గరికిపాటి నరసింహారావు సెప్టెంబర్ 14, 1958 వ సంవత్సరం లో జన్మించాడు. ఇతను ఉపన్యాసకుడు, అవధాని మరియు రచయిత. నరసింహారావు వివిధ దేశాలలో అవధానాలు చేసాడు. 2022 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
Table of Contents
బాల్యం :
నరసింహరావు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలం, బోడపాడు గ్రామంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ అనే దంపతులకు జన్మించారు.
నరసింహారావు M. A, M.Phil., P.H.D ను పూర్తి చేసి 30 సంవత్సరాలు టీచర్ గా పనిచేసాడు.
అవధానాలు :
గరికపాటి నరసింహారావు అవధానిగా మంచి పేరును సంపాదించారు. ఇతను 1972 వ సంవత్సరంలో అవధానాలు చేయటం మొదలుపెట్టాడు. 288 కన్నా ఎక్కువ అవధానాలు నిర్వహించారు. అవధానాలు నిర్వహించటంలో నరసింహరావు కు ఉన్న జ్ఞాపక శక్తిని అందరూ మెచ్చుకుంటారు.
2018 వ సంవత్సరం, కోటి దీపోత్సవం సభలో త్వరలో ప్రవచనాలు మరియు ఉపన్యాసాల నుంచి విరమించుకుంటానని ప్రకటించారు.
ప్రజల కోరిక మేరకు తన నిర్ణయాన్ని మార్చుకొని తన ఉపన్యాసాల ద్వారా పరాజయాలకు సహాయం చేద్దామని నిర్ణయించుకున్నారు.
రచనలు :
సాగరఘోష – పద్యకావ్యం
మనభారతం – పద్యకావ్యం
బాష్పగుఛ్ఛం – పద్య కవితా సంపుటి
పల్లవి – పాటలు
సహస్రభారతి
ద్విశతావధానం
ధార ధారణ
కవితా ఖండికా శతావధానం
మౌఖిక సాహిత్యం
పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు
మా అమ్మ – పద్యాలు
అవధాన శతకం – రెండవ సంపుటం
శతావధాన భాగ్యం
శతావధాన విజయం -101 పద్యాలు
Ocean blues
వ్యక్తిగత జీవితం :
గరికపాటి నరసింహారావు జీవిత విధానాన్ని ఎలా మలచుకోవాలో హిందూ సంస్కృతి ను ఆధారం చేసుకొని చెబుతారు.
టీవీ ఛానెలల్లో కూడా ఆధ్యాత్మిక ఉపన్యాసాలను ఇస్తూ ఉంటారు. నరసింహ రావు ఈస్ట్ గోదావరి కి చెందిన శారద ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, తన కొడుకులకు ప్రముఖ మరియు అభిమాన రచయితల పేరు మీదుగా ఒకరి పేరు శ్రీ శ్రీ మరియు రెండవ కొడుకు పేరు గురజాడ అప్పారావు అని పెట్టారు.
అవార్డులు :
18 జనవరి, 2016 వ సంవ్సతరంలో లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు ను పొందారు.
నవంబర్, 2016 వ సంవత్సరంలో గురజాడ విశిష్ట పురస్కారం ను పొందారు.
2018 వ సంవత్సరంలో రామినేని ఫౌండేషన్ అవార్డు ను పొందారు.
2022 వ సంవత్సరం లో పద్మశ్రీ అవార్డు ను పొందారు.
కాంట్రవర్సీ :
2022 సంవత్సరంలో అలయ్ బలయ్ కార్యక్రమం సమయంలో ప్రవచనాలు చేయడానికి గరికపాటి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో హీరో చిరంజీవి మహిళలతో సెల్ఫీ దిగుతున్నారు.
“చిరంజీవి గారు సెల్ఫీలు తీసుకోవటం ఆపాలని లేకపోతే నేను ప్రవచనం చేయను” అని చెప్పారు. గరిక పాటి చూపించిన అసహనం హీరో చిరంజీవి ఫాన్స్ ను నిరాశపరిచింది.