రేవంత్ రెడ్డి యొక్క పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి. ఈయన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి.
బాల్యం:
రేవంత్ రెడ్డి 8 నవంబర్ 1969 వ సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి లో జన్మించారు. రేవంత్ A. V.కాలేజీ నుంచి బ్యాచులర్ అఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తిచేసారు.
రాజకీయ జీవితం:
స్టూడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ ABVP సభ్యుడిగా ఉన్నారు. 2006 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్ ZPTC అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
2007 వ సంవత్సరంలో ఇండిపెండెంట్ MLC (Member of Legislative Council ) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తరవాత ఈయన చంద్రబాబు నాయుడు తో కలిసి తెలుగుదేశం పార్టీ లో చేరారు.
2009 వ సంవత్సరంలో తెలంగాణ ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కొడంగల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి 14,614 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభ యొక్క ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకోబడ్డారు.
2017 వ సంవత్సరంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని సమాచారం రావటంతో ఫ్లోర్ లీడర్ గా తొలగించబడ్డారు.
2018 లో జరిగిన అసెంబ్లీ ఏన్నికలలో కొడంగల్ లో కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి TRS అభ్యర్థి తో ఓడిపోయారు. 2018 వ సంవత్సరంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) యొక్క ప్రెసిడెంట్ గా నియమించబడ్డారు.
2023 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ మరియు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసారు.
కామారెడ్డి లో బీజేపీ అభ్యర్థి గెలవగా కొడంగల్ లో రేవంత్ 32532 ఓట్ల భారీ మెజారిటీ తో గెలిచారు.
వివాదం:
2015 వ సంవత్సరంలో ఏసీబీ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో రేవంత్ రెడ్డి MLA ఎల్విస్ స్టీఫెన్‌సన్ ను టీడీపీకి మద్దతుగా ఓటు వేయమని లంచం ఇస్తూ పట్టుబడ్డారు.
Source: Revanth Reddy – Wikipedia