2023 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టో లో 6 గ్యారంటీలు ఉన్నాయి.
Table of Contents
మొదటి గ్యారంటీ:
ఈ మొదటి గ్యారంటీ పేరు మహాలక్ష్మి, ఈ పథకం మొత్తం మూడు హామీలతో కలిసి ఉంటుంది.
మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వటం.
గ్యాస్ సీలిండర్లు కేవలం 500 రూపాయలకు కలిగించటం.
RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కలిగించటం.
ప్రస్తుతం ఈ మూడు హామీలలో RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని మొదలుపెట్టడం జరిగింది.
ఈ పథకం ప్రకారం పల్లె వెలుగు, ఎక్ప్ ప్రెస్ మరియు సిటీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలుగుతుంది.
కానీ సూపర్ లగ్జరీ మరియు గరుడ లాంటి బస్సులలో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఉండదు.
రెండవ గ్యారంటీ :
ఈ రెండవ గ్యారంటీ పేరు రైతు భరోసా, ఈ హామీ రైతులను ఉద్దేశించి ఏర్పాటు చేయబడింది.
ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రైతులు మరియు కౌలు రైతులకు 15000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం 12000 రూపాయాలు వ్యవసాయ కార్మికులకు ఇవ్వటం జరుగుతుంది.
వరి రైతులకు ప్రతి సంవత్సరం ప్రతి క్వింటాల్ వరి సాగుకు 500 రూపాయలు ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది.
మూడవ గ్యారంటీ:
మూడవ గ్యారంటీ పేరు గృహ జ్యోతి, ఈ హామీ ఉచిత విద్యుత్ కి సంబంధించినది
ఈ హామీ ప్రకారం అన్ని ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ఇవ్వటం జరుగుతుంది.
నాల్గవ గ్యారంటీ :
ఈ నాల్గవ గ్యారంటీ పేరు ఇందిరమ్మ ఇండ్లు, ఈ హామీ ప్రకారం ఉద్యమ యోధులు అందరికీ 250 చదరపు గజాలు మరియు ఇల్లు లేని వారికి స్థలం మరియు 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది.
ఐదవ గ్యారంటీ :
ఈ ఐదవ గ్యారంటీ పేరు యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ను ఇవ్వటం జరుగుతుంది.
అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నెటనల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయటం
ఆరవ గ్యారంటీ:
ఈ ఆరవ గ్యారంటీ పేరు చేయూత, ఈ హామీ ప్రకారం వృద్ధులు, వితంతువులకు 4000 పెన్షన్ మరియు ఆర్థికంగా తక్కువ స్థాయి కలిగిన వారికి 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ను ఇవ్వటం జరుగుతుంది.
Credit: https://twitter.com/INCIndia