మల్లికార్జున్ ఖర్గే భారతదేశానికి చెందిన రాజకీయవేత్త మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు. 16 ఫిబ్రవరి 2021 వ సంవత్సరం నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గే వయసు 80 సంవత్సరాలు మరియు ఆయన బౌద్ధ మతానికి చెందిన వారు.
బాల్యం :
మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా లోని వరవట్టి గ్రామంలో మాపన్న ఖర్గే మరియు సబవ్వ అనే దంపతులకు జన్మించారు.
తన స్కూల్ చదువును గుల్బర్గా లోని నూతన్ విద్యాలయ స్కూల్ నుంచి పూర్తి చేసారు. గుల్బర్గా లోని గవర్నమెంట్ కాలేజీ నుంచి బాచిలర్ అఫ్ ఆర్ట్స్ నుంచి డిగ్రీ ను సంపాదించారు.
గుల్బర్గా లోని సేథ్ శంకర్‌లాల్ లాహోటి లా కాలేజ్ నుంచి తన లా చదువును పూర్తి చేసి డిగ్రీ సంపాదించారు. ప్రాక్టీస్ మొదలుపెట్టిన తరవాత కార్మిక సంఘం యొక్క కేసులను పోరాడారు.
రాజకీయ జీవితం :
గుల్బర్గా లోని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న సమయంలో ఖర్గే తన రాజకీయ జీవితాన్ని స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ప్రారంభించారు. ఈ యూనియన్ లో జనరల్ సెక్రటరీ గా ఎన్నుకోబడ్డారు.
సంయుక్త మజ్దూర్ సంఘం లో ప్రభావవంతమైన లీడర్ గా ఉంటూ చాలా ఆందోళనలను చేపట్టారు.
1969వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన తరవాత గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ యొక్క అధ్యక్షుడి గా ఎన్నుకోబడ్డారు.
1972 వ సంవత్సరంలో కర్ణాటక లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గుర్మిట్‌కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.
1973 వ సంవత్సరంలో ఆక్ట్రాయ్ నిర్మూలన కమిటీ (Octroi Abolition Committee) యొక్క చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. చైర్మన్ గా ఉంటూ కర్ణాటక రాష్ట్రం యొక్క పురపాలక మరియు పౌర సంస్థల ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించారు.
1974 వ సంవత్సరంలో రాష్ట్రానికి చేదనిన డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. చైర్మన్ గా ఉంటూ వేలాది మంది చెప్పులు కుట్టే కార్మికుల జీవన పరిస్థితులను మెరుగుపరిచారు. కార్మికుల కోసం షెడ్లు మరియు నివాసాలను ఏర్పాటు చేసారు.
1976వ సంవత్సరంలో రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా ఎన్నుకోబడ్డారు. మంత్రిగా ఎన్నుకోబడ్డ తరవాత SC మరియు ST లకు చెందిన 16000 టీచర్ ఉద్యోగాల భర్తి ను పూర్తి చేసారు.
1978 సంవత్సరంలో గుర్మిత్కల్ నియిజక వర్గం నుంచి MLA గా పోటీ చేసి గెలిచారు. ఎన్నికలలో గెలిచిన తరవాత రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గా ఎన్నుకోబడ్డారు.
1980వ సంవత్సరంలో గుండు రావు కాబినెట్ లో రెవిన్యూ మంత్రి గా ఎన్నుకోబడ్డారు. మంత్రిగా భూ సంస్కరణలపై ద్రుష్టి పెట్టారు. భూములు లేని లక్షలాది మంది రైతులకు ఆక్యుపెన్సీ హక్కులు లభించాయి.
1983 వ సంవత్సరంలో గుర్మిత్కల్ నియోజక వర్గం నుంచి మూడవ సారి ఎన్నికలను గెలిచారు. 1985వ సంవత్సరంలో నాల్గవ సారి గుర్మిత్కల్ నుంచి గెలిచి కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడు గా ఎన్నుకోబడ్డారు.
1989 వ సంవ్సతరంలో ఐదవ సారి గుర్మిత్కల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.
1990 సంవత్సరంలో బంగారప్ప కాబినెట్ లో రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయత్ రాజ్ మంత్రిగా ఎన్నుకోబడ్డారు.
మంత్రిగా ఎన్నుకోబడ్డ తరవాత ఆగిపోయిన భూ సంస్కరణలను మళ్ళీ మొదలుపెట్టారు. లక్షలాది ఎకరాలను భూములు లేని వారికి ఇవ్వటం జరిగింది.
1992 నుంచి 1994వ సంవత్సరం వరకు వీరప్ప మొయిలీ కాబినెట్ లో సహకార, మధ్యతరహా మరియు పెద్ద పరిశ్రమల శాఖ మంత్రి గా ఎన్నుకోబడ్డారు.
1994వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆరవసారి గుర్మిత్కల్ నియోజక వర్గం నుంచి పోటి చేసి గెలిచారు. ఎన్నికలలో గెలిచిన తరవాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డారు.
1999వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏడవ సారి గెలిచారు. ఎన్నికలలో గెలిచిన తరవాత ముఖ్యమంత్రి పదవి బరిలో ముందున్నారు. కానీ S. M. కృష్ణ కాబినెట్ లో హోమ్ మినిస్టర్ గా ఎన్నుకోబడ్డారు.
2004 వ సంవత్సరంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటి చేసి గెలిచారు. ఈ సారి కూడా ఎన్నికలలో గెలిచిన తరవాత ముఖ్యమంత్రి పదవి బరిలో మల్లికార్జున్ ముందున్నారు.కానీ ధరమ్ సింగ్ కాబినెట్ లో రవాణా మరియు జలవనరుల మంత్రిగా (Transport and Water Resources) ఎన్నుకోబడ్డారు.
2008వ సంవత్సరంలోజరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చిత్తాపూర్ నుంచి పోటీ చేసి తొమ్మిదవ సారి గెలిచారు. కాంగ్రెస్ యొక్క సీనియర్ నాయకులు ఓడిపోయిన తరవాత మల్లికార్జున్ ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గుల్బర్గా నుంచి పోటీ చేసి పదవ సారి గెలిచారు.
2014వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో గుల్బర్గా నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో BJP కాండిడేట్ ఉమేష్ జాదవ్ కి వ్యతిరేకంగా పోరాడి ఓడి పోయారు.
2020వ సంవత్సరంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021వ సంవత్సరంలో రాజ్య సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డారు.
అక్టోబర్ 1, 2022 వ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడి పదవిని రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ చేసారు.
19 అక్టోబర్ 2022 వ సంవత్సరంలో 9,385 ఓట్లకి 7,897 ఓట్లు పొంది శశి థరూర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు.
24 సంవత్సరాల తరవాత గాంధీయేతరుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు.
వ్యక్తిగత జీవితం :
మల్లికార్జున్ ఖర్గే 13 మే 1968 వ సంవత్సరంలో రాధాబాయిను పెళ్లిచేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు.
2006 వ సంవత్సరంలో ఖర్గే తాను బౌద్ధ మతాన్ని స్వీకరించానని ప్రకటించారు.