సీతక్క జీవిత చరిత్ర – Seethakka biography in Telugu

సీతక్క యొక్క పూర్తి పేరు దనసరి అనసూయ. అందరూ ఈమెను సీతక్క అనే పిలుస్తూ ఉంటారు. 

ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. సీతక్క ప్రస్తుతం  తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ మరియు శిశు సంక్షేమం యొక్క మంత్రి గా పనిచేస్తున్నారు. 

పేరు దనసరి అనసూయ (Dansari Anasuya)
ఇతర పేర్లు సీతక్క  (Seethakka)
పుట్టిన తేదీ 9 జూలై 1971
పుట్టిన ప్రాంతం  జగ్గన్నపేట (Jaggannapet)
చదువున్యాయవాది, పొలిటికల్ సైన్స్ లో PHD 
వృత్తిరాజకీయ నాయకురాలు (Politician)
తల్లిదండ్రులుశ్రీరాము (Sri Ramu)
నియోజకవర్గంములుంగ్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్

బాల్యం:  

సీతక్క 9 జులై 1971 వ సంవత్సరంలో జన్మించారు. సీతక్క జగ్గన్నపేట గ్రామంలోని ఆదివాసీ తెగ అయిన కోయ తెగకు చెందిన వారు. 

రాజకీయాలలోకి రాక ముందు సీతక్క నక్సలైట్ గా ఉన్నారు. 1987 వ సంవత్సరంలో కేవలం 14 సంవత్సరాల వయస్సులో జనశక్తి నక్సల్ గ్రూప్ లో చేరారు. 

11 సంవత్సరాల తరవాత నక్సల్ ఉద్యమంతో నిరాశ పొంది 1997 వ సంవత్సరంలో సాధారణ క్షమాభిక్ష ప్రణాళిక కింద పోలీసులకు  లొంగి పోయారు. 

రాజకీయ జీవితం: 

జన జీవన స్రవంతిలోకి కలిసి పోయిన తరవాత సీతక్క తన చదువును కొనసాగించి న్యాయవాది అయ్యారు. 

2022 వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో PHD ను పూర్తి చేసారు. 

సీతక్క 2004 వ సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ములుంగ్ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. 

2009 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య ను భారీ మెజారిటీ తో ఓడించారు. 

2014 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో BRS కాండిడేట్ అజ్మీరా చందూలాల్ సీతక్క ను ఓడించారు.

2017 వ సంవత్సరంలో సీతక్క తెలుగు దేశం పార్టీ ను వదిలేసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. 

కాంగ్రెస్ పార్టీ లో చేరిన తరవాత అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ విభాగానికి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. తరవాత ఛత్తీస్‌గఢ్‌ మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ గా నియమించబడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ లో చేరిన తరవాత 2018 మరియు 2023 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కాండిడేట్ గా పోటీ చేసి గెలిచారు.   

2023 వ సంవత్సరం డిసెంబర్ 7 వ తారీఖున తెలంగాణ కేబినెట్ మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసారు.

ప్రస్తుతం సీతక్క తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ మరియు శిశు సంక్షేమం యొక్క మంత్రి గా పనిచేస్తున్నారు. 

కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు 400 గ్రామాలకు బియ్యం మరియు పప్పు మరియు ఇతర సామాగ్రిని అందించారు. 

ప్రజలకు అవసరమైన సరుకులను మరియు మాస్క్ లను అందించారు. సీతక్క చేసిన సేవలను సోషల్ మీడియా ద్వారా మంచి సపోర్ట్ లభించింది.      

 

Sources: Seethakka – Wikipedia

Leave a Comment