హాలోవీన్ అంటే ఏమిటి – What is Halloween in Telugu?

హాలోవీన్ ను వివిధ పేర్లతో పిలుస్తారు. ఆల్ హాలోవీన్,ఆల్ హాలోస్ ఈవ్, లేదా ఆల్ సెయింట్స్ ఈవ్ అనే పేర్లతో పిలుస్తారు. 

ఈ పండగ ను వివిధ దేశాలలో క్రైస్తవులు ప్రతి సంవత్సరం 31 అక్టోబర్ రోజున జరుపుకుంటారు. 

హాలోవీన్ ను ఎందుకు జరుపుకుంటారు ?

 పురాతన కాలంలో సెల్టిక్ (ఇండో యూరోపియన్) ప్రజలు సంహైన్ పేరుతో పండగను జరుపుకునేవారు. ఆ రోజులలో ఈ పండగను వేసవి కాలం యొక్క ముగింపును మరియు చలికాలం యొక్క ఆరంభాన్ని జరుపుకునేవారు. ఇదే పండగ తరవాత హాలోవీన్ పండగగా మారింది.  

ఆ కాలం ప్రజలు వేసవి కి మరియు చలికాలం మధ్య కొంత సమయం మనుషుల మరియు ఆత్మల ప్రపంచానికి ఒక దారి ఏర్పడుతుందని నమ్మేవారు. ఈ ఆత్మలను వెళ్లగొట్టడానికి భోగి మంటలు మరియు భయపెట్టే కాస్ట్యూమ్స్ ధరించే వారు.

ముందు కేవలం సాయంత్రం మాత్రమే జరుపుకునే ఈ పండగ కాల క్రమేణా వివిధ దేశాలకు వ్యాప్తిచెంది ఒక రోజు మొత్తం ఈ పండగను జరుపుకోసాగారు.

ఈ రోజు ట్రిక్-ఆర్-ట్రీటింగ్ (trick-or-treating), గుమ్మడికాయను చెక్కటం (jack-o-lanterns) మరియు కాస్ట్యూమ్స్ ధరించటం లాంటి ఆక్టీవిటీస్ చేస్తూ బిజీ గా ఉంటారు, అలాగే అందరూ ఒక దగ్గర చేరుతారు.

చరిత్ర : 

Halloween అనే పేరు, నవంబర్ 1 న ఆల్ హాలోస్ డే మరియు 2 వ నవంబర్ న జరుపుకునే ఆల్ సోల్స్ డే నుంచి తీసొకొవటం జరిగింది. 

ఎందుకంటే హాలోవీన్ ఆల్ హాలోస్ డే మరియు ఆల్ సోల్స్ డే కన్నా ముందు రోజు వస్తుంది కాబట్టి 31వ అక్టోబర్ సాయంత్రాన్ని హాలోవీన్ అంటారు.   

హాలోవీన్ మరియు తరవాత వచ్చే రెండు రోజులు మొత్తం మూడు రోజులను కలిపి ఆల్హాలోటైడ్ అని అంటారు. 

ఆల్ హాలోస్ డే ను సాధువుల (సెయింట్స్) గౌరవార్థం మరియు ఆల్ సోల్స్ డే ను ఇటీవలే చనిపోయి స్వర్గానికి చేరుకోబోతున్న ఆత్మల గౌరవార్థం జరుపుకుంటారు.  

Source: Halloween – Wikipedia

Leave a Comment