ఫెరోజ్ గాంధీ జీవిత చరిత్ర – Feroz Gandhi biography in Telugu

ఫెరోజ్ గాంధీ 12 సెప్టెంబర్ 1912 వ సంవత్సరంలో పుట్టారు. ఫెరోజ్ గాంధీ యొక్క మొత్తం పేరు ఫెరోజ్ జహంగీర్ గాంధీ (Feroze Jehangir Ghandy). ఫెరోజ్ గాంధీ ఒక స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయుడు మరియు ఒక జర్నలిస్ట్.

బాల్యం :

ఫెరోజ్ జహంగీర్ గాంధీ సెప్టెంబర్ 12 1912 వ సంవత్సరంలో, ముంబైలో నివసిస్తున్న జహంగీర్ ఫరేడూన్ గాందీ మరియు రతిమాయి అనే పార్సీ కి చెందిన దంపతులకు జన్మించాడు.

ఫెరోజ్ గాంధీ కుటుంబం ముంబై లోని ఖేత్వాడి మొహల్లాలో ఉన్న నౌరోజీ నాటకవాలా భవన్ లో ఉండేవారు. గాంధీ తన కుటుంబంలో అందరికన్నా చిన్నవాడు, తనకి ఇద్దరు అన్నలు మరియు ఇద్దరు అక్కలు ఉన్నారు.

గాంధీ యొక్క తండ్రి కిలిక్ నిక్సన్ కంపెనీ లో మరీన్ ఇంజనీర్ మరియు వారెంట్ ఇంజనీర్ గా పనిచేసారు.

ఫెరోజ్ గాంధీ తాత భరూచ్ (గుజరాత్) కి చెందిన వారు కానీ ముంబై లో వచ్చి స్థిరపడ్డారు. ఇప్పటికీ గాంధీ యొక్క తాత ఇల్లు అక్కడ ఉంది.

చిన్న వయస్సులో తండ్రి చనిపోవటం తో ఫిరోజ్ గాంధీ తన అమ్మ తో కలిసి అలహాబాద్ లో నివసిస్తున్న తన చిన్నమ్మ వద్ద వెళ్లి నివసించసాగారు.

ఫిరోజ్ గాంధీ చిన్నమ్మ డఫెరిన్ హాస్పిటల్ లో సర్జన్ గా పనిచేసేవారు. ఫిరోజ్ గాంధీ తన స్కూల్ చదువును విద్యా మందిర్ హై స్కూల్ నుంచి పూర్తి చేసారు, గ్రాడ్యుయేషన్ ను ఎవింగ్ క్రిస్టియన్ కళాశాల నుంచి పూర్తి చేసారు.

కెరీర్ :

ఎవింగ్ క్రిస్టియన్ కళాశాలలో గాంధీ చదువుతున్నప్పుడు కాలేజ్ బయట స్వాతంత్ర పోరాటం కోసం ప్రదర్శనలు కమల నెహ్రు మరియు ఇందిరా గాంధీ ను చూడటం జరుగుతుంది.

ప్రదర్శనలు చేస్తున్న సమయంలో ఎండ ఎక్కువగా ఉండటంతో కమలా నెహ్రు మూర్ఛపోతుంది. ఈ ఘటన చుసిన ఫెరోజ్ గాంధీ కమలా నెహ్రు కి సహాయం చేస్తారు.

గాంధీజీ ద్వారా ప్రభావితుడైన ఫిరోజ్ గాంధీ ఆ మరుసటి రోజు తన చదువును మానేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. తన పేరు లో ఉన్న gandy ను gandhi గా మార్చుకున్నారు.

స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు గాను 1930 సంవత్సరంలో 19 నెలల జైలు శిక్షను అనుభవించారు. 1932 మరియు 1933 సంవత్సరాలలో కూడా నెహ్రు గారి తో కలిసి పనిచేస్తున్న సమయంలో జైలుపాలయ్యారు.

పెళ్లి :

ఇందిరా గాంధీ కి 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఫెరోజ్ గాంధీ ఆమె పట్ల ఉన్న తన ప్రేమను వ్యక్తం చేసాడు.

ఆ సమయంలో ఇందిరా గాంధీ వయస్సులో చిన్నది కావటం తో తల్లి కమలా నెహ్రు నిరాకరించారు.

తన ప్రేమను నిరాకరించిన తరవాత కూడా నెహ్రు కుటుంబంతో ఫెరోజ్ గాంధీ సన్నిహితంగా ఉండేవాడు.

కమల నెహ్రు టీబీ తో భాదపడుతున్న సమయంలో చాలా సహాయం చేసాడు, చివరికి 1936 వ సంవత్సరంలో కమల నెహ్రు చనిపోతున్న సమయంలో కూడా ఫెరోజ్ అక్కడే ఉన్నాడు.

తల్లి చనిపోయిన తరవాత ఇందిరా గాంధీ ఫెరోజ్ గాంధీ దగ్గరయ్యారు. 1942 వ సంవత్సరంలో ఈ జంట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకున్నారు.

నెహ్రు ఈ పెళ్ళికి ముందు వ్యతిరేకం తెలుపుతారు కానీ పెళ్ళైన ఆరు నేలలకే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొతున్న సమయం లో ఫెరోజ్ గాంధీ ఆరు నెలలు జైలు పాలయ్యారు.

జైలు నుంచి బయటికి వచ్చిన తరవాత ఇద్దరు దంపతులు కలిసి ఉండసాగారు. వీరికి 1944 సంవత్సరంలో రాజీవ్ మరియు 1946 వ సంవత్సరంలో సంజయ్ ఇద్దరు కుమారులు పుట్టారు.

స్వాతంత్రం తరవాత :

స్వాతంత్రం తరవాత జవహర్ లాల్ నెహ్రు ప్రధాన మంత్రి అయ్యారు.ఫెరోజ్ మరియు ఇందిరా గాంధీ ఇద్దరు అలహాబాద్ లో ఇద్దరు పిల్లలతో నివసించసాగారు.

నెహ్రు ద్వారా స్థాపించబడ్డ నేషనల్ హెరాల్డ్ అనే వార్త పత్రికకు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసారు.

స్వాతంత్రం తరవాత జరిగిన మొట్ట మొదటి ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నియోజక వర్గం నుంచి గెలిచారు.

తన మావయ్య అయిన నెహ్రు ప్రభుత్వం లో జరిగే అవినీతి గురించి మాట్లాడసాగారు.

1957 సంవత్సరంలో జరిగిన ఎన్నికలల్లో కూడా ఫెరోజ్ గాంధీ గెలిచారు.రెండో సారి గెలిచినా తరవాత కూడా ప్రభుత్వం లో జరిగే అవక తవకలపై పలు సార్లు సవాల్ చేసారు.

ఇదే సమయం లో ఇందిరా మరియు ఫెరోజ్ గాంధీ మధ్య విబేధాలు వచ్చాయి.

మరణం:

1958 వ సంవత్సరంలో ఫెరోజ్ గాంధీ కి గుండె పోటు వచ్చింది. తండ్రితో పాటు నివసిస్తున్న ఇందిరా గాంధీ ఫెరోజ్ గాంధీ ఆరోగ్యాన్ని చూసుకోవటానికి వస్తారు.

1960 వ సంవత్సరం లో రెండో సారి గుండెపోటు వచ్చినప్పుడు ఢిల్లీ లోని విల్లింగ్‌డన్ హాస్పిటల్ లో తన తుది శ్వాస విడిచారు.

తన పార్థివ శరీరాన్ని దహనం చేసి బూడిదను అలహాబాద్ లోని పార్సీ స్మశానవాటికలో పూడ్చిపెట్టారు.

ఫెరోజ్ గాంధీ చనిపోయిన తరవాత రాయ్ బరేలీ లోక్ సభ నియోజక వర్గం నుంచి తన కోడలు అయిన సోనియా గాంధీ పోటీ చేసారు.

రాయ్ బరేలి లో ఉన్నత విద్యా పాఠశాల ను స్థాపించటంలో తానూ చేసిన కృషికి గాను దానికి ఫెరోజ్ గాంధీ కాలేజీ అని పేరు పెట్టారు.

Source: Feroze Gandhi – Wikipedia

Leave a Comment