ఎలిజబెత్ 2 యునైటెడ్ కింగ్డమ్ మరియు కామన్వెల్త్ రాజ్యాల యొక్క రాణి. ఫిబ్రవరి 6 1952 వ సంవత్సరం నుంచి 8 సెప్టెంబర్ 2022 వరకు మహారాణి గా మొత్తం 70 సంవత్సరాల 214 రోజుల పాలనా చేసింది.
బ్రిటిష్ రాజ్యంలో పాలన చేసిన రాజులలో ఎలిజబెత్ రాణి ఎక్కువ సంవత్సరాలు పాలన చేసిన రాజులలో మొదటి స్థానంలో నిలిచారు.
ప్రపంచంలో ఎక్కువ రోజులు పాలన చేసిన రాజులలో ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ XIV 72 సంవత్సరాల 110 రోజులు పాలన చేసి మొదటి స్థానంలో ఉండగా ఎలిజబెత్ రెండవ స్థానంలో నిలిచారు.
కామన్వెల్త్ రాజ్యాలలో మొత్తం 56 సార్వ భౌమ దేశాలు ఉన్నాయి. వీటిలో 52 దేశాలను బ్రిటిష్ ప్రభుత్వం ఒకప్పుడు పాలించింది.
15 కామన్వెల్త్ రాజ్యాలు ఎలిజబెత్ ను రాణి గా స్వీకరించాయి మరియు మిగతా దేశాలు కేవలం కామన్వెల్త్ రాజ్యం యొక్క భాగంగా ఉన్నాయి.
Table of Contents
బాల్యం :
ఎలిజబెత్ II 21 ఏప్రిల్ 1926 సంవత్సరంలో కింగ్ జార్జ్ VI మరియు రాణి ఎలిజబెత్ కి పుట్టారు. ఈ దంపతులు పుట్టిన బిడ్డ పేరును తల్లి మరియు రాణి అయిన ఎలిజబెత్ పేరు మీదగా ఎలిజబెత్ అని గ్రేట్ గ్రాండ్ మదర్ పేరు మీదుగా అలెగ్జాండ్రా అని మరియు నానమ్మ పేరు మీదుగా మేరీ అని పూర్తి పేరును ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ (Elizabeth Alexandra Mary) అని పెట్టారు.
చిన్నతనంలో తనను కుటుంబంలో లిలిబెట్ అని ముద్దుగా పిలిచేవారు. ఎలిజబెత్ తన తాత కింగ్ జార్జ్ V (King George V) యొక్క పాలనలో పుట్టారు. తన తాత తరవాత తండ్రి రాజు గా ఎన్నుకోబడ్డారు. చిన్నతనంలో తన తాత ను ముద్దుగా ఇంగ్లాండ్ తాత “Grandpa England” అని పిలిచేవారు.
ఎలిజబెత్ కి ఒకే ఒక చెల్లెలు ఉంది తన పేరు యువరాణి మార్గరెట్. ఎలిజబెత్ మరియు మార్గరెట్ ఇద్దరు కలిసి ఇంటి వద్దే తమ చదువును పూర్తి చేసారు.
పాలన కి ముందు :
ఎలిజబెత్ పుట్టిన సమయంలో తన తాత పాలన ఉండేది. తాత అనారోగ్యం కారణంగా భాదపడుతూ ఉండటం వల్ల తరవాత అవ్వబోయే రాజులలో పెదనాన్న ఎడ్వర్డ్ మరియు తన తండ్రి జార్జ్ ఉన్నారు.
తాత చనిపోయిన తరవాత పెదనాన్న ఎడ్వర్డ్ రాజు గా ఎన్నుకోబడ్డారు. రాజు ఎడ్వర్డ్ విధవ అయిన వాలిస్ సింప్సన్ ను పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయం తీసుకున్నప్పుడు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది.
చివరకి రాజు ఎడ్వర్డ్ స్థానంలో ఎలిజబెత్ తండ్రి జార్జ్ తన తండ్రి యొక్క లెగసీ ను కొనసాగిస్తూ రాజు (George VI) గా ఎన్నుకోబడ్డారు. రాజు జార్జ్ VI కి కొడుకులు లేకపోవటం వల్ల తన తరవాత రాణి గా ఎలిజబెత్ ను ఎన్నుకున్నారు.
1939 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యువరాణులు ఎలిజబెత్ మరియు మార్గరెట్ లను కెనడా తరలించాలని కోరగా రాణి ఎలిజబెత్ “నా పిల్లలు నన్ను వదిలి వెళ్లరు, నేను నా రాజు ను వదిలి వెళ్ళను, రాజు ఎప్పుడూ వదిలి వెళ్ళడు” అని అంది.
1940 వ సంవత్సరంలో 14 సంవత్సరాల ఎలిజబెత్ మొదటిసారి బీబీసీ రేడియో లో చిన్న పిల్లలను సంబోధిస్తూ మేము మా తరపు నుంచి మన సైనికులకు చేయగలిగినదంతా సహాయం చేయటానికి ప్రయత్నిస్తున్నాము, చివరికి అంతా మంచి జరుగుతుందని ధైర్యం చెప్పారు.
1943 సంవత్సరంలో ఎలిజబెత్ సైనికాధికారి గా భాద్యతలు స్వీకరించి మొదటిసారిగా బహిరంగంగా బయటికి వచ్చింది. తన 18వ పుట్టిన రోజున బ్రిటిష్ పార్లమెంట్ ఎలిజబెత్ ను 5 రాష్ట్ర సలహాదారులులలో ఒకరిగా నియమించారు.
తన తండ్రి ఏదైనా కారణంతో గైర్హాజరు అయినప్పుడు ఎలిజబెత్ భాద్యతలు స్వీకరించవచ్చు అని అప్పట్లో ఉన్న చట్టాలను మార్చటం జరిగింది.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన ఎలిజబెత్ మరియు మార్గరెట్ ఇద్దరు యువరాణులు ప్రజలు గమనించకుండా వీధులలోకి వెళ్లి ప్రజలతో పాటు విజయాన్ని జరుపుకున్నారు.
1947 వ సంవత్సరంలో దక్షిణ ఆఫ్రికా లో తన మొట్ట మొదటి విదేశీ పర్యటన చేసారు.
పెళ్లి :
ఎలిజబెత్ తనకు కాబోయే భర్త అయిన ప్రిన్స్ ఫిలిప్ ను 1934 లో కలిసారు. ప్రిన్స్ ఫిలిప్ గ్రీస్ మరియు డెన్మార్క్ యొక్క రాజుగా ఉన్నారు. వరుసకు దూరపు బంధువు అయిన ఫిలిప్ తో 13 సంవత్సరాల వయస్సులోనే ఎలిజబెత్ ప్రేమలో పడ్డారు.
ఎలిజబెత్ మరియు ఫిలిప్ 20 నవంబర్ 1947 వ సంవత్సరంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు కొడుకులు మరియు ఒక కూతురు తో కలిపి మొత్తం 4 పిల్లలు పుట్టారు.
పాలన :
తండ్రి ఆరోగ్యం సరిగా ఉండక పోవటం వల్ల తండ్రికి బదులు ఎలిజబెత్ బాధ్యతలు స్వీకరించేవారు. 1951 వ సంవత్సరంలో ఎలిజబెత్ కెనడా ప్రెసిడెంట్ ను కలవటానికి వెళ్ళినప్పుడు ఒక వేళ తన తండ్రి చనిపోతే ఎలిజబెత్ రాణి గా బాధ్యతలు స్వీకరించాలని తన పర్సనల్ సెకెరేటరీ ఒక డ్రాఫ్ట్ తీసుకురావటం జరిగింది.
1952 వ సంవత్సరంలో తన భర్త ఫిలిప్ తో విదేశీ పర్యటన నిమిత్తం కెన్యాలో ఉన్నప్పుడు రాజు George VI తన తుది శ్వాస విడిచారని తెలిసింది. అదేరోజు వెంటనే ఎలిజబెత్ రాణి గా భాద్యతలను స్వీకరించింది.
ఎలిజబెత్ పుట్టినప్పటి నుంచి కామన్వెల్త్ దేశాల స్థాపన జరగడం మొదలయ్యింది.
1953 వ సంవత్సరంలో తన భర్త తో కలిసి ఏడు నెలల ప్రపంచ యాత్రను 13 దేశాలలో చేసారు.
1956 వ సంవత్సరంలో బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ కలిసి ఈజిప్ట్ వద్ద ఉన్న సూయజ్ కెనాల్పై దండయాత్రను చేసి విఫలమయ్యాయి. ఎలిజబెత్ ఈ దండయాత్రకు వ్యతిరేకత చూపించింది.
1957 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ పర్యటన చేసారు.
1961 సంవత్సరంలో శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్ మరియు ఇరాన్ దేశాలను పర్యటించారు.
1960 నుంచి 1970 సంవత్సరాల మధ్య బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 20 దేశాలు స్వాతంత్య్రాన్ని పొందాయి.
1972 సంవత్సరంలో యుగోస్లేవియా దేశం లో పర్యటన చేసారు. కమ్యూనిస్ట్ దేశాన్ని పర్యటించిన మొదటి బ్రిటిష్ పాలకురాలిగా నిలిచింది.
1977 సంవత్సరంలో ఎలిజబెత్ తన పాలన యొక్క సిల్వర్ జూబ్లీ ను పూర్తిచేసుకుంది.
1981 సంవత్సరంలో ట్రూపింగ్ ది కలర్ వేడుకలలో గుర్రపు సవారి చేస్తుండగా 17 సంవత్సరాల కుర్రాడు 6 బ్లాంక్ షాట్స్ రాణి పై ఫైర్ చేసాడు.
1986 వ సంవత్సరంలో చైనా దేశ పర్యటన చేసి బ్రిటిష్ రాజ్యం నుంచి మొదటి సారి పర్యటించిన పాలకురాలు అయ్యింది.
1994 సంవత్సరంలో రష్యా దేశ పర్యటన చేసి బ్రిటిష్ రాజ్యం నుంచి మొదటి సారి పర్యటించిన పాలకురాలు అయ్యింది.
1997 సంవత్సరంలో ఎలిజబెత్ కోడలు డయానా కార్ క్రాష్ లో చనిపోయింది.
అక్టోబర్, 1997 వ సంవత్సరంలో రాణి ఇండియా కు వచ్చినప్పుడు జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన ప్రాంతానికి వెళ్లి నివాళులు అర్పించారు. అక్కడికి వచ్చిన కొంత మంది రాణి కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
2002 వ సంవత్సరంలో రాణి గోల్డెన్ జూబ్లీ ను పూర్తిచేసుకున్నారు.
2012 వ సంవత్సరంలో ఎలిజబెత్ డైమండ్ జూబ్లీ ను పూర్తిచేసుకున్నారు.
2022 వ సంవత్సరంలో ఎలిజబెత్ రాణి గా 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని తన ప్లాటినం జూబ్లీ ను పూర్తి చేసుకున్నారు.
మరణం :
సెప్టెంబర్ 8, 2022 వ సంవత్సరంలో రాణి ఎలిజబెత్ యొక్క ఆరోగ్యం బాగా క్షీణించిన తరవాత డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
విషయం తెలుసుకున్నరాజా నివాసం అయిన బకింగ్‌హామ్ ప్యాలెస్ రాణి యొక్క సంతానం చేరుకున్నారు.
ఇదే రోజు సాయంత్రం రాణి ఎలిజబెత్ II తన తుదిశ్వాస విడిచారని అధికారికంగా ప్రకటించారు.
Source: Elizabeth II – Wikipedia