బిల్ గేట్స్ జీవిత చరిత్ర – Bill gates biography in Telugu

విలియం హెన్రీ గేట్స్ III అమెరికా కు చెందిన వ్యాపార వేత్త, సాఫ్ట్‌వేర్ డెవలపర్, పెట్టుబడిదారుడు, రచయిత మరియు దాత.

ఇతను తన చిన్ననాటి స్నేహితుడు అయిన పాల్ అలెన్‌ (Paul Allen) తో కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించారు.

1970 మరియు1980లలో సామాన్యుల కోసం వ్యక్తిగత ఉపయోగాలకోసం ఉపయోగించే కంప్యూటర్లలో విప్లవం ను తీసుకువచ్చిన ముఖ్య పారిశ్రామిక వేత్త (entrepreneur).

బాల్యం :

బిల్ గేట్స్ అక్టోబర్ 28, 1955న సియాటిల్ , వాషింగ్టన్‌లో విలియం హెచ్. గేట్స్ సీనియర్ మరియు మేరీ మాక్స్‌వెల్ గేట్స్ దంపతులకు జన్మించారు.

గేట్స్ తండ్రి ప్రముఖ న్యాయవాది మరియు తల్లి ఫస్ట్ ఇంటర్‌స్టేట్ బ్యాంక్‌సిస్టమ్ మరియు యునైటెడ్ వే ఆఫ్ అమెరికా కంపెనీలలో డైరెక్టర్ల బోర్డులో పనిచేసారు. గేట్స్ యొక్క తాత JW మాక్స్‌వెల్ నేషనల్ బ్యాంకు లో ప్రెసిడెంట్ గా పనిచేసారు.

తోబుట్టువులలో బిల్ గేట్స్ కి ఒక అక్క క్రిస్టియాన్నే మరియు చెల్లెలు లిబ్బి ఉన్నారు.

చిన్న తనంలో గేట్స్ మిగతా పిల్లల కన్నా చిన్న గా ఉండేవారు. తోటి విద్యార్థులు బిల్ గేట్స్ ను వేధించేవారు.

తల్లి తండ్రులు గేట్స్ ను ఒక లాయర్ గా చూడాలనుకునేవారు. 13 సంవత్సరాల వయస్సులో లేక్‌సైడ్ ప్రిపరేషన్ స్కూల్ లో చదుచుతున్న సమయంలో మొదటి సారి సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం ను రాసారు.

ఎనిమిదవ తరగతి లో గేట్స్ చదువుతున్నప్పుడు బేసిక్ (BASIC) ప్రొగ్రమింగ్ లాంగ్వేజ్ లో ఆసక్తి చూపించారు. తనకు ప్రొగ్రమింగ్ లో ఉన్న ఆసక్తిను చూసి మాథ్స్ క్లాస్ నుంచి మినహాయింపు లభించింది.

తన స్కూల్ లో ఉన్న కంప్యూటర్ ను ఉపయోగించి మనుషులు కంప్యూటర్ తో గేమ్స్ ఆడే విధంగా ప్రోగ్రాం ను తయారు చేసారు. కేటాయించిన సమయం కన్నా ఎక్కువ సమయం కంప్యూటర్ పై గడుపుతున్నందుకు గేట్స్ ను మరియు తన స్నేహితులైన పాల్ అలెన్, రిక్ వీలాండ్ మరియు కెంట్ ఎవాన్స్ ను కంప్యూటర్ ను వినియోగించకుండా బ్యాన్ చేసారు.

కంప్యూటర్స్ పై ఉన్న ఆసక్తి ను చూసి గేట్స్ మరియు ఎవాన్స్ ను స్కూల్ టీచర్ పాఠశాల తరగతి-షెడ్యూలింగ్ సిస్టం ను ఆటోమేట్ చేయమని కోరారు. బదులుగా గుర్తింపు మరియు కంప్యూటర్ పై సమయం గడపటానికి ఇస్తానని టీచర్ చెప్పారు.

గేట్స్ మరియు ఎవాన్స్ ఈ ప్రాజెక్ట్ పై పనిచేయటం మొదలుపెట్టారు. ఒక రోజు పర్వతారోహణలో ప్రమాదవశాత్తు గా ఎవాన్స్ చనిపోయాడు. తన స్నేహితుడు చనిపోయాడని బిల్ గేట్స్ చాలా బాధ పడ్డాడు.

తరవాత గేట్స్ మరొక స్నేహితుడు అయిన అల్లెన్ సహాయం తీసుకొని ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేసారు.

17 సంవత్సరాల వయస్సులో గేట్స్ మరియు అల్లెన్ కలిసి Traf-O-Data అనే వెంచర్ ను ప్రారంభించారు. ఈ వెంచర్ ద్వారా రోడ్ ఇంజనీర్స్ కు రోడ్ ట్రాఫిక్ రిపోర్ట్ ను అంద చేసేవారు.

1973 లో లేక్‌సైడ్ స్కూల్ లో తన చదువును పూర్తి చేసుకున్నప్పుడు నేషనల్ మెరిట్ స్కాలర్ గా ఉన్నారు. అమెరికా కు చెందిన నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ స్కాలర్ షిప్స్ ల కోసం పోటీలు నిర్వహిస్తుంది.

తరవాత స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో 1600 లకు 1590 మార్కులు సాధించి హార్డ్వర్డ్ కాలేజీ లో చేరారు.

హార్డ్వర్డ్ లో చదివే సమయంలో స్టీవ్ బాల్మెర్ కూడా బిల్ గేట్స్ తో పాటు చదివారు. రెండు సంవత్సరాల తరవాత గేట్స్ హార్డ్వర్డ్ ను వదిలేసారు కానీ స్టీవ్ బాల్మెర్ తన చదువును పూర్తి చేసారు.

తరవాత బిల్ గేట్స్ స్థాపించిన కంపెనీ లో స్టీవ్ బాల్మెర్ CEO గా 2000 సంవత్సరం నుంచి 2014 వరకు చేసారు.

గేట్స్ మరియు అల్లెన్ కలుస్తూ ఉండేవారు. 1975 వ సంవత్సరంలో మైక్రో ఇన్‌స్ట్రుమెంటేషన్ మరియు టెలిమెట్రీ సిస్టమ్స్ (MITS) అనే కంపెనీ Altair 8800 అనే కంప్యూటర్ ను విడుదల చేసింది.

ఇది చూసిన గేట్స్ మరియు అల్లెన్ తాము ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మొదలుపెట్టవచ్చని అనుకున్నారు. అదే సంవత్సరం గేట్స్ హార్డ్వర్డ్ ను మానేసారు.

నేను అనుకున్న విధంగా కంపెనీ సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ చదువు పడతాను అని చెప్పగా, కాలేజీ మానేస్తాననే ఆలోచనను గేట్స్ తల్లి తండ్రులు ఒప్పుకున్నారు. కొడుకు కొత్త కంపెనీ ను మొదలుపెడుతున్నాని సపోర్ట్ చేసారు.

సొంత కంపెనీ (మైక్రో సాఫ్ట్):

1975 వ సంవత్సరంలో విడుదల అయిన Altair 8800 కంప్యూటర్ కు ఇంటర్ప్రెటేర్ (interpreter) రోపొందిస్తానని అని చెప్పగా MITS అధ్యక్షుడు ఎడ్ రాబర్ట్స్ ఒప్పుకున్నారు.

గేట్స్ మరియు అల్లెన్ కలిసి Altair BASIC అనే ఇంటర్ప్రెటర్ ను రూపొందించారు. Altair BASIC యూజర్స్ కి Altair కంప్యూటర్ లో ప్రోగ్రామ్స్ తయారు చేయటానికి ఉపయోగ పడేది.

అల్లెన్ మరియు బిల్ గేట్స్ కలిసి MITS వద్ద పనిచేయటం మొదలుపెట్టారు. అల్లెన్ తమ పార్టనర్ షిప్ ని మైక్రోకంప్యూటర్ (microcomputer) లోని micro ను మరియు సాఫ్ట్ వేర్ (Software) లోని soft ను తీసుకొని “Micro-Soft” అని పేరు పెట్టారు.

తమ కంపెనీ లో మొదటి ఉద్యోగిగా హై స్కూల్ స్నేహితుడు అయిన రిక్ వీలాండ్ ను తీసుకున్నారు. కొన్ని రోజులు గడిచిన తరవాత “Micro-Soft” ను “Microsoft” గా మార్చారు.

1976 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ MITS నుంచి విడిపోయి ఒక స్వతంత్ర కంపెనీ గా మారి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాఫ్ట్‌వేర్ ను డెవలప్ చేసారు.

కంపెనీ మొదటి 5 సంవత్సరాలు రాసిన ప్రోగ్రామింగ్ కోడ్ లను బిల్ గేట్స్ స్వయంగా చూసి సరిదిద్దేవాడు.

1981 వ సంవత్సరంలో గేట్స్ మరియు నీల్ కాన్జెన్ కలిసి DONKEY.BAS అనే వీడియో గేమ్ ను తయారు చేసారు. ఈ గేమ్ ను ఆడుతున్న ప్లేయర్ గాడిదలను గుద్దకుండా డ్రైవ్ చేయాలి.

IBM:

కంప్యూటర్ పరికరాలలో ప్రముఖ కంపెనీ అయిన IBM కు ఆపరేటింగ్ సిస్టం కావాల్సి వచ్చింది. బిల్ గేట్స్ తల్లి మేరీ మాక్స్‌వెల్ గేట్స్ IBM CEO అయిన జాన్ ఒపెల్ ను మైక్రో సాఫ్ట్ ను సంప్రదించమని చెప్పింది.

1980 వ సంవత్సరంలో IBM తమ PC లఒక కు ఒక ఆపరేటింగ్ సిస్టం కావాలని చెప్పినప్పుడు గేట్స్ మరియు అల్లెన్ కలిసి 86-DOS ఆపరేటింగ్ సిస్టం ను తయారు చేసారు. 86-DOS, ఆ సమయంలో పాపులర్ గా ఉన్న CP/M ఆపరేటింగ్ సిస్టం లాగా ఉండేది.

IBM కు ఆపరేటింగ్ సిస్టం తయారు చేసే కాంట్రాక్టు లభించిన తర్వాత మైక్రోసాఫ్ట్ చిన్న కంపెనీ నుంచి ప్రపంచంలో ఉన్న కంపెనీలలో ప్రముఖ కంపెనీ గా మారింది.

జూన్ 25, 1981వ సంవత్సరంలో బిల్ గేట్స్ మైక్రో సాఫ్ట్ బోర్డు యొక్క ప్రెసిడెంట్ మరియు చైర్మన్ అయ్యారు. పాల్ అల్లెన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు.

1983 వ సంవత్సరంలో కాన్సర్ వ్యాధి కారణంగా అల్లెన్ మైక్రోసాఫ్ట్ ను అధికారికంగా వదిలేయాల్సి వచ్చింది. అంతకు ముందు నుంచే బిల్ గేట్స్ మరియు అల్లెన్ మధ్య జరుగుతున్న మైక్రోసాఫ్ట్ ఈక్విటీ కూడా అంతమైంది.

Windows:

నవంబర్ 20, 1985వ సంవత్సరంలో అప్లై కంపెనీ యొక్క ఆపరేటింగ్ సిస్టం కి పోటీగా మైక్రోసాఫ్ట్ విండోస్ మొదటి వెర్షన్ (Windows 1.0x) ను విడుదల చేసారు.

1987 వ సంవత్సరంలో విండోస్ రెండవ వెర్షన్ (Windows 2.0x), 1990వ సంవత్సరంలో విండోస్ మూడవ వెర్షన్ (Windows 3.0x) ను విడుదల చేసారు.

1992 లో Windows 3.1x, 1995 సంవత్సరంలో విండోస్ 95 (windows 95) ను విడుదల చేసారు

1998వ సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ విండోస్ 98 (windows 95) ను విడుదల చేసారు.

2000 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ విండోస్ మిలీనియం ఎడిషన్ (Windows Millennium Edition) ను విడుదల చేసారు.

2001 లో విండోస్ XP (Windows XP) ను మరియు 2007 వ సంవత్సరంలో విండోస్ విస్టా (Windows Vista) ను విడుదల చేసారు.

2009 వ సంవత్సరంలో Windows 7 ను మరియు 2012 లో Windows 8
ను విడుదల చేసారు.

2013 లో Windows 8.1 మరియు 2015 లో Windows 10 ఆపరేటింగ్ సిస్టం ను విడుదల చేసారు.

వ్యక్తిగత జీవితం :

బిల్ గేట్స్ కి పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. గేట్స్ యొక్క దిన చర్యలోప్రతి నిమిషం ప్లాన్ చేయబడుతుంది. గేట్స్ మెలిండా ఫ్రెంచ్ ను 1994 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.

2021 వ సంవత్సరంలో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. బిల్ గేట్స్ ప్రపంచ సంపన్నులలో ఒక్కరు.

గేట్స్ బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా చాలా పెద్ద మొత్తంలో చారిటీ కూడా చేస్తూ ఉంటారు.

Source: Bill Gates – Wikipedia

Leave a Comment