కృష్ణం రాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. 20 వ జనవరి 1940 వ సంవత్సరంలో జన్మించారు. కృష్ణం రాజు భారతదేశ సినిమా లోని టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటుడు. సినీ ప్రపంచంలో ఇతనిని రెబెల్ స్టార్ అని కూడా పిలుస్తారు.
1998 సంవత్సరంలో తన రాజకీయ జీవితాన్ని బీజేపీ పార్టీ తో ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికలలో కాకినాడ నుంచి భారీ మెజారిటీ తో గెలిచారు. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలో మంత్రిగా కూడా పనిచేసారు.
Table of Contents
బాల్యం :
కృష్ణం రాజు జనవరి 20 1940 సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు గ్రామంలో జన్మించారు.
కెరీర్ :
కృష్ణం రాజు టాలీవుడ్ ఇండస్ట్రీ లో 1966 వ సంవత్సరంలో తన మొట్ట మొదటి సినిమా చిలక గోరింకా సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది, కృష్ణం రాజుకు నంది అవార్డు కూడా లభించింది.
1967 వ సంవత్సరంలో N.T రామారావు తో కలిసి శ్రీ కృష్ణావతారం సినిమాలో నటించారు.
1968 వ సంవత్సరంలో కృష్ణం రాజు నటించిన నేనంటే నేనే సినిమా లో విలన్ గా నటించారు.
1969 – భలే అబ్బాయిలు , భలే మాస్టర్, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి.
1970 – మల్లి పెళ్లి, జై జవాన్, అమ్మ కోసం, తాళి బొట్టు, పెళ్లి సంబంధం, పెళ్లి కూతురు, అల్లుడే మేనల్లుడు, ద్రోహి.
1971: పవిత్ర బంధం, అనురాధ, భాగ్యవంతుడు, బంగారు తల్లి.
1972: సభాష్ వదిన, మహమ్మద్ బిన్ తుగ్లక్, రైతు కుటుంబం, రాజ్ మహల్, అంత మన మంచికే, మంచి రోజులు వచ్చాయి, హంతకులు దేవాంతకులు, మానవుడు దానవుడు, భలే మోసగాడు, నీతి నిజాయితీ, వింత దంపతులు, ఇన్‌స్పెక్టర్ భార్య, పంతులు ఈ బేబీ, సభలు, సభలు ఊరికి ఉపకారి.
1973: బాల మిత్రుల కథ, స్త్రీ, జీవన తరంగాలు, జీవితం, వాడే వీడు, తల్లి కొడుకులు, శ్రీవారు మావారు, స్నేహ బంధం, గాంధీ పుట్టిన దేశం, మమత, మాయదారి మల్లిగాడు, విశాలి, ఇంటి దొంగలు, మేము మనుషులమే, పూలమాల, అభిమానవంతులు.
1974: పల్లెటూరి చిన్నోడు, జీవితరంగం, గుండెలు తీసిన మొనగాడు, మనుషుల్లో దేవుడు, చందన, స్త్రీ గౌరవం, తులసి, బంట్రోతు భార్య, అనగనగా ఒక తండ్రి, కృష్ణవేణి, నిత్య సుమంగళి, ఆడపిల్ల తండ్రి, ఇంటి కోడలు, హారతి, పల్లె పడుచు, జీవితసాయం.
1975: పరివర్తన, మొగుడా? పెళ్లామా?, పుట్టింటి గౌరవం, భారతి,నాకు స్వతంత్రం వచ్చింది.
1976: ఇద్దరు ఇద్దరే, యవ్వనం కాటేసింది, భక్త కన్నప్ప, ఆడవాళ్లు ఆపనిందలు, అమ్మ నాన్న, సుప్రభాతం, మంచికి మరో పేరు
1977: కురుక్షేత్రం, ఒకే రక్తం, గీత సంగీతం, మహానుభావుడు, భలే అల్లుడు, అమరదీపం, జీవన తీరాలు, మనుషులు చేసిన దొంగలు.
1978: సతీ సావిత్రి, మంచి మనసు, కటకటాల రుద్రయ్య, మన వూరి పాండవులు, రాముడు రంగడు.
1979: రామబాణం, కమలమ్మ కంటాం, చేయెత్తి జైకొట్టు, అందదు ఆగడు, రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయము.
1980: శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి, అల్లుడు పట్టిన భరతం, సీతా రాములు, బెబ్బులి, ప్రేమ తరంగాలు.
1981: ఆడవాళ్ళు మీకు జోహార్లు, అగ్ని పూలు, పులి బిడ్డ, టాక్సీ డ్రైవర్, రగిలే జ్వాలా, గువ్వలా జంట, రామ లక్ష్మణులు.
1982: మధుర స్వప్నం, తల్లి కొడుకుల అనుబంధం, నిప్పుతో చెలగాటం, గోల్కొండ అబ్బులు, జగ్గు, ప్రళయ రుద్రుడు, త్రిశూలం.
1983: నిజం చెబితే నేరమా, అడవి సింహాలు, పులి బెబ్బులి, కోటికొక్కడు, ధర్మాత్ముడు.
1984: యుద్ధం, సర్దార్, బాబులుగాడి దెబ్బ, కొండవీటి నాగులు, C.P. భయంకర్, బొబ్బిలి బ్రహ్మన్న, రారాజు, భారతంలో శంఖారావం, రౌడీ.
1985: బండి, తిరుగుబాటు, అగ్గి రాజు, బుల్లెట్.
1986: ఉక్కు మనిషి, రావణ బ్రహ్మ, నేతి యుగ ధర్మం, ఉగ్ర నరసింహం, తాండ్ర పాపారాయుడు.
1987: బ్రహ్మ నాయుడు, సర్దార్ ధర్మన్న, త్రిమూర్తులు, మరణ శాసనం, విశ్వనాథ నాయకుడు, మరణ హోమం, కిరాయి దాదా.
1988: మా ఇంటి మహారాజు, అంతిమ తీర్పు, పృథ్వీరాజ్, ప్రచండ భారతం, ధర్మ తేజ, ప్రాణ స్నేహితులు
1989: సింహ స్వప్నం, శ్రీరామచంద్రుడు, పాపే మా ప్రాణం, భగవాన్, సుమంగళి, టూ టౌన్ రౌడీ.
1990: గురు శిష్యులు, యమ ధర్మ రాజు, నేతి సిద్ధార్థ.
1991: ఇంద్రభవనం, విధాత.
1993: బావ బావమరిది, అన్న వదిన
1994: జైలర్ గారి అబ్బాయి, అందరు అందరే, గ్యాంగ్‌మాస్టర్, పల్నాటి పౌరుషం, రిక్ష రుద్రయ్య.
1995: సింహ గర్జన, నాయకుడు
1996: నాయుడు గారి కుటుంబం, తాత మనవడు
1997: కుటుంబ గౌరవం, మా నాన్నకి పెళ్లి, హాయ్ బెంగుళూరు, సింహాద మరి
1998: ఖైదీ గారు.
1999: సుల్తాన్
2000: వంశోద్ధారకుడు
2003: నీకు నేను నాకు నువ్వు
2006: రామ్
2009: శ్రీశైలం, బిల్లా, సమర్థుడు
2010: నా పేరు అమృత, తకిట తకిట
2012: రెబెల్
2013: చండీ
2015: ఎవడే సుబ్రహ్మణ్యం, రుద్రమదేవి
2022: రాధే శ్యామ్
ఇలా 183 కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు.
రాజకీయ జీవితం :
కృష్ణం రాజు 1992వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నరసాపురం ఎన్నికలలో పోటీ చేసారు.
1998 వ సంవత్సరంలో లోక్ సభ ఎన్నికలలో కాకినాడ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలిచారు.
1998 నుంచి 1999 సంవత్సరాలలో సమాచారం మరియు ప్రసారం మరియు వాణిజ్యం మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖలలో అడ్వైసర్ కమిటీ లో ఉన్నారు.
2009 వ సంవత్సరంలో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ నుంచి ఎన్నికలలో పోటీ చేసారు.
రాజమండ్రి నియోజకవర్గం నుంచి MP సీట్ కు పోటీ చేసిన కృష్ణం రాజు కి ఓటమి ఎదురయ్యింది.
వ్యక్తిగత జీవితం :
కృష్ణం రాజు మొదట సీత దేవి ను పెళ్లి చేసున్నారు. సీత దేవి చనిపోయిన తరవాత 1996 సంవత్సరంలో శ్యామల దేవి ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 3 కూతుళ్ళు ఉన్నారు.
టాలీవుడ్ హీరో ప్రభాస్ కి కృష్ణం రాజు పెదనాన్న అవుతాడు.
మరణం :
అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు 11 వ సెప్టెంబర్ 2022 వ సంవత్సరంలో 82 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు.
అవార్డులు :
1977 – ఉత్తమ నటుడు (అమరదీపం)
1983- స్పెషల్ జ్యూరీ అవార్డు (ధర్మాత్ముడు)
1984- ఉత్తమ నటుడు (బొబ్బిలి బ్రహ్మన్న)
1986- ఉత్తమ నటుడు (తాండ్ర పాపారాయుడు)
2006 – ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
Source: Krishnam Raju – Wikipedia