భూపేన్ హజారికా జీవిత చరిత్ర – Bhupen Hazarika Biography in Telugu

భూపేన్ హజారికా భారత దేశానికి చెందిన సంగీతకారుడు, ప్లే బ్యాక్ సింగర్, కవి, నటుడు, లిరిక్స్ రైటర్ మరియు చిత్ర నిర్మాత.

హజారీకా అస్సామీ భాషలో రాసి పాడిన పాటలు మానవత్వాన్ని మరియు సోదరభావం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. తన ఈ పాటలు ఇతర భాషలలో అనువాదం చేసి పాడటం కూడా జరిగింది. హిందీ మరియు బెంగాలీ భాషలో ఎక్కువగా అనువాదం చేయటం జరిగింది.

హజారికా మత సామరస్యం, సానుభూతి మరియు న్యాయం లాంటి విషయాలను ఆధారం చేసుకొని పాడిన పాటలు అస్సాం, బాంగ్లాదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ లో ప్రాచుర్యం పొందాయి.

భారతదేశంలో ముందు నుంచే ఈశాన్య భారతదేశానికి పెద్దగా గుర్తింపు లేదు. కొంత మంది అయితే ఈశాన్య రాష్ట్రాలు భారత దేశానికి చెందనివిగా ప్రవిస్తారని ఆరోపణలు ఉన్నాయి.

భూపేన్ హజారికా అస్సాం కి చెందిన సంస్కృతీ మరియు జానపద సంగీతం ను మరియు ఈశాన్య భారతదేశం ను హిందీ సినిమా కు పరిచయం చేసారు.

బాల్యం :

హజారికా 1926 వ సంవత్సరంలో సెప్టెంబర్ 8 వ తారీఖున నీలకంఠ మరియు శాంతి ప్రియా హజారికా దంపతులకు అస్సాం లోని సాదియ పట్టణంలో జన్మించారు.

హజారికా చిన్న తనంలోనే తన తల్లి ద్వారా అస్సాం కి చెందిన సాంప్రదాయక లాలి పాటలను వినేవారు . చిన్న తనంలో తల్లి పాడిన లాలీ పాటలు ఒక రకంగా సంగీతంపై ఆసక్తిని పెంచాయి.

భూపేన్ హజారికా చిన్న తనంలో తన తండ్రి మంచి జీవనోపాధి కోసం పలు ప్రాంతాలు మారారు. ఇలా హజారికా బాల్యం వివిధ ప్రాంతాలలో గడిపారు.

చదువు :

హజారికా గౌహాటీ లోని సోనారాం ఉన్నత పాఠశాల మరియు దుబ్రి ప్రభుత్వ పాఠశాలలలో చదివారు. 1940 వ సంవత్సరంలో తేజపూర్ హైస్కూల్ నుంచి మెట్రిక్యూలేషన్ పూర్తి చేసారు.

1942 వ సంవత్సరం కాటన్ కాలేజి నుంచి ఇంటర్మీడియట్ చదువును మరియు బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో BA మరియు MA చదువును పూర్తి చేసారు.

కొలంబియా యూనివర్సిటీ లో స్కాలర్ షిప్ వచ్చిన తరవాత 1949 సంవత్సరంలో PHD చేయటానికి న్యూయార్క్ వెళ్లారు.

న్యూయార్క్ లో చదివే సమయంలో హజారికా పౌర హక్కుల కార్యకర్త అయిన పాల్ రోబెసన్ తో స్నేహం చేసారు. పాల్ రోబెసన్ వద్ద ఒక గిటార్ ఉండేది. పాల్ రోబెసన్ తన గిటార్ గురించి చెబుతూ ఇలా అనేవారు. ” గిటార్ ఒక సంగీత పరికరం కాదు సమాజంలో మార్పు తెచ్చే పరికరం” అని చెప్పారు.

పాల్ రోబెసన్ మాటలనే ఆచరించి హజారికా తన పాటలను సమాజం లో మార్పు తీసుకు రావటం కోసం పాడేవారు.

కొలంబియా లో చదువుకునే సమయంలో “DEMYSTIFYING DR. BHUPEN HAZARIKA: envisioning education for India” అనే విషయం పై థీసిస్ ను కూడా రాయటం జరిగింది.

చదువును పూర్తి చేసుకున్నాక గౌహాటీ యూనివర్సిటీ లో కొన్ని సంవత్సరాలు పనిచేసారు. టీచర్ యొక్క ఉద్యోగం మానేసి కోల్ కత్తా లో తన సంగీత కెరీర్ ను ప్రారంభించి మంచి పేరును సంపాదించారు.

కెరీర్ :

హజారికా కు 10 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పుడు ఒక పబ్లిక్ ఫంక్షన్ లో బోర్గీట్ అనే సాంప్రదాయ అస్సామీ భక్తి పాటలను పాడినప్పుడు చిత్ర నిర్మాత జ్యోతిప్రసాద్ అగర్వాలా మరియు బిష్ణు ప్రసాద్ రభా అనే ప్రసిద్ధి చెందిన కవి హజారికా యొక్క ట్యాలెంట్ ను గుర్తించారు.

1936 సంవత్సరంలో ఇద్దరి నేతృత్వంలో హజారికా తన మొట్ట మొదటి పాటను రికార్డు చేసారు.

1939 వ సంవత్సరంలో అగర్వాల్ సినిమా అయిన ఇంద్రమాలతి లో మరో రెండు పాటలు పాడారు. కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే పాటలకు లిరిక్స్ ను రాయటం ప్రారంభించారు.

హజారికా శకుంతలా మరియు ప్రతిధ్వని లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తయారు చేసారు. సినిమాలతో పాటు అస్సామీ భాషలో మరియు బెంగాలీ భాషలలో పలు హిట్ పాటలను అందించారు.

1993 వ సంవత్సరంలో అస్సాం సాహిత్య సభ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. 1967 వ సంవత్సరంలో నౌబోయిచా నియోజకవర్గం నుంచి MLA గా గెలిచారు.

2004 వ సంవత్సరంలో లోక్ సభా ఎన్నికలలో బీజేపీ నుంచి గౌహాటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అవార్డులు :

1961 – శకుంతల సినిమాకు అస్సామీలో ఉత్తమ చలనచిత్ర అవార్డు లభించింది.

1977 – పద్మశ్రీ అవార్డు ను పొందారు.

1987 – సంగీత నాటక అకాడమీ అవార్డు ను పొందారు

1992 – దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను పొందారు.

2001 – పద్మ భూషణ్ అవార్డు ను పొందారు.

2012 – పద్మవిభూషణ్ అవార్డును పొందారు.

2019 వ సంవత్సరంలో భారత రత్న అవార్డు ను పొందారు.

వ్యక్తిగత జీవితం :

కొలంబియా యూనివర్సిటీ లో పరిచయం అయిన ప్రియంవద పటేల్ ను 1950 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.

1952 వ సంవత్సరంలో ఈ దంపతులకు కొడుకు తేజ్ హజారీకా పుట్టడం జరిగింది.

మరణం :

2011 వ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలతో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ లో చేరారు. నవంబర్ 5 2011 వ సంవత్సరంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో తుదిశ్వాసను విడిచాగారి రు. భూపేన్ హజారికా గారి అంత్యక్రియలలో అయిదు లక్షల మంది పాల్గొన్నారు.

Source: Bhupen HazarikaWikipedia

Leave a Comment