ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర – Chatrapati Shivaji Maharaj biography in Telugu

శివాజీ ను ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కూడా పిలుస్తారు. శివాజీ భారతదేశానికి చెందిన పాలకుడు మరియు భోంస్లే మరాఠి వంశానికి చెందిన వారు. 

క్షీణిస్తున్నబీజాపూర్ ఆదిల్ షాహి సుల్తాన్ యొక్క సామ్రాజ్యం నుంచి శివాజీ తన సొంత స్వతంత్ర రాజ్యాన్ని రూపొందించారు. ఇలా మరాఠా సామ్రాజ్యం యొక్క స్థాపన జరిగింది. 

1674 వ సంవత్సరంలో రాయగడ్ కోట లో అధికారికంగా ఛత్రపతి కిరీటాన్ని పొందారు.   

బాల్యం:  

శివాజీ 19 ఫిబ్రవరి 1630 వ సంవత్సరంలో పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించారు. 

శివాజీ కుటుంబం మహారాష్ట్రలోని వ్యవసాయం చేసే భోంస్లే కులానికి చెందిన వారు. శివాజీ తల్లి యాదవ క్షత్రియ వంశానికి చెందిన వారు. 

శివాజీ కంటే ముందు పుట్టిన పిల్లలు చనిపోవటంతో తల్లి తాను పూజించే దేవత శివై పేరు మీద శివాజీ అని పేరు పెట్టారు. 

శివాజీ యొక్క తాత మాళోజి డెక్కన్ లో ఉన్న అహ్మద్ నగర్ సుల్తాన్ వద్ద ప్రభావవంతమైన జనరల్ గా ఉన్నారు. ఈయనకు దేశముఖి అనే బిరుదును కూడా ఇవ్వటం జరిగింది. శివనేరి కోట లో తన కుటుంబం తో పాటు ఉండేందుకు కూడా అనుమతి లభించింది.

శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల రాజుల వైపు ఉంటూ మొగల్ రాజులకు వ్యతిరేక యుద్ధాలలో పాల్గొనే వారు.

నిజాంషాహీల పైన షాజహాన్ దండయాత్ర చేసిన సమయంలో షాహాజి సైన్యాన్ని బలోపేతం చేయటంలో కీలక పాత్ర వహించాడు.

మొగల్ రాజులకు వ్యతిరేకంగా పోరాడటంతో మొగల్ సైన్యం నిరంతరం షాహాజి వెంటపడేవారు. షాహాజి తన కొడుకు శివాజి మరియు భార్య జీజాబాయ్ తో కలిసి ఒక కోట నుంచి ఇంకో కోటకు తరచూ మారుతూ ఉండేవారు.

1636 వ సంవత్సరంలో బీజాపూర్ రాజు వద్ద పనిచేస్తున్న సమయంలోషాహాజి పూనా ను దక్కించుకున్నారు. శివాజి మరియు జీజాబాయ్ పూణే లోనే స్థిరపడ్డారు.

బీజాపూర్ రాజు ద్వారా షాహాజి బెంగళూరు కి తరలించబడ్డారు. షాహాజి పూణే యొక్క పాలన అధికారిగా డాడోజీ కొండేడియో ను నియమించారు.

1647 వ సంవత్సరంలో కొండేడియో చనిపోయిన తరవాత శివాజీ అధికారాన్ని చేపట్టారు. బీజాపూర్ రాజుకి వ్యతిరేకంగా నిలబడ్డారు.

బీజాపూర్ సుల్తాన్ :

సుల్తాన్ అదిల్ షాహ్ అనారోగ్యం గా ఉన్న సమయంలో 16 సంవత్సరాల వయస్సులో శివాజీ టోర్న కోట ను స్వాధీనం చేసుకున్నారు.

తరవాటి సంవత్సరాలలో పూణే కి సమీపంలో ఉన్న ప్రాంతాలతో పాటు పురందార్, కొంధనా మరియు చకన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

పూణే కి తూర్పు దిక్కున ఉన్న సుపా, బరామతి మరియు ఇండపూర్ కూడా తన ఆధీనంలోకి తీసుకున్నారు.

టోర్న కోట లో దొరికిన బంగారు నిధులతో రాజ్ గడ్ అనే కోటను నిర్మించారు. తరవాత ఒక దశాబ్దం వరకు శివాజీ రాజ్ గడ్ నుంచే పాలించారు.

తర్వాత శివాజీ పడమర వైపు ఉన్న కొంకణ్ మరియు కళ్యాణ్ ను తన ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇదంతా గమనించిన బీజాపూర్ రాజు శివాజీ ని ఆపడానికి తండ్రి షాహాజి ను 25 జులై 1648 వ సంవత్సరంలో నిర్బంధించారు.

1649 వ సంవత్సరంలో జింజీ ప్రాంతాన్ని దక్కించుకున్న తరవాత షాహాజి ను విడుదల చేసారు.

1649 నుంచి 1655 వరకు శివాజీ తన దండయాత్రలు ఆపారు. తన తండ్రి విడుదల అయ్యాక దండయాత్రలు మొదలుపెట్టారు.

శివాజీ శక్తివంతమైన కుటుంబాలను తనతో పాటు కలుపుకున్నారు, వివిధ రకాల వ్యూహాలతో తనతో చేర్చుకున్నారు. కొన్ని సార్లు బలప్రదర్శన కూడా చేయవలసి వచ్చేది.

ఇదంతా చూస్తున్న షాహాజి కి తన కొడుకు పట్ల సందిగ్ధ వైఖరిని కలిగి ఉన్నారు. బీజాపూర్ ప్రభుత్వం తో తన కొడుకు ను ఏమైనా చేసుకోమ్మని చెప్పారు.

అఫ్జల్ ఖాన్ :

బీజాపూర్ సుల్తాన్ శివాజీ వాళ్ళ కలుగుతున్న నష్టం కారణంగా అసంతృప్తికి గురయ్యాడు. మొగల్ సామ్రాజ్యం తో సంధి కుదుర్చుకున్న తరవాత అదిల్ షా II సుల్తాన్ నేతృత్వం లో బీజాపూర్ రాజ్యం ఇంకా బలంగా మారింది.

1657 వ సంవత్సరంలో సుల్తాన్ ఆఫ్జల్ ఖాన్ అనే జనరల్ ను శివాజీ ను అరెస్ట్ చేయటానికి పంపించారు. మార్గ మధ్యంలో బీజాపూర్ సేన తల్జా భవణి ఆలయం, విథోబా ఆలయం ను పాడు చేసారు.

10 నవంబర్ 1659 సంవత్సరంలో శివాజీ కి మరియు ఆఫ్జల్ ఖాన్ కి మధ్య జరిగిన ప్రతాప్ గడ్ యుద్ధంలో బీజాపూర్ ఆర్మీ యొక్క 3 వేళా మంది సైనికులు మరణించారు. ఆఫ్జాల్ ఖాన్ యొక్క ఇద్దరు కుమారులు కూడా మరణించారు. ఈ యుద్ధం శివాజీ గెలిచారు.

పన్హాలా :

బీజాపూర్ ఆర్మీ ను ఓడించిన తరవాత శివాజీ ఆర్మీ బలగాలు కొంకణ్ మరియు కొల్హాపూర్ వైపు వెళ్లాయి. 1659వ సంవత్సరంలో రుస్తాం జమాన్ మరియు ఫజ్ల్ ఖాన్ ద్వారా పంపబడ్డ సైన్యాన్ని ఓడించి పన్హాలా కోట ను దక్కించుకున్నారు.

1660 సంవత్సరంలో అదిల్ షా జనరల్ సిద్ది జౌహర్ ను శివాజీ పై దక్షిణ సరిహద్దు నుంచి దాడికి పంపాడు.

ఉత్తరం దిక్కు నుంచి మొగల్ సామ్రాజ్యం దాడి చేసారు. శివాజీ పన్హాలా కోటలోనే ఉండిపోయారు.

కొన్ని నెలల ముట్టడి తరవాత సిద్దీ జౌహర్‌తో చర్చలు జరిపి 22 సెప్టెంబర్ 1660 సంవత్సరంలో కోటను అందచేసారు. 1673 వ సంవత్సరంలో శివాజీ మళ్ళీ తిరిగి ఆ కోటను స్వాధీనం చేసుకున్నారు.

పావన్ ఖిన్డ్ :

పన్హాలా కోట నుంచి తప్పించుకున్న శివాజీ వెంట శత్రు సైన్యం నుంచి గుర్రపు సేన వెంబడించ సాగారు.

శివాజీ తో పాటు ఉన్న మరాఠా సర్దార్ బాజీ దేశ్ ప్రభు దేశ్ పాండే స్వతహాగా రాజును కాపాడటానికి 300 సైనికుల తో ఘోడ్ ఖిన్డ్ వద్ద శత్రు సైన్యాన్ని తిప్పి పంపటానికి ఆగారు. ఈ సమయంలో శివాజీ మరియు ఇతర సైన్యానికి విశాల్ గడ్ కోట వరకు వెళ్లే సమయం దక్కుతుంది.

బాజీ ప్రభు దేశ్ పాండే తనతో ఉన్న 300 సైనికులతో శత్రు సైన్యం తో భీకరంగా పోరాడారు. గాయపడిన కూడా శివాజీ సురక్షితంగా కోట కు చేరేవరకు పోరాడాడు.

శివాజీ విశాల్ గఢ్ కోట చేరుకున్న తరవాత ఫిరంగి ని పేల్చి బాజీ ప్రభు దేశ్ పాండే కి సిగ్నల్ ఇచ్చారు. ఈ పోరాటంలో బాజీ ప్రభు దేశ్ పాండే తన ప్రాణాలను కోపోయాడు.

ఈ పోరాటం జరిగిన ప్రాంతాన్ని బాజీ ప్రభు దేశ్ పాండే మరియు ఇతరుల గౌరవార్థం పావన్ ఖిన్డ్ అని పేరు పెట్టారు.

మొఘల్ సామ్రాజ్యం శివాజీ పలుసార్లు పోరాడి గెలిచారు. ఔరంగజేబ్ శివాజీ కి వ్యతిరేకంగా పలుమార్లు సైన్యాన్ని కూడా పంపించాడు.

శివాజీ మరియు మొఘల్ సామ్రాజ్యం  : 

1657 వరకు శివాజీ మొఘల్ సామ్రాజ్యం తో శాంతియుత సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ సమయంలో డెక్కన్ లో ఉన్న మొఘల్ సామ్రాజ్యానికి   వైస్రాయ్ ఔరంగజేబ్ ఉండేవారు.

శివాజీ బీజాపూర్ సామ్రాజ్యాన్ని గెలవటంలో ఔరంగజేబ్ కు సహాయం చేస్తానని చెప్పారు. బదులుగా బీజాపూర్ లోని కోటలపై మరియు తన అధీనంలో ఉన్న గ్రామాలపై అధికారికంగా హక్కును కల్పించాలని  చెప్పారు. 

మొఘల్ సామ్రాజ్యం నుంచి సరైన స్పందన రాకపోవటం వల్ల బీజాపూర్ సామ్రాజ్యం తో కలిసి డెక్కన్ లో ఉన్న మొగల్ సామ్రాజ్యం పై దండయాత్ర చేసారు. 

1657 సంవత్సరంలో శివాజీ సామ్రాజ్యం లో ఉన్న అధికారులు అహ్మద్ నగర్  దగ్గరలో ఉన్న మొఘల్ భూభాగం పై దాడి చేసారు. తరవాత పూణే జిల్లాలోని జున్నార్ పై దాడి చేసి 300,000 డబ్బు  మరియు 200 గుర్రాలను తమతో తీసుకువెళ్లారు.  దాడులకు స్పందిస్తూ ఔరంగజేబ్ శివాజీ బలగాలతో పోరాడటానికి నాసిరి ఖాన్ ను పంపించారు. 

అహ్మద్ నగర్ వద్ద నాసిరి ఖాన్ చేతిలో శివాజీ బలగాలు ఓడిపోయాయి.   అదే సమయంలో వర్షాకాలం కావటం  మరియు షాజహాన్ రాజు అనారోగ్యంగా ఉండటం కారణంగా, తరవాత ఎవరు రాజు అవుతారు అని తన తోబుట్టువులతో జరుగుతున్న రభస లో ఔరంగజేబు శివాజీ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.     

షైస్తా ఖాన్ (Shaista Khan):

బీజాపూర్ యొక్క బడీ బేగం అభ్యర్థన మేరకు షాజహాన్ తరవాత రాజు అయిన  ఔరంగజేబు తన మేన మామ షైస్తా ఖాన్ ను బీజాపూర్ సైన్యం తో కలిసి శివాజీ పై  దాడి చేయటానికి పంపించారు. 

ఈ సైన్యం పూణే నగరాన్ని స్వాధీనం చేసుకొని శివాజీ పాలస్ లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 

రాత్రి సమయంలో శివాజీ తన అనుచరులతో కలిసి షైస్తా ఖాన్ పై దాడి చేసారు. 

ఈ దాడి లో షైస్తా ఖాన్ యొక్క భార్యలు, కొడుకు, అనుచరులు మరియు సైనికులు చంపబడ్డారు. షైస్తా ఖాన్ శివాజీ చేతిలో ఓడిపోయినందుకు   ఔరంగ జేబ్ కు సిగ్గు చేటు అనిపించింది. షైస్తా ఖాన్ పై కోపం తో బెంగాల్ ట్రాన్స్ఫర్ చేసారు. 

షైస్తా ఖాన్  దాడుల కారణంగా శివాజీ ఖజానాలు తగ్గాయి. ఈ దాడులకు ప్రతీకారంగా సంపన్న ప్రాంతమైన సూరత్ పై దాడి చేసారు. 

పురందర్ (Purandar):  

శివాజీ చేస్తున్న దాడులను చూసి ఔరంగ జేబ్ కోపంతో రాజ్ పూత్  జనరల్ జై సింగ్ I ను శివాజీ ను ఓడించటానికి పంపించారు. 

పురందర్ ను  ముట్టడించి స్వాధీనం చేసుకొనే సమయానికి శివాజీ జై సింగ్ తో ఒప్పందం కూర్చుకోవాల్సి వచ్చింది. 

   ఈ ఒప్పందం ప్రకారం తన అధీనంలో ఉన్న 23 కోటలను 400,000 బంగారు నాణేలను మొఘల్ సామ్రాజ్యానికి ఇచ్చారు.   

దీనితో పాటు శివాజీ మొఘల్ సామ్రాజ్యానికి సహాయం చేయటం కోసం అంగీకరించారు. శివాజీ తన కొడుకు శంభాజీ ను డెక్కన్ లో మొఘలుల కోసం పోరాడటానికి వెళ్లారు. 

అరెస్టు:

1666 వ సంవత్సరంలో ఔరంగ జేబ్ శివాజీ ను కాందహార్, ప్రస్తుత ఆఫ్గనిస్తాన్ కు పంపాలని నిర్ణయించారు. ఔరంగ జేబ్ తన ఆస్థానంలో శివాజీ ను తక్కువ స్థాయి లో ఉన్న వారితో నిల్చోబెట్టినప్పుడు కోపం తో ఆస్థానం బయటికి వెళ్లారు.  

ఇది చూసిన ఔరంగ జేబ్ శివాజీ ను హౌస్ అరెస్ట్ చేసారు. తరవాత కోట నుంచి బయటికి వెళ్లే పండ్ల బుట్టలో దాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. 

శాంతి :

మొఘల్ సర్దార్ జశ్వంత్ సింగ్ శివాజీ కి మరియు ఔరంగ జేబ్ కు మధ్య శాంతి ప్రతిపాదనల కోసం మధ్యవర్తిగా వ్యవహరించారు.  

 ఈ శాంతి ప్రతిపాదన కేవలం 1670 వరకు కొనసాగింది. ఔరంగ జేబ్ సామ్రాజ్యం ఆఫ్గనిస్తాన్ లో పోరాటం చేస్తున్నప్పుడు శివాజీ మొగల్ సామ్రాజ్యం పై దాడి చేసారు. 

రాజు :

6 జూన్ 1674 సంవత్సరంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో శివాజీ మరాఠా సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసారు.     

మరణం :

శివాజీ ఏప్రిల్ నెల 1680లో 50 సంవత్సరాల వయస్సులో చనిపోయారు.

Source: Shivaji – Wikipedia

Leave a Comment