రిషి సునక్ యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుత యూకే ప్రధాన మంత్రి. యూకే లో రెండు ముఖ్యమైన పార్టీలైన లేబర్ పార్టీ మరియు కన్జర్వేటివ్ పార్టీలలో కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) కి చెందిన వారు. 2015 వ సంవత్సరం నుంచి రిచ్మండ్ (Richmond)నియోజక వర్గానికి పార్లమెంటు సభ్యుడి గా ఉన్నారు.
Table of Contents
బాల్యం :
రిషి సునక్ 12 మే 1980వ సంవత్సరం ఇంగ్లాండ్ దేశంలోని సౌతాంప్టన్ నగరంలో యశ్వీర్ మరియు ఉషా సునక్ అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులకు ఉన్న ముగ్గురు తోబుట్టువులలో సునక్ పెద్దవారు.
సునక్ యొక్క తండ్రి కెన్యా దేశంలో పుట్టి పెరిగారు మరియు తల్లి టాంజానియా లో పుట్టారు.
సునక్ యొక్క నాన్న తరపు తాతయ్య, రామ్‌దాస్ సునక్ బ్రిటిష్ పాలన సమయంలో ఉన్న గుజ్రాన్వాలా, ప్రస్తుత పాకిస్తాన్ కి చెందిన వారు. 1935 వ సంవత్సరంలో కెన్యాలోని నైరోబి నగరానికి క్లర్క్ ఉద్యోగం చేయటానికి వలస వెళ్లారు. 1937 వ సంవత్సరంలో ఢిల్లీ కి చెందిన సుహాగ్ రాణి ని కలిసారు. ఈ ఇద్దరు కలిసిపెళ్లి చేసుకున్నారు.
సునక్ తల్లి తరపున తాతయ్య రఘుబిర్ సెయిన్ బెర్రీ, టాంజానియా దేశంలో టాక్స్ అధికారి గా పనిచేసేవారు. ఈయన అదే దేశానికి చెందిన 16 సంవత్సరాల శ్రాక్ష అనే అమ్మాయిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం.
శ్రాక్ష తన నగలను అమ్మగా వచ్చిన డబ్బుతో వీరి కుటుంబం 1966 లో యూకే కి వలస వెళ్ళింది.
యూకే లో రఘుబార్ ఇన్ లాండ్ రెవెన్యూ లో కలెక్టర్ గా మరియు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ లో సభ్యుడిగా నియమించబడ్డారు.
యూకే లో నివసిస్తున్నప్పుడు సునక్ యొక్క తండ్రి జనరల్ ప్రాక్టీషనర్ గా మరియు తల్లి ఉష ఒక లోకల్ ఫార్మసీ ను నడిపేవారు.
సునక్ తన స్కూలు చదువును హాంప్‌షైర్ (Hampshire) స్ట్రౌడ్ స్కూల్ మరియు వించెస్టర్ లోని వించెస్టర్ కాలేజ్ పబ్లిక్ స్కూల్ నుంచి పూర్తిచేసారు.
వేసవి సెలవులలో సునక్ సౌతాంప్టన్ లోని కర్రీ హౌస్ లో వెయిటర్ గా పనిచేసేవారు.
ఆక్స్ఫర్డ్ లోని లింకన్ కాలేజి లో తత్వశాస్త్రం(philosophy), రాజకీయాలు మరియు ఆర్థిక శాస్త్రం (PPE) నుంచి ఫస్ట్ క్లాస్ లో 2001వ సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు.
కాలేజి లో చదువుతున్న సమయంలోనే కన్జర్వేటివ్ క్యాంపెయిన్ ప్రధాన కార్యాలయంలో ఇంటర్న్ గా పనిచేసారు.
2006 వ సంవత్సరంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి MBA ను పూర్తిచేసారు. సునక్ అక్కడ చదువుతున్న సమయంలో చదువులో ముందుండేవారు.
కెరీర్ :
2001 నుంచి 2004 వరకు గోల్డ్మన్ సాచ్స్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో పనిచేసారు.
తరవాత హెడ్జ్ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థ ది చిల్డ్రన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్‌లో పనిచేసాడు. 2006వ సంవత్సరంలో పార్టనర్ అయ్యాడు. 2009 వ సంవత్సరంలో ఈ సంస్థను వదిలేసారు.
తరవాత కాలిఫోర్నియా లో తన పాత సహోద్యోగి యొక్క కొత్త హెడ్జ్ ఫండ్ సంస్థ థెలెమ్ పార్టనర్స్ లో చేరారు. ఈ సంస్థను అక్టోబర్ 2010 వ సంవత్సరంలో 700 మిలియన్ల డాలర్లతో ప్రారంభించారు.
తరవాత 2013 మరియు 2015 లో భారత వ్యాపారవేత్త ఎన్. ఆర్. నారాయణ మూర్తి మరియు తన మామగారి కంపెనీ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ కాటమరాన్ వెంచర్స్ లో డైరెక్టర్ గా కూడా పనిచేసారు.
రాజకీయ జీవితం :
2014 వ సంవత్సరంలో రిచ్‌మండ్ కొరకు కన్జర్వేటివ్ అభ్యర్థి గా ఎన్నుకోబడ్డారు. ఇదే సంవత్సరం నలుపు మరియు మైనారిటీ జాతి (Black and Minority Ethnic) యొక్క హెడ్ గా నియమించబడ్డారు.
2015 వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలిచి MP (Member of parliament) గా ఎన్నుకోబడ్డారు.
2015 నుంచి 2017 వరకు పర్యావరణం, ఆహారం మరియు గ్రామీణ వ్యవహారాల ఎంపిక కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
జూన్ 2016 EU సభ్యత్వ ప్రజాభిప్రాయ సేకరణ లో యూకే యూరోపియన్ యూనియన్ ను విడిచిపెట్టేందుకు చేపట్టిన బ్రెక్సిట్ కు మద్దతు తెలిపారు.
2017 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ గెలిచారు. జనవరి 2018 నుంచి జులై 2019 వరకు స్థానిక ప్రభుత్వ మరియు భవన భద్రత రాష్ట్ర మంత్రి గా పనిచేసారు.
2019 సంవత్సరంలో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికలలో బోరిస్ జాన్సన్ కు మద్దతు తెలిపారు.
24 జులై 2019 వ సంవత్సరం ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సునక్ ను ఖజానా ప్రధాన కార్యదర్శి (chief secretary to the Treasury) గా నియమించారు.
ఈ పదవిలో ఉన్న సమయంలో ఛాన్సలర్ సాజిద్ జావిద్ కింద పనిచేసేవారు. ఆ మరుసటి రోజు ప్రివి కౌన్సిల్ యొక్క సభ్యుడు అయ్యారు.
2019 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో సునక్ మెజారిటీ తో గెలుపును కైవసం చేసుకున్నారు.
ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ (2020–22):
13 ఫిబ్రవరి 2020 వ సంవత్సరం లో క్యాబినెట్ లో జరిగిన మార్పులలో సాజిద్ జావిద్ స్థానంలో సునక్ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ (కోశాధికారి) గా నియమించబడ్డారు.
కరోనా స్కీం:
11 మార్చి 2020 వ సంవత్సరంలో సునక్ మొదటిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 30 బిలియన్ పౌండ్ల ఈ బడ్జెట్ లో 12 బిలియన్ల పౌండ్లు కరోనా ద్వారా కలిగిన ఆర్థిక ప్రాభవాన్ని తగ్గించడానికి కేటాయించారు.
Job retention scheme: 17 మార్చి 2020 వ సంవత్సరంలో సునక్ 330 బిలియన్ల పౌండ్ల అత్యవసర మద్దతు వ్యాపారాలకు కలిగించారు.
Future Fund: మే 2020వ సంవత్సరంలో కరోనా కాలం లో 1.1 బిలియన్ పౌండ్ల పెట్టుబడిను 1,190 ప్రారంభ దశలో ఉన్న కంపెనీలపై ఇన్వెస్ట్ చేయటం జరిగింది.
Eat Out to Help Out: జులై నెలలో కరోనా వల్ల కలిగిన ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆహారం మరియు మద్యపాన రహిత డ్రింక్స్ పై 50% వరకు సబ్సిడీ ఇవ్వటం జరిగింది. ఒక్క ఆర్డర్ పై 10 పౌండ్ల వరకు సబ్సిడీ లభించేది.
రాజీనామా:
MP క్రిస్ పిన్చర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా 5 జూలై 2022 వ సంవత్సరం సునక్ ఛాన్సలర్ గా రాజీనామా చేసారు.
ప్రధాన మంత్రి :
20 అక్టోబర్ 2022 వ సంవత్సరం లిజ్ ట్రస్ ప్రధాన మంత్రి పదవి నుంచి రాజీనామా చేసిన తరవాత సునక్ తో పాటు పెన్నీ మోర్డాంట్ మరియు బోరిస్ జాన్సన్ PM పదవి రేస్ లో ఉన్నారు.
సునక్ కి హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి 100 మంది సభ్యుల మద్దతు లభించింది.
పెన్నీ మోర్డాంట్ మరియు బోరిస్ జాన్సన్ PM రేస్ నుంచి తప్పుకున్న తరవాత సునక్ కన్జర్వేటివ్ పార్టీ యొక్క అధ్యక్షుడిగా మరియు యూకే యొక్క ప్రధాన మంత్రిగా ఎన్నుకోబడ్డారు.
వ్యక్తిగత జీవితం :
సునక్ హిందూ మతానికి చెందిన వారు. MP గా ఎన్నికైనప్పుడు భగవద్ గీత పై ప్రమాణ స్వీకారం చేసారు.
2009 వ సంవత్సరంలో భారత బిలియనీర్ వ్యాపార వేత్త మరియు ఇన్ఫోసిస్ కంపెనీ సంస్థాపకుడు N. R. నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తి ను పెళ్లి చేసుకున్నారు.
సునాక్ మరియు అక్షత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో చదువుకుంటున్న సమయంలో కలిసారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
Sunday Times Rich List 2022 ప్రకారం సునక్ మరియు అక్షత యూకే లోని సంపన్నులలో 222 వ స్థానం లో ఉన్నారు.
730 మిలియన్ పౌండ్ల సంపదతో రాజకీయ సంపన్నుల జాబితాలో చేరారు.
Source: Rishi Sunak – Wikipedia