డిజిటల్ రూపీ అంటే ఏమిటి – What is digital rupee in Telugu?

రూపీ ను RBI ఎలాగైతే జారీ చేస్తుందో అలాగే డిజిటల్ రుపీను కూడా RBI ద్వారానే జారీ చేయబడుతుంది. డిజిటల్ రూపీ సెంట్రల్ బ్యాంకుల ద్వారా పంపిణీ చేయబడుతుంది. ఇది ఒక ప్రైవేట్ విర్చువల్ కరెన్సీ.   

రూపీ మరియు డిజిటల్ రూపీ (e-rupee) లో ఎలాంటి తేడా లేదు, మనం రోజు వినియోగించే డబ్బుల మాదిరిగానే ఉంటుంది కానీ డిజిటల్ రూపం లో ఉంటుంది అంతే.

 మిగతా డిజిటల్ క్రిప్టోకరెన్సీల మాదిరిగా డిజిటల్ రూపీ క్రిప్టోకరెన్సీ కాదు. కానీ క్రిప్టోకరెన్సీ లను ఈ రోజు మనం ఎలాగైతే ఉపయోగిస్తున్నామో అలాగే డిజిటల్ రుపీను కూడా ఉపయోగించవచ్చు.   

డిజిటల్ రూపీ ఇప్పుడు ఒక లీగల్ టెండర్ కావటం వల్ల ఏదైనా కొనుక్కునేటప్పుడు దీనిని వినియోగించవచ్చు. 

డిజిటల్ రూపీ యొక్క రెండు వెర్షన్లు ఉన్నాయి 1) బ్యాంకులు పరస్పరంగా వినియోగించటం కోసం హోల్ సేల్ వెర్షన్  2) ప్రజలు వినియోగించటానికి రిటైల్ వెర్షన్  

హిస్టరీ :

2020 వ సంవత్సరంలో RBI, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ను అమలులో తీసుకురావటానికి అధ్యయనం చేసే ఒక వర్కింగ్ గ్రూప్ ను తయారు చేసింది.    

2022 వ సంవత్సరంలో యూనియన్ బడ్జెట్ సమయంలో ప్రభుత్వం  సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ను ప్రారంభించబోతుందని ప్రకటించింది. 

CBDC అమలులోకి తీసుకురావటం వల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ అన్నారు.

CBDC బ్లాక్ చైన్ టెక్నాలజీ (Blockchain technology) పై ఆధారపడి ఉంటుంది. భారతదేశ CBDC ను e-rupee “e₹” అని పిలుస్తారు.  

డిజిటల్ రూపీ ఎవరు జారీ చేస్తారు ?

డిజిటల్ రూపీను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది మరియు కమర్షియల్ బ్యాంకులు పంపిణీ చేస్తాయి. 

2022 నవంబర్ 1వ తారీఖున తొమ్మిది బ్యాంకులు డిజిటల్ రూపీ పంపిణి  ప్రారంభించబోతున్నాయి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు HSBC. ఈ తొమ్మిది బ్యాంకులు మొదట డిజిటల్ రుపీను ప్రారంభిస్తాయి.      

డిజిటల్ చెల్లింపులకు మరియు డిజిటల్ రూపీ కి మధ్య తేడా ఏమిటి ? 

1) డిజిటల్ రూపీ తక్కువ సమయం తీసుకుంటుంది మరియు ఫెయిల్యూర్ రేటును తగ్గిస్తుంది.  UPI యొక్క ఫెయిల్యూర్ రేటు 1.2-1.3%, భారతదేశంలో అధికమొత్తంలో జరుగుతున్న లావాదేవీలతో పోలిస్తే 1.2-1.3% అనేది చాలా ఎక్కువ.   

2) ఆర్థిక సంస్థల సెక్యూరిటీలు మరియు చెల్లింపులను వేగవంతం చేస్తుంది. 

3) మిగతా పేమెంట్ సర్వీసులతో పోలిస్తే డిజిటల్ రూపీ లో కమిషన్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది.  

CBDC లను గ్లోబల్ సిస్టంలో  విలీనం చేయటం వల్ల ఇతర దేశాలతో  (క్రాస్-బార్డర్) జరిగే లావా దేవీలలో అయ్యే వ్యయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. 

డిజిటల్ రూపీ ప్రయోజనాలు:

1) బ్లాక్ చైన్ టెక్నాలజీ ను ఉపయోగించటం వల్ల డిజిటల్ రూపీ లావాదేవీల వేగాన్ని మరియు పారదర్శకతను పెంచుతుంది.

2) లావాదేవీలలో తక్కువ ఖర్చు కలుగుతుంది.

3) బ్లాక్ చైన్ లావాదేవీలకు సంబంధించిన సమాచారం ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు అందిస్తుంది.

4) ఇతర దేశాలతో కూడా వేగమైన లావాదేవీల సదుపాయం కలిగిస్తుంది.

5) కరెన్సీ నోట్లను వెంట పెట్టుకోవటం కన్నా డిజిటల్ రూపీ ను తోడు ఉంచటం చాలా సులభం.

6) ఈ కరెన్సీ లో ఎలాంటి అస్థిరత ఉండదు ఎందుకంటే RBI ద్వారా జారీ చేయబడుతుంది.

7) డిజిటల్ రూపీ ఇంటర్ నెట్ లేనప్పుడు కూడా లావాదేవీలను చేసే సదుపాయం కల్పిస్తుంది.

డిజిటల్ రూపీ ను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ?

డిజిటల్ రూపీ రిటైల్ వెర్షన్ టోకెన్ సిస్టం ను ఆధారం చేసుకొని ఉంటుంది. ఈ సిస్టం లో లావాదేవీ చేయటానికి డబ్బులు పంపేవారి ప్రైవేట్ కీ మరియు డబ్బులు తీసుకునే వారి పబ్లిక్ కీ అవసరం ఉంటుంది.

మీరు ఎవరితో అయితే లావాదేవీ చేయాలనుకుంటున్నారో వారి పబ్లిక్ కీ (public key) కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ లావాదేవీ చేయటానికి మీ వద్ద ఉన్న ప్రైవేట్ కీ (private key) పాస్ వర్డ్ లాగా పనిచేస్తుంది.

Source:1) https://rbidocs.rbi.org.in/rdocs/PublicationReport/Pdfs/CONCEPTNOTEACB531172E0B4DFC9A6E506C2C24FFB6.PDF 2) https://www.livemint.com/industry/banking/rbis-proposed-digital-rupee-10-things-to-know-11665203034030.html 3) https://www.forbes.com/advisor/in/investing/cryptocurrency/difference-between-digital-rupee-and-cryptocurrency/ 4) https://www.moneycontrol.com/news/business/explained-what-is-digital-rupee-when-will-it-come-and-hows-it-different-from-private-cryptocurrencies-10-critical-questions-answered-8029831.html

Leave a Comment