భగత్ సింగ్ జీవిత చరిత్ర – Bhagat Singh Biography in Telugu

భగత్ సింగ్ భారతదేశం యొక్క స్వాతంత్ర సమరయోధుడు మరియు విప్లవ కారుడు. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన ప్రముఖ మరియు అత్యంత ప్రభావవంతమైన విప్లవ కారులలో ఒకరు. 

తాను చేసిన పోరాటానికి గాను షహీద్ భగత్ సింగ్ అని కొనియాడుతారు.

బాల్యం :

భగత్ సింగ్ 27 సెప్టెంబర్ 1907 వ సంవత్సరంలో ఇప్పటి పాకిస్తాన్ లో ఉన్న లాయల్ జిల్లా బంగా పట్టణంలోని  ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ , విద్యావతి అనే దంపతులకు జన్మించారు. 

చిన్న తనంలో తన గ్రామనికి దగ్గరలో ఉన్న స్కూల్ లో కొన్ని సంవత్సరాలు చదివారు. తరవాత లాహోర్ లో ఉన్న దయానంద్ ఆంగ్లో-వేద పాఠశాల లో చేరారు.

 1923 వ సంవత్సరంలో లాహోర్ లోని నేషనల్ కాలేజీ (National College) లో చేరారు. ఈ కాలేజీ రెండు సంవత్సరాల ముందు మహాత్మా గాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం (non-cooperation movement) యొక్క లక్ష్యం కారణంగా లాలా లజపతి రాయ్ ద్వారా స్థాపించబడింది.  

ఈ కాలేజీ స్థాపించటం వెనక ఉన్న ముఖ్య కారణం విద్యార్థులను బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా స్థాపించబడ్డ కాలేజీల నుంచి దూరంగా ఉంచటం.

యూత్ పై ఉన్న సింగ్ ప్రభావం ను చూసిన పోలీసు అధికారాలు ఆందోళన చెందారు. 1926 వ సంవ్సతరంలో లాహోర్ లో జరిగిన బాంబు దాడుల వెనక భగత్ సింగ్ ఉన్నాడని అనుమానం తో 1927 వ సంవత్సరంలో అరెస్ట్ చేసారు. 

జైలు నుంచి బయటికి వచ్చిన తరవాత  అమృత్‌సర్ లో ఉన్న ఉర్దూ మరియు పంజాబీ పత్రికలకు ఎడిటర్ గా కూడా పనిచేసారు.   

ఇవే కాకుండా నౌజవాన్ భారత్ సభ (Naujawan Bharat Sabha), కీర్తి కిసాన్ పార్టీ ( Kirti Kisan Party), వీర్ అర్జున్ (Veer Arjun) అనే ప్తరికల కోసం కూడా పనిచేసారు. 

తానూ రాసిన పత్రికలకు కలం పేరుగా బల్వంత్, రంజిత్ మరియు విద్రోహి అనే పేర్లను ఉపయోగించారు.

విప్లవ పోరాటం :

 1928 వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను తెలుసుకోవటానికి సైమన్ కమిషన్ ను ఏర్పాటు చేసారు. 

ఇండియా కు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు సైమన్ కమిషన్ ను బహిష్కరించాయి. ఎందుకంటే ఈ కమిషన్ లో భారతదేశానికి చెందిన వారు లేరు.  

అక్టోబర్ 30 1928 వ సంవత్సరంలో సైమన్ కమిషన్ లాహోర్ కి వెళ్ళినప్పుడు లాల లజపత్ రాయి కమిషన్ కి వ్యతిరేకంగా నిరసనలు చేసారు. 

 పోలీసులు ప్రజల గుంపు ను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. అప్పటి సూపెరిండేంట్ పోలీస్ జేమ్స్ A. స్కాట్ లాఠీ ఛార్జి  ఆదేశాలను ఇచ్చాడు. 

 జేమ్స్ A. స్కాట్, లాల లజపత్ రాయి పై లాఠీ ఛార్జి చేసి తీవ్రంగా గాయపరిచాడు. 

ఒక నెల తర్వాత 17 నవంబర్ 1928 వ సంవత్సరంలో లాల లజపత్ రాయి గుండె పోటు తో మరణించారు. 

రాయి కి వైద్యం చేసిన డాక్టర్లు కూడా నిరసన లో జరిగిన లాఠీ ఛార్జి గాయాలే బహుశా మరణానికి కారకమయ్యాయి  అని తెలిపారు. 

మరోవైపు యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ లో ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు, రాయి యొక్క మృత్యువు లో బ్రిటిష్ ప్రభుత్వం లాంటి పాత్ర లేదని చెప్పారు. 

భగత్ సింగ్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) ను హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA) గా పేరు మార్చటంలో బాధ్యత వహించారు.

లాల లజపతి రాయ్ మృత్యువు తరువాత HSRA సభ్యులు ప్రతీకారం తీసుకోవాలని ప్రతిజ్ఞ చేసారు. 

భగత్ సింగ్ మిగతా విప్లవకారులతో (శివరం రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్, మరియు చంద్రశేఖర్ ఆజాద్) కలిసి పతకం ప్రకారం జేమ్స్ A. స్కాట్ ను చంపాలనుకున్నారు. 

17 డిసెంబర్1928వ సంవత్సరం లో లాహోర్ లో జేమ్స్ A. స్కాట్ ను చంపడానికి ప్రణాళిక చేయటం జరిగింది. స్కాట్ ను గుర్తించడంలో జరిగిన తప్పిదం వల్ల స్కాట్ కి బదులు డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటికి వస్తున్న జాన్ పి. సాండర్స్ అనే అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీసును చంపారు.  

సాండర్స్ ను చంపిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో చానన్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ద్వారా చంపబడ్డాడు. 

అక్కడినుంచి సైకిళ్ల మీద ముందే నిర్ణయించిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. నగరం లోపలి వచ్చే మరియు బయటికి వెళ్లే అన్ని దారులను మూసివేసి  వెతకసాగారు. 

ఈ హత్య తరవాత  రాజకీయ నాయకులు, కార్యకర్తలు మరియు వార్తాపత్రికలు సహాయ నిరాకరణ ఉద్యమం హింసను ప్రోత్సహిస్తుంది అని చెప్పారు. మహాత్మా గాంధీ మరియు నెహ్రు కూడా హింసకు వ్యతిరేకంగా మాట్లాడారు.

సాండర్స్ ను చంపిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో చానన్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ద్వారా చంపబడ్డాడు. 

అక్కడినుంచి సైకిళ్ల మీద ముందే నిర్ణయించిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. నగరం లోపలి వచ్చే మరియు బయటికి వెళ్లే అన్ని దారులను మూసివేసి  వెతకసాగారు. 

19 డిసెంబర్ 1928 వ సంవత్సరంలో HSRA సభ్యురాలు దుర్గావతి దేవి  సహాయంతో ట్రైన్ ద్వారా లాహోర్ నుంచి కలకత్తా కి బయలుదేరారు. కొన్ని రోజుల తరవాత భగత్ సింగ్ తిరిగి లాహోర్ కి చేరారు. 

8 ఏప్రిల్ 1929 వ సంవత్సరంలో భగత్ సింగ్ ఇతర విపలవకారులతో కలిసి ఢిల్లీ అసెంబ్లీ లో బాంబు వేసే ప్లాన్ చేసారు. ఈ బాంబు దాడి ఎవ్వరిని కూడా చంపటానికి వేయలేదు కానీ పలువురు గాయపడ్డారు.         

ప్లాన్ ప్రకారం బాంబు ద్వారా వచ్చే పోగల మధ్యలోనుంచి తప్పించుకోవాలి కానీ అక్కడే ఉండి ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ ప్రచారపత్రాలను విసిరారు. ఫలితంగా భగత్ సింగ్ మరియు తన అనుచరుడు అరెస్ట్ అయ్యారు.  

1929వ సంవత్సరంలో HSRA సభ్యులు బాంబు ఫ్యాక్టరీలను స్థాపించారు. ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో పోలీసులు ఫ్యాక్టరీ ను కనుగొన్నారు. పోలీసుల ద్వారా జరిగిన రైడ్ లో HSRA సభ్యులు అరెస్ట్ అయ్యారు. 

అరెస్ట్ అయ్యిన కొంత మంది సభ్యులు ఇన్ఫార్మర్లు గా మారి బాంబు దాడి, ఆఫీసర్ సాండర్స్ మర్డర్ మరియు బాంబు ఫ్యాక్టరీ మధ్య ఉన్న కనెక్షన్ ను జోడించారు. 

పోలీస్ సాండర్స్ యొక్క హత్యలో భగత్ సింగ్ మరియు తన అనుచరులపై కేసు నమోదు చేసారు. 

జైల్లో ఉన్న సమయంలో తనను పొలిటికల్ ప్రిజనర్ (political prisoner) గా గుర్తించాలని బుక్స్ మరియు న్యూస్ పేపర్లను చదవటానికి అనుమతించాలని కోరారు. 

జైలు లో ఉన్న సమయంలో సింగ్ మరియు ఇతర విప్లవ కారులు నిరాహార దీక్షను ప్రారంభించారు. 

పోలీసులు చాలా రకాలుగా నిరాహార దీక్షను విరమించటానికి ప్రయత్నించారు కానీ నిరాహార దీక్ష అలాగే కొనసాగింది.  సింగ్ ను కోర్ట్ లో హాజరుపరిచినప్పుడు స్ట్రెచర్ మీద తీసుకురావాల్సి వచ్చింది. అరెస్ట్ కు ముందు 60 కిలోల బరువు ఉన్న సింగ్ తరవాత 6.4 కిలోలు తగ్గారు. 

మరణం : 

లాహోర్ లో పోలీస్ ఆఫీసర్ యొక్క హత్యలో పాల్గొన్నందుకు సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ను 24 మర్చి 1931  ఉరిశిక్ష విధించాలని తీర్పునిచ్చారు. 

కోర్ట్ ఇచ్చిన సమయం కన్నా 11 గంటల ముందే 23 మర్చి 1931 సంవత్సరం లాహోర్ జైలు లో ఉరి తీసారు. 

ఉరితీసిన తరువాత మృతదేహాలను జైలు గోడలో చేసిన రంద్రం ద్వారా గుట్టు చప్పుడు కాకుండా గాండా సింగ్ వాలా గ్రామం బయట  దహన సంస్కారాలు చేసారు. వీరి చితి బూడిదను సుట్లెజ్ నదిలోకి విసిరారు.       

Source: Bhagat Singh – Wikipedia      

1 thought on “భగత్ సింగ్ జీవిత చరిత్ర – Bhagat Singh Biography in Telugu”

Leave a Comment