లింగమ్మ దంపతులకు జన్మించారు.

గుర్రం జాషువా తల్లి తండ్రులు వేరు వేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ కులానికి చెందిన వారు మరియు తల్లి మాదిగ కులానికి చెందిన వారు.

జాషువా తండ్రి చర్చి లో పాస్టర్ గా పనిచేసేవారు. తక్కువ కులానికి చెందిన వారు అవ్వటం వల్ల చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చేది.

స్కూల్ లో చేరిన తరవాత కుల వివక్షత కారణంగా ఉపాధ్యాయుల నుంచి మరియు తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదురయ్యాయి. జాషువా మాత్రం ఎదురు తిరిగి కుల వివక్షత చేసే తోటి విద్యార్థులను కొట్టేవారు.

కెరీర్ :

చదువు పూర్తి చేసుకున్న తరవాత మిషనరీ స్కూల్ లో ఉద్యోగం చేసారు. 1915 నుంచి 1916 వ సంవత్సరం వరకు సినిమా వాచకుడిగా పనిచేసారు.

తరవాత 10 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసారు. 1928 నుంచి 1942 వరకు గుంటూరు లో ఉండే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా కూడా పనిచేసారు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసారు. 1957 నుంచి 1959 వరకు రేడియో కేంద్రం లో ప్రొడ్యూసర్ గా పనిచేసారు.

ఒకసారి అవధాన సభలో పద్యాలు చదువుతుంటే, తక్కువ కులం వాడితో పద్యాలూ ఎందుకు చదివిస్తున్నారని కొంత మంది అవమానించారు. హిందూ మతం వారు కుల వివక్షత చేస్తే, క్రైస్తవ మతం వారు మాత్రం క్రైస్తవుడయ్యి హిందూ మతానికి చెందిన రచనలు ఎందుకు చేస్తున్నావని చెప్పి జాషువాను మరియు జాషువా కుటుంబాన్ని బహిష్కరించారు.

మతపరంగా అవమానాలు ఎదుర్కొన్న తరవాత జాషువా నాస్తికత్వం వైపు వెళ్లారు. 1964 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది.

సాహిత్యం :

చిన్న తనం నుంచి జాషువా లో బొమ్మలు గీయటం మరియు పాటలు పడటం పై ఆసక్తి ఉండేది. జాషువా 36 గ్రంధాలు మరియు ఎన్నో కవితా ఖండికలను రాసారు.

జాషువా రాసిన రచనల జాబిత :

1919రుక్మిణీ కళ్యాణం
1922చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం
1924కోకిల
1925ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం
1926శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత
1927భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు
1928రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెళ్ళికొడుకు
1929సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం
1930దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ
1931భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోల
1932స్వప్న కథ, అనాథ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.
1933అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, శ్మశానవాటిక
1934ఆంధ్ర భోజుడు
1941గబ్బిలము
1945కాందిశీకుడు
1946తెరచాటు
1948చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ
1950స్వయంవరం
1957కొత్తలోకం
1958క్రీస్తు చరిత్ర
1963రాష్ట్ర పూజ, ముసాఫిరులు
1966నాగార్జునసాగరం, నా కథ

పురస్కరాలు :

1964లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.

1970లో కళాప్రపూర్ణ బిరుదు లభించింది.

1970లో పద్మభూషణ పురస్కారం లభించింది.

మరణం :

గుర్రం జాషువా జులై 24, 1971 సంవత్సరంలో గుర్రం జాషువా మరణించారు.

Source: Gurram Jashuva – Wikipedia

Leave a Comment