బాజీ ప్రభు దేశ్‌పాండే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కమాండర్. బాజీ ప్రభు పన్హాలా కోట నుంచి శివాజీ మహారాజు ను తప్పించటంలో చాలా ముఖ్యమైన పాత్రను మరియు ధైర్య సాహసాలను ప్రదర్శించాడు.
రాజు కోసం పోరాడి తన ప్రాణాలను త్యాగం చేసిన ఒక గొప్ప యోధుడు
బాజీ ప్రభు దేశ్ పాండే 1615 వ సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రభు కుటుంబంలో జన్మించారు .
బాజీ ప్రభు భోర్ పట్టణానికి దగ్గరలో రోహిండా కి చెందిన కృష్ణాజీ బండల్ వద్ద పనిచేసేవారు.
శివాజీ కృష్ణాజీ బండల్ ను ఓడించి కోటను స్వాధీనం చేసుకున్న తరవాత బాజిప్రభు మరియు ఇతర కమాండర్లు శివాజీ తో పాటు చేరారు.
పన్హాలా కోట నుంచి శివాజీ ను విశాల్ గఢ్ కోట కు తరలించడంలో ముఖ్య పాత్రను వహించారు. శివాజీను వెంబడిస్తున్న శత్రు సైన్యాన్ని కేవలం 300 మరాఠా సైన్యం తో శివాజీ విశాల్ గఢ్ సురక్షితంగా చేరుకునే వరకు పోరాడారు.
మరాఠాలకు మరియు మొఘల్ సైన్యానికి మధ్య జరిగిన యుద్ధ ప్రాంతాన్ని ఘోడ్ ఖిన్డ్ నుంచి పావన్ ఖిన్డ్ గా మార్చారు.
Source: Baji Prabhu Deshpande – Wikipedia
.