స్వరూపానంద సరస్వతి జీవిత చరిత్ర – Swaroopanand Saraswati Biography in Telugu

స్వామి స్వరూపానంద సరస్వతి భారతదేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు. 1982 వ సంవత్సరంలో గుజరాత్, ద్వారకా లోని ద్వారకా శారదా పీఠానికి శంకరా చార్యులు అయ్యారు. అలాగే ఉత్తరాకాండ్, బద్రీనాథ్ నగరంలో ఉన్న జ్యోతిర్ మఠ్ కి శంకరాచార్యులు అయ్యారు.

బాల్యం :

స్వరూపానంద సరస్వతి 1924 వ సంవత్సరంలో మధ్యప్రదేశ్, సియోని జిల్లా లోని ఒక గ్రామంలో జన్మించారు. పుట్టినప్పుడు తల్లి తండ్రులు పోతిరామ్ ఉపాధ్యాయ్ అని పేరు పెట్టారు.

1942 సంవత్సరం, 19 సంవత్సరాల వయస్సు లో స్వరూపానంద సరస్వతి క్విట్ ఇండియా ఉద్యమం లో కూడా పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడు. ఆ రోజుల్లో ఇతనిని విప్లవ సాధువు గా పిలిచేవారు.

ఉద్యమాలలో పాల్గొన్నందుకు 9 నెలలు జైలు శిక్ష పాలయ్యారు.

శంకరా చార్యులుగా :

26 సంవత్సరాల వయస్సులో గురు బ్రహ్మానంద తనని దండి సన్యాసి గా మార్చారు.

స్వామి స్వరూపానంద సరస్వతి జ్యోతిర్ మఠ్ యొక్క శంకరా చార్యులు బ్రహ్మానంద సరస్వతి యొక్క శిష్యుడు.

అలాగే జ్యోతిర్ మఠ్ కి చెందిన శంకరా చార్యులు కృష్ణబోధ యొక్క శిష్యుడు.

స్వామి కరపత్రి (హరిహరానంద సరస్వతి) ద్వారా స్థాపించబడ్డ అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషత్ కు అధ్యక్షుడి గా కూడా ఉన్నారు.

1973 సంవత్సరంలో బద్రీనాథ్ లోని జ్యోతిర్ మఠ్ కి శంకరా చార్యులుగ నియమించ బడ్డారు.

1982 వ సంవత్సరంలో ద్వారకా పీఠం యొక్క అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

స్వామి స్వరూపానంద సరస్వతి అభిప్రాయాలు:

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ గంగ నది పై రెండు డ్యామ్ లు నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు 2012 వ సంవత్సరంలో తన వ్యతిరేకత చూపించారు.

డ్యాంలు నిర్మించటం వల్ల గంగా నది సిమెంట్ తో తయారైన గోడల మధ్యలో ఉండిపోతుందని, ఫలితంగా గంగా నది లో ఉండే ఖనిజాలు కోల్పుతామని చెప్పారు.

గంగా నది సహజంగా ప్రవహిస్తేనే మంచిది అని పేర్కొన్నారు.

ఆర్టికల్ 370:

2014 వ సంవత్సరంలో స్వామి స్వరూపానంద జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 ను తొలగించాలని చెప్పారు.

ఈ ఆర్టికల్ ను తొలగించటం వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు.

కాశ్మీర్ పండితులు తిరిగి అక్కడికి వెళ్ళినప్పుడే అక్కడ దేశ వ్యతిరేక చర్యలు ఆగుతాయని పేర్కొన్నారు.

ఆవుల రక్షణ & బీఫ్ ఎగుమతి :

2015 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం గో హత్య లపై విధించిన నిషేధాన్ని స్వామి స్వరూపానంద ప్రశంసించారు. 12 కోట్ల కంటే అధికంగా గో హత్యలు జరుగుతూన్నాయని, గో హత్యలు ఆపటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. పెరిగే పాల ఉత్పత్తి పేద పిల్లల ఆకలి తీరుస్తుందని చెప్పారు.

భారత దేశంలో ఎక్కువగా హిందువులు ఉన్న తరవాత కూడా గో హత్యలు జరుగుతున్నాయని. కొంత మంది ముస్లిం లను సంతోష పెట్టడానికి గో హత్యలకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పారు.

పాలలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని, అందరికీ పాలు లభించాలంటే గో హత్యలపై నిషేధం విధించాలని చెప్పారు.

2016 వ సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశానికి చెందిన RSS కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు ” RSS కార్యకర్తలు మతం కోసం పనిచేస్తామని చూపిస్తారు కానీ కార్యకర్తలే బీఫ్ తింటారు” అని చెప్పారు.

మహిళల శని పూజ :

2016 వ సంవత్సరంలో, మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ నగరంలోని శని శింగనాపూర్ దేవాలయం యొక్క గర్భ గుడిలో ప్రవేశించడానికి కొంత మంది స్త్రీ వాదులు (ఫెమినిస్ట్ లు) ప్రయత్నిస్తారు.

ఈ విషయం పై స్వామి స్వరూపానంద స్పందిస్తూ ” శని ఒక క్రూరమైన గ్రహం అని, శని ప్రభావం మహిళలకు చాలా హాని కలిగిస్తుందని చెప్పారు.

మహిళలు ఈ గుడి లో ప్రవేశించటం వల్ల మహిళలపై దాడులు మరియు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు.

ISKCON (International Society for Krishna Consciousness):

2016 వ సంవత్సరంలో ISKCON తనను తానూ సనాతన ధర్మం యొక్క భాగం అని దావా చేస్తుందని అని దానిపై స్వామి స్వరూపానందా అభిప్రాయం అడిగారు.

ఈ ప్రశ్నకు బదులుగుగా జవాబు ఇస్తూ ఇలా అన్నారు ” ISKCON మనీ లాండరింగ్ చేస్తుందని, ఇండియాలో వసూలు చేసిన డబ్బును అమెరికా పంపిస్తున్నారని” తెలిపారు.

వాళ్ళు నిజాయితీగా పని చేస్తున్నట్లైతే ముందు నుంచే మందిరాలు ఉన్న ప్రాంతాలలో కాకుండా మందిరాలు లేని ప్రదేశాలైన అస్సాం మరియు ఛత్తీస్ గడ్ లో నిర్మించేవారని తెలిపారు.

RSS & BJP & కాంగ్రెస్ :

2015 సంవత్సరంలో స్వామి స్వరూపానందా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ ” ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లంచాన్ని నిర్ములిస్తానని చెప్పినప్పటికీ దేశమంతటా లంచాలు తీసుకునే వారు చాలా పెరిగిపోయారని” చెప్పారు.

2016 వ సంవత్సరంలో RSS గురించి మాట్లాడుతూ ” RSS హిందువుల గురించి మాట్లాడుతారు కానీ హిందుత్వ గురించి వారిలో నిబద్దత లేదు. తాము హిందువులను కాపాడానికి ఉన్నామని చెప్పి మోసగిస్తున్నారు, అది ఇంకా ప్రమాదం. ఇంతకు ముందు ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో గో హత్యలు జరిగేవి బీజేపీ హయాంలో కూడా గో హత్యలు జరుగుతున్నాయి. రెండు పార్టీలలో ఏంటి తేడా ? ” అని ప్రశ్నించారు.

PK:

2014 లో రిలీజ్ అయిన PK సినిమా గురించి మాట్లాడుతూ సెన్సార్ బోర్డు ఈ సినిమా కి ఎలా అనుమతి ఇచ్చింది, ఈ విషయం పై CBI విచారణ జరపాలని కోరారు.

మరణం :

11 సెప్టెంబర్ 2022 వ సంవత్సరం, మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ లో 98 సంవత్సరాల వయస్సులో స్వామి స్వరూపానంద సరస్వతి తన తుది శ్వాసను విడిచారు.

Source: https://en.wikipedia.org/wiki/Swaroopanand_Saraswati

Leave a Comment