దుర్గాబాయి దేశ్‌ముఖ్ జీవిత చరిత్ర – Durgabai Deshmukh Biography in Telugu

దుర్గాబాయి దేశ్‌ముఖ్ భారత దేశానికి చెందిన స్వాతంత్ర సమర  యోధురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు మరియు సామాజిక కార్యకర్త. 

బాల్యం :

దుర్గాబాయి దేశ్‌ముఖ్ 1909 జూలై 15 న, మద్రాసు ప్రెసిడెన్సీ (ఇప్పటి ఆంధ్రపరదేశ్) లోని రాజమండ్రి లో రామారావు, కృష్ణవేణమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. 

కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే హిందీ భాషలో పాండిత్యాన్ని సంపాదించారు. చిన్న తనం నుంచే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. 

12 సంవత్సరాల వయస్సులో ఇంగ్లీష్ మీడియం లో చదువు నేర్చుకోవాలని అని నియమం తెచ్చినప్పుడు స్కూలు ను వదిలేసారు. 

తరవాత తన జీవిత కాలంలో బాలికలకు హిందీ లో చదువును నేర్పించడానికి బాలిక హిందీ పాఠశాల ను ప్రారంభించారు.   

 బెనారస్‌ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యూలేషన్ ను పూర్తి చేసారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో M.A చేసారు. 

1942 వ సంవత్సరంలో L.L.B ను పూర్తిచేసారు. చదువును పూర్తి చేసుకున్న తరవాత మద్రాసు హై కోర్ట్ లోనే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 

కెరీర్ : 

1923 వ సంవత్సరంలో స్వస్థలం కాకినాడలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించింది. అదే సమయంలో పక్కనే జరుగుతున్న ఖాదీ ప్రదర్శన కి  దుర్గాబాయి దేశ్‌ముఖ్ వాలంటీర్ గా ఉన్నారు. 

వాలంటీర్ గా ఇచ్చిన బాధ్యతను నిజాయితీగా చేపట్టారు. టికెట్ లేకుండా ఎవ్వరికి అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో వచ్చిన నెహ్రూను కూడా టికెట్ తీసుకోని లోపలి వెళ్లాలని ఆపారు. 

ఖాదీ ప్రదర్శన నిర్వాహుకులు ఇది చూసి దుర్గాబాయి కు కోపంతో చివాట్లు పెట్టారు, నేను కేవలం నాకు ఇచ్చిన సూచనలను పాటించానని చెప్పారు . నిర్వాహకులు  నెహ్రు కోసం టికెట్ కొన్న తరవాతనే దుర్గాబాయి లోపలికి  అనుమతించింది.       

ఇదంతా చూస్తున్న నెహ్రు తన ధైర్యాన్ని మరియు తన విధి పట్ల ఉన్న శ్రద్ధను మెచ్చుకున్నారు. 

దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్వాతంత్ర  పోరాటంలో గాంధీజీ అనుచరురాలు. గాంధీజీ నేతృత్వంలో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. 

ఇతర మహిళలను సత్యాగ్రహ ఉద్యమంలో చేర్చటంలో కీలక పాత్ర వహించారు.  ఇది చూసిన బ్రిటిష్ అధికారులు 1930 నుంచి 1933 వరకు మూడు సార్లు అరెస్ట్ చేసారు. 

భారత రాజ్యాంగ సభ లో దుర్గాబాయి సభ్యురాలు గా ఉన్నారు. అందులో ఉన్న సభ్యులలో దుర్గాబాయి మాత్రమే మహిళా సభ్యురాలు, సభ్యురాలిగా సామాజిక సంక్షేమ చట్టాలను రోపొందించటంలో కీలక పాత్ర వహించారు. 

ప్రణాళికా సంఘం యొక్క సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇక్కడ  పనిచేస్తున్న సమయంలో 1953వ సంవత్సరంలో కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు ను స్థాపించారు. 

దుర్గాబాయి ఈ బోర్డు యొక్క  చైర్ పర్సన్ గా నియమించబడ్డారు. చైర్ పర్సన్ గా ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో స్వచ్చంద సంస్థలను ప్రారంభించారు. 

విద్య, శిక్షణ, నిరుపేద మహిళల కోసం, పిల్లల కోసం, వికలాంగుల కోసం పునరావాసం ఏర్పాటు చేయటం. 

1958 వ సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం ద్వారా మహిళల చదువు కోసం నేషనల్ కౌన్సిల్ ను స్థాపించారు. ఈ నేషనల్ కౌన్సిల్  కి కూడా  దుర్గాబాయి చైర్ పర్సన్ గా ఉన్నారు. 

దుర్గాబాయి కి గుర్తింపుగా విశాఖపట్నం లోని ఆంధ్ర యూనివర్సిటీ కి చెందిన మహిళా విభాగానికి  Dr. Durgabai Deshmukh Centre for Women’s Studies అని పేరు పెట్టారు. 

అవార్డులు : 

పాల్ జి హాఫ్‌మన్ అవార్డు

నెహ్రూ లిటరసీ అవార్డు

పద్మవిభూషణ్ అవార్డు 

వ్యక్తిగత జీవితం : 

8 సంవత్సరాల వయస్సులో  దుర్గాబాయి వివాహం బంధువుల కొడుకు అయిన సుబ్బా రావు తో జరుగుతుంది. 

దుర్గాబాయి యుక్తవయస్సుకు వచ్చిన తరవాత సుబ్బారావు తో ఉండటానికి నిరాకరించింది. తన నిర్ణయాన్ని తండ్రి మరియు తమ్ముడు కూడా మద్దతు ఇచ్చారు. తరవాత దుర్గాబాయిచదువుకోవటం మొదలుపెట్టారు. 

1953 వ సంవత్సరంలో ఆర్థిక మంత్రి  చింతామన్ దేశ్ ముఖ్ ను పెళ్లిచేసుకున్నారు. 

మరణం :

మే 7, 1981 వ సంవత్సరంలో  ఆంధ్రప్రదేశ్ లోని నర్సన్నపేట లో మరణించారు.  

Source: Durgabai Deshmukh – Wikipedia

Leave a Comment