రామసేతు అంటే ఏమిటి – What is Rama setu in Telugu?

రామసేతు ని రామ వంతెన లేదా ఆడమ్స్ బ్రిడ్జి అని కూడా అంటారు. ఈ వంతెన దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రామేశ్వరం లేదా పంబన్ ద్వీపం నుంచి శ్రీలంక దేశానికి చెందిన మన్నార్ ద్వీపానికి మధ్య ఉంది.

ఈ వంతెన ఇసుక మరియు సున్నపు రాళ్లను కలిగి ఉంటుంది. ఈ వంతెన యొక్క పొడవు 48 కిలోమీటర్లు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ వంతెన ను చూసి ఆడమ్స్ బ్రిడ్జి అని వర్ణించారు.

చరిత్ర :

రామాయణం లో ఈ వంతెన గురించి పేర్కొనడం జరిగింది. ఈ వంతెనను దేవుడు రాముడు తన వానర సేన ద్వారా ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనను లంకలో ఉన్న రాక్షసుడు అయిన రావణుడు నుంచి దేవత సీత ను కాపాడటానికి నిర్మించారు.

అప్పటి లంక ప్రస్తుతం శ్రీలంక దేశంగా మారిందని చాలా మంది భావిస్తారు.

పాశ్చాత్య ప్రపంచం ఈ వంతెన గురించి ఇబ్న్ ఖార్డాద్బే (Ibn Khordadbeh) యొక్క పుస్తకం Roads and Kingdoms ద్వారా తెలుసుకున్నారు. ఈ పుస్తకంలో ఈ వంతెనను బ్రిడ్జ్ ఆఫ్ ది సీ (సముద్రం యొక్క వంతెన) గా పేర్కొన బడింది.

కొందరు ఇస్లామిక్ స్కాలర్స్ ప్రకారం స్వర్గం నుంచి బహిష్కరించబడిన ఆడమ్ భూమి మీదకు వచ్చినప్పుడు శ్రీలంక లోని పర్వతం పై దిగాడు. శ్రీలంక నుంచి ఇండియాకి ఈ వంతెన ద్వారా వచ్చాడని నమ్ముతారు.

అందుకే ఈ వంతెనను ఆడమ్స్ బ్రిడ్జి అని పిలుస్తారు. 1804వ సంవ్సతరంలో బ్రిటన్ కు చెందిన వ్యక్తి ప్రపంచ పటాన్ని తయారు చేసినప్పుడు దీనికి ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు.

ఈ వంతెన గొలుసు మాదిరిగా పంబన్ ద్వీపం లోని ధనుష్కోడి నుంచి శ్రీలంక లోని మన్నార్ ద్వీపం వరకు ఉంది.

భారతదేశ ముఖ్య భూభాగం నుండి పంబన్ ద్వీపం చేరుకోవడానికి 2 కిలోమీటర్ల పంబన్ వంతెన ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. 

మన్నార్ ద్వీపం కూడా శ్రీలంక ముఖ్య భూభాగం నుంచి కాజ్‌వే (నీటి పై ఏర్పాటు చేసిన దారి) ద్వారా కలపబడి ఉంటుంది.  

కొంత మంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ వంతెన ప్రకృతి ద్వారా నిర్మించబడింది. పరిశోధన కారులు క్రమంగా సాక్ష్యాలను కూడబెట్టి, ఈ వంతెన మనుషుల ద్వారా నిర్మించబడింది అని రుజువు చేస్తున్నారు. హిందూ రైట్ వింగ్ సంస్థలు కూడా ఈ వంతెన దేవుడు శ్రీరాముడు ద్వారా   నిర్మించబడిందని వాదిస్తున్నారు.       

రాకపోకలు : 

కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం తక్కువగా ఉన్నప్పుడు రామ సేతు ఇండియా మరియు శ్రీలంక కలుపుతూ ఉండేదని పరిశోధన కారులు నమ్ముతారు. 

రామ సేతు ఇండియా మరియు శ్రీలంకకు మధ్య పడవలు ప్రయాణించడానికి అడ్డుగా ఉండేది. కానీ పూర్వం నుంచే ఇండియా శ్రీలంక మధ్య చిన్న చిన్న పడవల ద్వారా మాత్రమే ప్రయాణం జరిగేది. పెద్ద పెద్ద ఓడలు మాత్రం భారతదేశ తూర్పు కు చేరటానికి శ్రీలంక చుట్టూ ప్రయాణించవలసి వచ్చేది. 

18 వ శతాబ్దంలో ప్రముఖ బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త మేజర్ జేమ్స్ రెన్నెల్ ఈ ప్రాంతాన్ని సర్వే చేసిన తరవాత దీనిని తొలగించాలని తన నిర్ణయాన్ని తెలిపారు.  

వయసులో చిన్న వాడు కావటంతో తన నిర్ణయాన్ని ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. 60 సంవత్సరాల తరవాత మాత్రమే ఈ ఐడియా మీద పనిచేయటం మొదలుపెట్టారు. 

1823 వ సంవత్సరంలో సర్ ఆర్థర్ కాటన్ పంబన్ ఛానల్ ను తొలగించి ఓడలు వెళ్లే దారిని నిర్మించాలని ప్రతిపాదించారు. 

ఈ రైల్వే బ్రిడ్జి కి ముందే అక్కడ భూమి ద్వారా ఒక దారి ఉండేదని, 1480 లో వచ్చిన తుఫాను కారణముగా ఆ దారి విరిగిపోయిందని రామనాథస్వామి ఆలయం ద్వారా కొన్ని ఆధారాలు ఉన్నాయి.    

1837 లో కొంత మంది అధికారుల ద్వారా మరింత వివరణాత్మక సర్వే చేయటం జరిగింది. కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 

సేతుసాముద్రం  ప్రాజెక్ట్ (Sethusamudram project):

స్వాతంత్య్రానికి ముందు మరియు తరవాత సేతు సముద్రం ప్రాజెక్ట్ ను నిర్మించటానికి సలహాలు ఇవ్వటానికి కమిటీలు తయారు చేయబడ్డాయి.

చాలా వరకు కమిటీలు రామసేతు ను నిర్ములించడానికి ఒప్పుకోలేదు. రామేశ్వరం గుండా భూమి ద్వారా ఉన్న దారిని ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. 

1956 లో ఏర్పాటు చేసిన సేతుసాముద్రం ప్రాజెక్ట్ కమిటీ కూడా రామసేతును నిర్మూలించకుండా రోడ్డు మార్గమే ఎంచుకోవాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. 

2005 వ సంవత్సరంలో ప్రభుత్వం సేతుసాముద్రం  షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ ను నిర్మించడం పై ఆమోదం తెలిపింది. 

ఈ ప్రాజెక్ట్ ను నిర్మించాలంటే రామసేతు ను తొలగించాల్సి ఉంటుందని తెలపటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 400 కిలోమీటర్ల దూరాన్ని మరియు 30 గంటల రవాణా సమయాన్ని తగ్గించవచ్చని చెప్పారు. 

భారతదేశానికి చెందిన కొన్ని రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ (BJP), ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెట్రా కజగమ్ (AIADMK), రాష్ట్రియ జనతాద దల్ (RJD), జనతా దళ్(JD) మరియు కొన్ని హిందూ సంస్థలు రామసేతు నిర్ములన పై వ్యతిరేకత తెలిపారు.      

2008వ సంవత్సరంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆరు మంది బృందం తో ఒక కమిటీ ను తయారు చేసారు. 2013 లో ఆర్థికంగా మరియు పర్యావరణ కోణం నుండి రామసేతును నిర్ములించటం సరి కాదని కమిటీ  రిపోర్ట్ ను ఇవ్వటం జరిగింది. 

కానీ అప్పటి ప్రభుత్వం ఆ కమిటీ యొక్క రిపోర్ట్ ను తిరస్కరించారు మరియు ప్రాజెక్ట్ ను కొనసాగించారు. 

2014 లో మోడీ ప్రభుత్వం రామసేతు ను కూల్చకుండా పంబన్ పాస్ ను లోతుగా చేసి ఒక దారిని నిర్మించాలని తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. 

ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి 3.1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అంచనా వేయటం జరిగింది.    

హిందూ మతం : 

రామాయణం ప్రకారం ఈ రామసేతును వానర సేన సహాయం తో దేవుడు శ్రీరాముడు నిర్మించారు. ఈ రామసేతును తన భార్య అయిన సీత ను రావణుడి నుంచి కాపాడుకోవటానికి నిర్మించటం జరిగింది.        

Source: Adam’s Bridge – Wikipedia

Leave a Comment